newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

వాట్సాప్ మరింత ఆకర్షణీయం.... కొత్తగా ఐదు ఫీచర్లు

03-07-202003-07-2020 14:22:48 IST
Updated On 03-07-2020 15:33:30 ISTUpdated On 03-07-20202020-07-03T08:52:48.755Z03-07-2020 2020-07-03T08:52:18.346Z - 2020-07-03T10:03:30.017Z - 03-07-2020

వాట్సాప్ మరింత ఆకర్షణీయం.... కొత్తగా ఐదు ఫీచర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిద్రలేచింది మొదలు నిద్రపోయేవరకూ.. అంతెందుకు నిద్రలో కూడా స్మార్ట్ ఫోన్ చూడకుండా ఉండలేని పరిస్థితి ఇది. స్మార్ట్ ఫోన్లో అనేక యాప్ లు వచ్చిపడుతున్నాయి. వీటికి తోడు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు కూడా అనేకం వున్నాయి. ఫేస్ బుక్ తో పాటు వాట్సాప్ వినియోగం కూడా బాగా పెరిగింది. తాజాగా భారత్ టిక్ టాక్ తో సహా 59 చైనీస్ యాప్స్ పై నిషేధం విధించింది. 

వినియోగదారుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్‌లో త్వరలో మరో ఐదు కొత్త ఫీచర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కంపెనీ ఒక  ప్రకటన విడుదల చేసింది. వెబ్​ వాట్సాప్​కు డార్క్ మోడ్​, క్వాలిటీ వీడియో కాల్స్​, కైఓఎస్​కు మాయమైపోయే స్టేటస్​, యానిమేటెడ్​ స్టిక్కర్స్, క్యూఆర్​ కోడ్స్‌లను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని సంస్థ ప్రకటించింది.

వెబ్​ వాట్సాప్​కు డార్క్ మోడ్​: ఇదివరకు ఆండ్రాయిడ్, ఐఓఎస్ లకు మాత్రమే డార్క్ మోడ్ అందుబాటులో ఉండగా ఇప్పుడు వెబ్ వర్షన్ కు కూడా అందుబాటులోకి రానుంది. 

క్వాలిటీ వీడియో కాల్స్: వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ పై నొక్కితే ఆ భాగంలో క్లారిటీ ఎక్కువ వచ్చేలా రూపొందిస్తున్నారు. 

యానిమేటెడ్​ స్టిక్కర్స్ : వాట్సాప్ లో మరింత ఫన్ కోసం ఫన్నీ యానిమేటెడ్‌ స్టిక్కర్లు రానున్నాయి. ఈ స్టిక్కర్లు పిల్లల్ని కూడా అలరించనున్నాయి. 

కైఓఎస్​కు మాయమైపోయే స్టేటస్: స్టేటస్ దానంతట అదే మాయమైపోయే ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్​లలో ఉండగా.. ఇకపై కైఓఎస్​కు కూడా అందుబాటులోకి రానుంది. 

క్యూఆర్​ కోడ్స్ :క్యూ ఆర్ కోడ్ ద్వారా వ్యక్తి కాంటాక్ట్ ను స్కాన్ చేసి, సేవ్ చేసుకునే సదుపాయం వుంటుంది. ఎప్పుడైనా అతనితో మాట్లాడాలంటే మనం సేవ్ చేసుకున్న వివరాలనుంచి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle