newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అమెజాన్లో అవకాశాలు

29-06-202029-06-2020 19:03:05 IST
Updated On 30-06-2020 09:31:20 ISTUpdated On 30-06-20202020-06-29T13:33:05.545Z29-06-2020 2020-06-29T13:32:47.465Z - 2020-06-30T04:01:20.620Z - 30-06-2020

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అమెజాన్లో అవకాశాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా జనమంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. షాపులకు వెళ్లి వస్తువులు కొనడం లాక్ డౌన్ సడలింపుల తర్వాతే ఆన్ లైన్ షాపింగ్ ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ పెద్దఎత్తున తాత్కాలిక ఉద్యోగాలకు అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

హైదరాబాద్‌ సహా దేశంలోని 11 ప్రధాన నగ రాల్లో 20వేల మంది తాత్కాలిక ఉద్యోగుల్ని నియమించనున్నట్టు తెలిపింది. దీని ద్వారా ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు, మీ ఇంటి నుంచే తమ వీలును బట్టి భారత్‌తో పాటు అమెజాన్‌ అంత ర్జాతీయ కస్టమర్లకు సేవలు అందించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్‌ పాసై ఇంగ్లీషు, ఆయా ప్రాంతీయ భాషా నైపుణ్యాలు ఉన్న వ్యక్తులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాల కాలపరిమితి ఆరు నెలలే అయినా, అవసరాన్ని బట్టి కొంతమందిని పర్మినెంట్‌ చేసే అవకాశం ఉందని అమెజాన్ ప్రకటించింది. 

ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిని అమెజాన్ రిక్రూట్ చేసుకుంటోంది. డిమాండ్ కు తగ్గట్లు సకాలంలో వస్తువులను సరఫరా చేసేందుకు కంపెనీ చర్యలు చేపట్టింది. రానురాను ఆన్ లైన్ షాపింగ్ మరింత ముందుకి వెళ్లనుంది. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా దేశాల్లో షట్ డౌన్ పరిస్థితి నెలకొంది. వైరస్ భయంతో ప్రజలందరూ ఇంటికే పరిమితమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోకి అవసరమైన వస్తువులపై జనం ఆన్ లైన్ సైట్లపైనే ఆధారపడుతున్నారు. దీంతో డిమాండ్ పెరిగిపోవడంతో అమెజాన్ అదనంగా వర్కర్లను నియమించుకుంటోంది.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle