newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

600 రోజుల చెల్లుబాటు... బీఎస్ఎన్ఎల్ నయా ప్లాన్

26-05-202026-05-2020 12:03:28 IST
Updated On 26-05-2020 15:12:31 ISTUpdated On 26-05-20202020-05-26T06:33:28.034Z26-05-2020 2020-05-26T06:32:47.772Z - 2020-05-26T09:42:31.181Z - 26-05-2020

600 రోజుల చెల్లుబాటు... బీఎస్ఎన్ఎల్ నయా ప్లాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గతంలో టెలికాం కంపెనీలు లైఫ్ టైం ఇన్ కమింగ్ ఫ్రీ అని ఊదరగొట్టి వినియోగదారుల సంఖ్యను బాగా పెంచేసుకున్నాయి. అయితే తర్వాత రాబడి తగ్గిపోవడంతో ప్రతి నెలా కనీస రీఛార్జి చేయాల్సిందే అని షరతులు పెట్టాయి. మొబైల్ డేటా బాగా వాడుకునేవారు అయితే ఫర్వాలేదు. కానీ కేవలం ఇన్ కమింగ్ ఎక్కువగా వాడుకుని, అప్పుడప్పుడు అవుట్ గోయింగ్ చేసుకునేవారికి భారత ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ అద్భుతమయిన ఆఫర్ అందిస్తోంది. 

తక్కువ మొత్తంలో డేటాను వాడుతూ అధికంగా ఫోన్ కాల్స్ చేసే వినియోగదారుల కోసం బిఎస్ఎన్ఎల్  ఏకంగా 600 రోజుల చెల్లుబాటు కాలంతో కొత్త ప్లాన్ ను విడుదల చేసింది. అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందించే అనేక ప్లాన్లు ఈ కొత్త ప్లాన్ డేటాను వాడని వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ రూ.2,399 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు అపరిమిత కాలింగ్ అనుభవాన్ని ఇవ్వడంపై అధిక దృష్టి పెట్టింది. ఇది రీఛార్జ్ చేసిన రోజు నుండి 600 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది

టెలికామ్ మార్కెట్లో ఇతర ప్లాన్లు ఏవీ ఈ రకమైన యాక్సిస్ తో ఇన్ని రోజుల వాలిడితో లేకపోవడం బీఎస్ఎన్ఎల్ కి అడ్వాంటేజ్ అనే చెప్పాలి. కానీ ఈ ప్లాన్ లో  డేటా వాడుకోవడానికి అవకాశం లేదు. ఈ ప్లాన్ మీకు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100SMS మరియు 60 రోజుల పాటు బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి కాని డేటా ప్రయోజనం మాత్రం ఏదీ లేదు. మీకు డేటా కావాలంటే మాత్రం వేరే ప్యాక్ తో రీఛార్జి చేసుకోవాలి.  దీర్ఘకాలిక వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని మాత్రమే కోరుకునే వినియోగదారులకు ఇది ఉత్తమమయినది. ఏదేమైనా ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు అధికంగా 600 రోజులపాటు ఉండడం ప్రత్యేకతగా చెప్పాలి. కేవలం రూ.2,399 ప్లాన్ అన్ని సర్కిల్‌లలో అందుబాటులో ఉంది. అంటే కేవలం నెలకు 120రూపాయలు చెల్లిస్తే చాలు. 20 నెలల పాటు అపరిమిత కాలింగ్ సదుపాయం మీచేతిలో వుంటుంది. 

ఎయిర్ టెల్.. వోడాఫోన్.. జియో ఏడాది ప్లాన్స్ 

భారతి ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు లాంగ్-టర్మ్ ప్లాన్ కింద రెండు ప్లాన్స్ అందుబాటులో వుంచింది. రెండు ధరల వద్ద రెండు ప్లాన్ లను అందిస్తోంది. రూ.2,398 వోచర్ తో 365 రోజుల చెల్లుబాటుతో అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMS లతో పాటుగా 1.5GB రోజువారీ డేటా ప్రయోజనం అందిస్తోంది. అలాగే రూ.2498 ధర వద్ద 2GB రోజువారీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలతో అదే 365రోజుల వాలిడిటీతో మరొక ప్లాన్ ఇస్తోంది. 

ఇక రిలయన్స్ జియో 2,399 రూపాయలకు లాంగ్-టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. జియో నుండి ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం 365 రోజుల చెల్లుబాటు కలిగి వుంది. కానీ బిఎస్‌ఎన్‌ఎల్ నుండి వచ్చిన ప్లాన్‌తో పోల్చినప్పుడు అదే ధర వద్ద ఇప్పటికీ తక్కువ వాలిడిటీని కలిగి ఉంది .వోడాఫోన్ సంస్థ రూ.2,399 ధర వద్ద లాంగ్ -టర్మ్ ప్లాన్ ను అందిస్తున్నది.

ఈ ప్లాన్ తన వినియోగదారులకు 1.5GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMSల ప్రయోజనాలను అందిస్తుంది. ఇవే కాకుండా ప్రత్యేక ప్రయోజనాలలో 499 రూపాయల విలువైన వోడాఫోన్ ప్లే మరియు రూ.999 విలువైన జీ5 ప్రీమియానికి కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తోంది. వోడాఫోన్ అందిస్తున్న ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటు కలిగి వుంది. ఎయిర్ టెల్ మరియు వోడాఫోన్ ఎటువంటి ఐయుసి పరిమితులు లేకుండా అపరిమిత కాలింగ్ సదుపాయంతో జియో కంటే ముందు వరుసలో ఉన్నాయి.

 

టిక్ టాక్ పై నిషేధం.. లోకల్ యాప్‌ చట్ పట్‌కు  గిరాకీ

టిక్ టాక్ పై నిషేధం.. లోకల్ యాప్‌ చట్ పట్‌కు గిరాకీ

   04-07-2020


వాట్సాప్ మరింత ఆకర్షణీయం.... కొత్తగా ఐదు ఫీచర్లు

వాట్సాప్ మరింత ఆకర్షణీయం.... కొత్తగా ఐదు ఫీచర్లు

   03-07-2020


తన రికార్డు తనే బ్రేక్ చేసిన అమెజాన్ సీఈవో

తన రికార్డు తనే బ్రేక్ చేసిన అమెజాన్ సీఈవో

   02-07-2020


చింగారి' ఉండగా టిక్ టాక్ ఇక ఎందుకు.. గంటలోపే లక్షమంది డౌన్ లోడ్

చింగారి' ఉండగా టిక్ టాక్ ఇక ఎందుకు.. గంటలోపే లక్షమంది డౌన్ లోడ్

   01-07-2020


ఐపీఎల్ 2020పై చైనా ఎఫెక్ట్.. వివోపై బీసీసీఐ కీలక నిర్ణయం?

ఐపీఎల్ 2020పై చైనా ఎఫెక్ట్.. వివోపై బీసీసీఐ కీలక నిర్ణయం?

   01-07-2020


టిక్ టాక్ పై బ్యాన్. ... డేవిడ్ వార్నర్‌పై సెటైర్లు

టిక్ టాక్ పై బ్యాన్. ... డేవిడ్ వార్నర్‌పై సెటైర్లు

   30-06-2020


టిక్ టాక్‌కి ఇండియా స్ట్రాంగ్ పంచ్.. ప్లే స్టోర్ నుంచి ఔట్

టిక్ టాక్‌కి ఇండియా స్ట్రాంగ్ పంచ్.. ప్లే స్టోర్ నుంచి ఔట్

   30-06-2020


బ్రేకింగ్: ఇండియా సీరియస్ యాక్షన్.. 59 యాప్స్‌పై నిషేధం

బ్రేకింగ్: ఇండియా సీరియస్ యాక్షన్.. 59 యాప్స్‌పై నిషేధం

   29-06-2020


నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అమెజాన్లో అవకాశాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అమెజాన్లో అవకాశాలు

   29-06-2020


గూగుల్ పే పై నిషేధమా? ఎన్ పిసీఐ  వివరణ

గూగుల్ పే పై నిషేధమా? ఎన్ పిసీఐ వివరణ

   27-06-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle