newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

వాట్సాప్‌తో ...ఇక గ్యాస్ బుకింగ్ కష్టాలకు చెక్

28-05-202028-05-2020 11:23:33 IST
Updated On 28-05-2020 11:32:16 ISTUpdated On 28-05-20202020-05-28T05:53:33.861Z28-05-2020 2020-05-28T05:53:27.566Z - 2020-05-28T06:02:16.949Z - 28-05-2020

వాట్సాప్‌తో ...ఇక గ్యాస్ బుకింగ్ కష్టాలకు చెక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిందా? వెంటనే మీరు వంట గ్యాస్ సిలిండర్‌ను సంబంధిత గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్లిగానీ, లేదా ఫోన్ ద్వారా బుకింగ్ చేసుకుంటుంటారు. డెలివరీకి కాస్త టైం పడుతుంది. కానీ ఇకపై వాట్సాప్‌ నుంచి కూడా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ సందర్బంగా గ్యాస్ బుకింగ్ చేసే ప్రక్రియను కూడా సంస్థ వివరించింది. మీరు బీపీసీఎల్ అంటే భారత్ గ్యాస్ కస్టమర్ అయితే బీపీసీఎల్ కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 1800224344 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. కస్టమర్లకు గ్యాస్ సిలిండర్ బుకింగ్ మరింత సులభతరం చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఈ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని.. మొబైల్ కు వచ్చే లింక్ ను ఓపెన్ చేసి డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులతో పాటు యూపీఐ చెల్లింపుల ద్వారా పేమెంట్ చేయవచ్చునని బీపీసీఎల్ సంస్థ తెలిపింది.

దేశవ్యాప్తంగా బీపీసీఎల్ సంస్థకు ప్రస్తుతం 7.1 కోట్ల మంది ఎల్‌పీజీ వినియోగదారులు ఉన్నారు. ముందుగా మీరు మీ మొబైల్ నెంబర్ ను రిజిస్టర్ చేయించుకోవాలి. ఆ తర్వాతే ఈ సదుపాయం పొందవచ్చు. దీని ద్వారా త్వరగా గ్యాస్ బుకింగ్ జరుగుతుందని కంపెనీ చెబుతోంది. దేశవ్యాప్తంగా ఇండియన్ ఆయిల్‌కు అతిపెద్ద చమురు మార్కెట్ ఉండగా, భారత్ పెట్రోలియం రెండో స్థానంలో ఉంది.గత కొద్దికాలంగా వాట్సాప్ అందరూ ఉపయోగిస్తున్నారని, ఈ ప్లాట్ ఫామ్ అందరికి ఉపయుక్తంగా ఉంటుందని సంస్థ తెలిపింది. ఇప్పటికే ఐవీఆర్ఎస్, మిస్డ్ కాల్, యాప్స్, వెబ్ సైట్ తదితర డిజిటల్ ఛానల్స్ ద్వారా ఎల్పీజీ బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. 

 

టిక్ టాక్ పై నిషేధం.. లోకల్ యాప్‌ చట్ పట్‌కు  గిరాకీ

టిక్ టాక్ పై నిషేధం.. లోకల్ యాప్‌ చట్ పట్‌కు గిరాకీ

   04-07-2020


వాట్సాప్ మరింత ఆకర్షణీయం.... కొత్తగా ఐదు ఫీచర్లు

వాట్సాప్ మరింత ఆకర్షణీయం.... కొత్తగా ఐదు ఫీచర్లు

   03-07-2020


తన రికార్డు తనే బ్రేక్ చేసిన అమెజాన్ సీఈవో

తన రికార్డు తనే బ్రేక్ చేసిన అమెజాన్ సీఈవో

   02-07-2020


చింగారి' ఉండగా టిక్ టాక్ ఇక ఎందుకు.. గంటలోపే లక్షమంది డౌన్ లోడ్

చింగారి' ఉండగా టిక్ టాక్ ఇక ఎందుకు.. గంటలోపే లక్షమంది డౌన్ లోడ్

   01-07-2020


ఐపీఎల్ 2020పై చైనా ఎఫెక్ట్.. వివోపై బీసీసీఐ కీలక నిర్ణయం?

ఐపీఎల్ 2020పై చైనా ఎఫెక్ట్.. వివోపై బీసీసీఐ కీలక నిర్ణయం?

   01-07-2020


టిక్ టాక్ పై బ్యాన్. ... డేవిడ్ వార్నర్‌పై సెటైర్లు

టిక్ టాక్ పై బ్యాన్. ... డేవిడ్ వార్నర్‌పై సెటైర్లు

   30-06-2020


టిక్ టాక్‌కి ఇండియా స్ట్రాంగ్ పంచ్.. ప్లే స్టోర్ నుంచి ఔట్

టిక్ టాక్‌కి ఇండియా స్ట్రాంగ్ పంచ్.. ప్లే స్టోర్ నుంచి ఔట్

   30-06-2020


బ్రేకింగ్: ఇండియా సీరియస్ యాక్షన్.. 59 యాప్స్‌పై నిషేధం

బ్రేకింగ్: ఇండియా సీరియస్ యాక్షన్.. 59 యాప్స్‌పై నిషేధం

   29-06-2020


నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అమెజాన్లో అవకాశాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అమెజాన్లో అవకాశాలు

   29-06-2020


గూగుల్ పే పై నిషేధమా? ఎన్ పిసీఐ  వివరణ

గూగుల్ పే పై నిషేధమా? ఎన్ పిసీఐ వివరణ

   27-06-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle