newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

అక్కడ ఆ రైళ్ళకు హాల్ట్ సౌకర్యం క్యాన్సిల్

03-06-202003-06-2020 10:07:41 IST
Updated On 03-06-2020 11:27:26 ISTUpdated On 03-06-20202020-06-03T04:37:41.741Z03-06-2020 2020-06-03T04:37:24.510Z - 2020-06-03T05:57:26.573Z - 03-06-2020

అక్కడ ఆ రైళ్ళకు హాల్ట్ సౌకర్యం క్యాన్సిల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా రైళ్ళు రాకపోకలు నిలిచిపోయాయి. తిరిగి మళ్లీ ఆ సేవలు ప్రారంభం అయ్యాయి. గుంటూరు రైల్వే డివిజన్‌ మీదుగా రాకపోకలు సాగిస్తోన్న గోల్కొండ, ఫలక్‌నుమా స్పెషల్‌ రైళ్లకు కొన్ని చిన్న రైల్వేస్టేషన్లలో నిలుపుదల సౌకర్యాన్ని రైల్వే శాఖ తొలగించింది. చిన్న స్టేషన్లలో ప్రయాణికులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌, కొవిడ్‌ పరీక్షల నిర్వహణలో  సమస్యలు తలెత్తుతోన్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 

ఫలక్‌నుమా స్పెషల్‌ ట్రైన్‌కు పిడుగురాళ్ల, తాడేపల్లిగూడెం, సామర్లకోట, పలాస, ఇచ్చాపురం ఎత్తివేశారు. ఈ రైలు బుధవారం నుంచి ఏపీలో గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డులో మాత్రమే నిలుపుదల సౌకర్యం కల్పించారు. గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌కి పెదకాకాని, నంబూరు, మంగళగిరి, కృష్ణాకెనాల్‌, రాయనపాడు, కొండపల్లి రైల్వేస్టేషన్లలో నిలుపుదల సౌకర్యాన్ని తొలగించారు. 

అయితే, ఇప్పటికే ఈ స్టేషన్లకు, ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు టిక్కెట్‌లు బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులకు 100 శాతం రీఫండ్‌ సౌకర్యాన్ని కల్పించారు. రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ప్రయాణాన్ని సోమవారం నిలిపేసిన రైల్వే శాఖ ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పునరుద్ధరించింది. మొత్తం మీద రైల్వే శాఖ తాజా నిర్ణయాలను ప్రయాణికులు గమనించాలని కోరింది. ప్రయాణికులు రెండుగంటల ముందే రైల్వే స్టేషన్ కు రావాలని సూచించింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle