newssting
BITING NEWS :
*ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 65.31 లక్షలు... ఇప్పటి వరకు 3.86 లక్షల మంది మృతి*విశాఖ...డా.సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మార్పులు.సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మళ్ళీ మార్పు. డా.మాధవి లత స్థానంలో డా.సుబ్రహ్మణ్యం * గ్రేటర్ హైద్రాబాద్ లో కరోనా పంజా.వారం రోజుల వ్యవధి లోనే కొత్తగా 500పైగా కరోనా కేసులు *ఎల్ జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై నేడు హైపవర్‌ కమిటీ విచారణ *నేడు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ*వైఎస్సార్‌ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల .. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌ * సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశం *తిరుమల: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక జేష్టాభిషేకం ఉత్సవాలు, ఏకాంతంగానే ఉత్సవాల నిర్వహణ.. ఇవాళ ఉత్సవ మూర్తులకు వజ్రకవచ ధారణ* తెలంగాణలో కొత్తగా 129 కొత్త కేసులు. మొత్తం 3020కి చేరిన పాజిటివ్ కేసులు.. మరో ఏడుగురు మృతి *ఈనెల 8 నుంచి హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు? 78 రోజులుగా హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు బంద్. అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమావేశం. అంతరాష్ట్ర బస్ సర్వీసులపై చర్చబెజవాడ గ్యాంగ్ వార్ పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ గ్యాంగ్ వార్ లో ఎంత వారున్నా వదిలే ప్రసక్తే లేదు - ఏపీ డీజీపీ

వాట్సప్‌ను తెగ వాడేస్తున్న భారత్.. 41 శాతం పెరిగిన యూజర్లు

29-03-202029-03-2020 09:08:32 IST
2020-03-29T03:38:32.956Z29-03-2020 2020-03-29T03:38:31.048Z - - 04-06-2020

వాట్సప్‌ను తెగ వాడేస్తున్న భారత్.. 41 శాతం పెరిగిన యూజర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో జనజీవితం స్తంభించిపోయిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో కీలకమైన వాట్సాప్, ఫేస్‍‌బుక్‌లను దేశ ప్రజలు వాడిపడేస్తున్నారని సమాచారం. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. గడప దాటి కాళ్లు బయటపెట్టలేని పరిస్థితి కారణంగా ప్రజలంతా సామాజిక మాధ్యమాలపై పడ్డారు. దీంతో వాట్సప్‌, ఫేస్‌బుక్‌ను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. 

కరోనా వైరస్‌ ప్రభావంతో సోషల్‌ మీడియా దిగ్గజం వాట్సప్‌లో నెటిజన్లు గడిపే కాలం అమాంతం పెరిగిపోయింది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మొదట్లో 27 శాతం పెరిగిన యూజర్ల సంఖ్య.. కరోనా మొదట దశ ముగిసే సరికి ఆ సంఖ్య 41 శాతానికి పెరిగింది. ఇక వైరస్‌ రెండోదశకు చేరుకుని తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ.. ఏకంగా 51శాతానికి పెరిగిందని ఓ సంస్థ చేపట్టిన సర్వేలో తేలింది. వీరిలో 40శాతానికిపైగా 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల వారేకావడం గమనార్హం. 

అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌ వాడకం 50శాతం పెరిగిందని ఆ సంస్థ తన సర్వేలో పేర్కొంది. వాట్సప్‌తో పాటు మెస్సెంజర్‌ వాడకంలో 70శాతం ఇటలీ తొలిస్థానంలో నిలవగా.. వీడియో కాల్స్‌ మాట్లడం ఒక్కసారిగా 1000శాతం పెరిగింది. కాగా భారత్‌తో పాటు ప్రపంప వ్యాప్తంగా పలు దేశాల్లో లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. వీరంత సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేస్తున్నారు.

ఇక సెలబ్రెటీలు సైతం సోషల్‌ మీడియా ద్వారా కరోనాపై ప్రజలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. దీంతో వారిని అనుసరించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మరోవైపు పలు సాఫ్ట్‌వేర్‌ సంస్థలతో పాటు ప్రైవేటు కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోం (ఇంటి నుంచి పని) పద్దతిని అవలంభిస్తున్నాయి. దీంతో ఉద్యోగులంతా సమాచారం కోసం వాట్సప్‌ గ్రూపులు, వీడియోలు కాల్స్‌ చేయడం ఎక్కువగా జరుగుతోంది. దీంతో సాధారణంగానే సోషల్‌మీడియా వాడటం పెరుగుతోంది. అంతేకాక సోషల్‌ మీడియాలో యువత ముచ్చట్లు, చాటిం‍గ్స్‌ కూడా ఎక్కువే.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాపై చేస్తున్న హెచ్చరికలను కూడా వాట్సాప్ అందిస్తుండటంతో ప్రజలు వాట్సాప్ పట్ల గతంలో కంటే మక్కువ పెంచుకుంటున్నారు. తమ సంస్థ ఇటీవలే ప్రారంభించిన డబ్ల్యూహెచ్ఓ హెల్త్ అలర్ట్‌పై ఇప్పటికే 10 లక్షలమంది ప్రజలు సైన్ చేశారని వాట్సాప్ అధినేత విల్ కాత్‌కార్ట్ చెప్పారు. ప్రజలకు మంచి, కచ్చితమైన, నమ్మదగిన సమచారాన్ని ఇస్తున్నాం కాబట్టే మాపై ఆదరణ పెరుగుతోందని, దీనికి తామెంతో సంతోషిస్తున్నట్లు విల్ చెప్పారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle