newssting
BITING NEWS :
*ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 65.31 లక్షలు... ఇప్పటి వరకు 3.86 లక్షల మంది మృతి*విశాఖ...డా.సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మార్పులు.సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మళ్ళీ మార్పు. డా.మాధవి లత స్థానంలో డా.సుబ్రహ్మణ్యం * గ్రేటర్ హైద్రాబాద్ లో కరోనా పంజా.వారం రోజుల వ్యవధి లోనే కొత్తగా 500పైగా కరోనా కేసులు *ఎల్ జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై నేడు హైపవర్‌ కమిటీ విచారణ *నేడు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ*వైఎస్సార్‌ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల .. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌ * సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశం *తిరుమల: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక జేష్టాభిషేకం ఉత్సవాలు, ఏకాంతంగానే ఉత్సవాల నిర్వహణ.. ఇవాళ ఉత్సవ మూర్తులకు వజ్రకవచ ధారణ* తెలంగాణలో కొత్తగా 129 కొత్త కేసులు. మొత్తం 3020కి చేరిన పాజిటివ్ కేసులు.. మరో ఏడుగురు మృతి *ఈనెల 8 నుంచి హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు? 78 రోజులుగా హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు బంద్. అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమావేశం. అంతరాష్ట్ర బస్ సర్వీసులపై చర్చబెజవాడ గ్యాంగ్ వార్ పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ గ్యాంగ్ వార్ లో ఎంత వారున్నా వదిలే ప్రసక్తే లేదు - ఏపీ డీజీపీ

భారత్‌కు లక్షలాది ‘ఎన్‌95’ మాస్కుల ఉచిత పంపిణీకి షావోమి సిద్ధం

25-03-202025-03-2020 14:39:36 IST
2020-03-25T09:09:36.273Z25-03-2020 2020-03-25T09:09:33.490Z - - 04-06-2020

భారత్‌కు లక్షలాది ‘ఎన్‌95’ మాస్కుల ఉచిత పంపిణీకి షావోమి సిద్ధం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘షావోమి’.. భారత్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులు, కార్యాలయాలు, పోలీసులకు అత్యంత నాణ్యత కలిగిన ఎన్‌95 మాస్కులను లక్షల సంఖ్యలో ఉచితంగా పంపిణీ చేస్తోంది. వైరస్‌ కారణంగా వీటి ధర 18 రెట్లు వరకు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఈ మాస్కులను ఉచితంగా పంపిణీ చేస్తూ కంపెనీ తన దాతృత్వాన్ని చాటుకుందని ప్రభుత్వ ఉన్నత అధికారి ఒకరు సోమవారం మీడియాకు తెలిపారు. 

సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వాలకు ఈ వారంలో మాస్కులు, రక్షణ జాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మను జైన్‌ ఉద్యోగులకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు.  

మొబైల్ తయారీ రంగంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న షావోమీ ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో నాణ్యతతో కూడిన ఎన్95 మాస్కులను ప్రభుత్వ ఆసుపత్రులకు అందించనున్నట్లు తాజా ప్రకటనలో తెలిపింది. అలాగే ఎయిమ్స్ వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లోని డాక్టర్లకు అత్యవసరమైన హజ్‌మట్ బాడీ సూట్లను కూడా షావోమీ విరాళంగా అందించనుంది.

షావోమీ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మను జైన్‌ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా తన ఉద్యోగులను ఇప్పటికే వాణిజ్య పర్యటనలకు, విదేశీ యాత్రలకు వెళ్లకుండా ఆంక్షలు విధించినట్లు తెలిపారు. తన ఉద్యోగులను, వ్యాపార భాగస్వాములను బహిరంగ స్థలాల్లో మాస్కులను ధరించాలని ఆదేశించినట్లు చెప్పారు. 

అలాగే దేశంలోని తన కార్పొరేట్ ఆఫీసులు, వేర్ హౌస్‌లు, సర్వీస్ కేంద్రాలు, ఎమ్ఐ హోమ్ మరియు తయారీ ప్లాంట్లు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌కు పూర్తిగా కట్టుబడి ఉంటాయని జైన్ హామీని ఇచ్చారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle