newssting
BITING NEWS :
*ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 65.31 లక్షలు... ఇప్పటి వరకు 3.86 లక్షల మంది మృతి*విశాఖ...డా.సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మార్పులు.సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మళ్ళీ మార్పు. డా.మాధవి లత స్థానంలో డా.సుబ్రహ్మణ్యం * గ్రేటర్ హైద్రాబాద్ లో కరోనా పంజా.వారం రోజుల వ్యవధి లోనే కొత్తగా 500పైగా కరోనా కేసులు *ఎల్ జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై నేడు హైపవర్‌ కమిటీ విచారణ *నేడు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ*వైఎస్సార్‌ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల .. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌ * సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశం *తిరుమల: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక జేష్టాభిషేకం ఉత్సవాలు, ఏకాంతంగానే ఉత్సవాల నిర్వహణ.. ఇవాళ ఉత్సవ మూర్తులకు వజ్రకవచ ధారణ* తెలంగాణలో కొత్తగా 129 కొత్త కేసులు. మొత్తం 3020కి చేరిన పాజిటివ్ కేసులు.. మరో ఏడుగురు మృతి *ఈనెల 8 నుంచి హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు? 78 రోజులుగా హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు బంద్. అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమావేశం. అంతరాష్ట్ర బస్ సర్వీసులపై చర్చబెజవాడ గ్యాంగ్ వార్ పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ గ్యాంగ్ వార్ లో ఎంత వారున్నా వదిలే ప్రసక్తే లేదు - ఏపీ డీజీపీ

దంపతుల మధ్య పెరిగిన రొమాన్స్.. వాటికి భారీ డిమాండ్

28-03-202028-03-2020 19:14:53 IST
2020-03-28T13:44:53.035Z28-03-2020 2020-03-28T13:40:09.208Z - - 04-06-2020

దంపతుల మధ్య పెరిగిన రొమాన్స్.. వాటికి భారీ డిమాండ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్వీయ నిర్బంధం కారణంగా దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ దంపతుల్ని బాగా కలిపేస్తోంది. ఇంతకుముందు మార్నింగ్ డ్యూటీలో భార్య.. నైట్ డ్యూటీలో భర్త ఉండేవారు. కరోనా వైరస్ వల్ల వాళ్ళ డ్యూటీలు మారిపోయాయి. ఇద్దరూ వర్క్ ఫ్రం హోంతో ఇంట్లోనే వుంటున్నారు. తమకు నచ్చిన పనులు చేస్తున్నారు. తమకు ఖాళీ సమయాన్ని రొమాన్స్ కోసం కేటాయిస్తున్నారు. 

పిల్లలు లేని దంపతులు, పని వత్తిడి కారణంగా పిల్లల గురించి గతంలో ఆలోచించని వారు ఇప్పుడు పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు లేకుండా కారణంగా గర్భనిరోధక పిల్స్ వాడుతున్నారు. అలాగే కండోమ్ ల వాడకం భారీగా పెరిగింది. మెడికల్ షాపుల్లో వివిధ రకాల మందులతో పాటు కండోమ్స్ కూడా విధిగా తీసుకుంటున్నట్టు సర్వేలో తేలింది. 

జనవరి నుంచి ఇప్పటివరకూ కండోమ్స్ వాడకం 200 శాతం పెరిగింది. అమెరికా, కెనడా, సౌత్ కొరియా లాంటి దేశాల్లో వీటికి డిమాండ్ ఎక్కువైంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో కండోమ్‌ల ఉత్ప‌త్తి కూడా త‌గ్గిందని తెలుస్తోంది. ప్ర‌పంచంలో అత్య‌ధిక సంఖ్య‌లో కండోమ్‌ల‌ను ఉత్ప‌త్తి చేసే కేరెక్స్ బెర్‌హాద్ సంస్థ దీనిపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది.  మ‌లేషియాకు చెందిన ఈ కంపెనీ గ‌త వారం నుంచి ఒక్క  కండోమ్‌ను కూడా ఉత్ప‌త్తి చేయ‌లేకపోయింది. 

ఆ కంపెనీకి మ‌లేషియాలో మూడు ఫ్యాక్ట‌రీలు ఉన్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అయిదుగురిలో ఒక‌రు వినియోగించేది ఆ కంపెనీ కండోమే. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఆంక్ష‌లు క‌ఠినంగా ఉన్నాయి. దీంతో కండోమ్‌ల ఉత్ప‌త్తి ఆగిపోయిందని సంస్థ తెలిపింది.  ఇప్ప‌టికే వంద మిలియ‌న్ల కండోమ్‌ల కొర‌త ఉందని, డిస్ట్రిబ్యూటర్ల నుంచి తరచూ తమకు వత్తిడి వస్తోందని సంస్థ వెల్లడించింది. డ్యూరెక్స్ లాంటి మేటి బ్రాండ్‌ కండోమ్‌ల‌ను ఈ సంస్థ‌నే ఉత్ప‌త్తి చేస్తుంది. బ్రిట‌న్‌కు చెందిన ఎన్‌హెచ్ఎస్‌తో పాటు ఐక్య‌రాజ్య‌స‌మితి చేప‌ట్టే అనేక కార్య‌క్ర‌మాల‌కు ఈ కంపెనీ కండోమ్‌ల‌ను పంపిణీ చేస్తుంది. కండోమ్‌ల ఉత్ప‌త్తికి అనుమతి లభించింది. అయితే ఉద్యోగుల కొరత కారణంగా 50 శాతం మాత్ర‌మే ఉత్ప‌త్తి జరుగుతోందని పేర్కొంది. 

మ‌లేషియాలో ఇప్ప‌టి వ‌ర‌కు  మూడు వేల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 26 మంది మ‌ర‌ణించారు. పిల్ల‌లు కావాల‌నుకునేవారు.. వైర‌స్ ప్ర‌బ‌లుతున్న స‌మ‌యంలో.. త‌మ ప్రెగ్నెన్సీ ప్లాన్స్‌ను వాయిదా వేసుకోవాల‌ని ఇప్ప‌టికే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దీంతో వీటి వాడకం పెరిగిపోయింది. అంతేకాదు దంపతులు ఇద్దరూ యూట్యూబ్ వినియోగం పెంచేస్తున్నారు. తమకిష్టమయిన సినిమాలు చూడడం, రొమాంటిక్ సన్నివేశాలు చూడడం ఎక్కువైంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle