newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

తన రికార్డు తనే బ్రేక్ చేసిన అమెజాన్ సీఈవో

02-07-202002-07-2020 14:12:34 IST
Updated On 02-07-2020 16:53:22 ISTUpdated On 02-07-20202020-07-02T08:42:34.543Z02-07-2020 2020-07-02T08:42:07.899Z - 2020-07-02T11:23:22.246Z - 02-07-2020

తన రికార్డు తనే బ్రేక్ చేసిన అమెజాన్ సీఈవో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జెఫ్ బెజోస్ గుర్తున్నారా.. ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమెజాన్ వ్యవస్థాపకుడు. 171.6 బిలియన్ డాలర్ల రికార్డు సంపదతో తన పాత రికార్డుని తనే బ్రేక్ చేశాడాయన. గత ఏడాది మెకెంజీతో విడాకుల పరిష్కారంలో భాగంగా అమెజాన్ లో తన వాటాలో నాలుగింట ఒక వంతును వదులుకున్నాడు. అనంతరం ఆయన సంపద  172  బిలియన్ డాలర్ల  వద్దకు చేరింది. 

అమెజాన్ షేర్లు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం 2,879 డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచ కుబేరుడి బెజోస్ ఆదాయం 171.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, సెప్టెంబర్ 4, 2018 నాటికి బెజోస్ సంపద 167.7 బిలియన్ డాలర్ల వద్ద రికార్డు స్థాయిని తాకింది. తాజాగా తన రికార్డును తనే బ్రేక్ చేశారు. కరోనా మహమ్మారి, ఆర్థిక మాంద్యం పరిస్థితులున్న ఈ ఏడాదిలోనే 56.7 బిలియన్లను ఆర్జించాడు. కరోనా సంక్షోభ సమయంలో ముందుండి పనిచేస్తున్న ఉద్యోగులకు వన్ టైం బోనస్ కింద 500 మిలియన్ డాలర్లు చెల్లించనున్నట్టు  ప్రకటించారు. దీంతో ఆయన ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు. 

విడాకుల తర్వాత మెకంజీ ఆదాయం 56.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఆమె ఆదాయం పెరగడంతో బ్లూమ్‌బెర్గ్ ర్యాంకింగ్‌లో 12వ స్థానాన్ని సాధించారు. అంతేకాదు  ప్రపంచంలో రెండవ సంపన్న మహిళగా నిలిచారు.  మిగిలిన బిలియనీర్లలో ఎక్కువ మంది టెక్ రంగానికి చెందినవారుండడం విశేషం. 

వీరిలో టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ సంపద జనవరి 1 నుండి 25.8 బిలియన్ డాలర్లు పెరిగింది. జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు ఎరిక్ యువాన్ సంపద దాదాపు నాలుగు రెట్లు పెరిగి 13.1 బిలియన్ డాలర్లు చేరింది. కరోనా కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో ప్రపంచ కుబేరుల సంపద మాత్రం కొంచెం పెరగడం విశేషం. కొంతమంది మాత్రం తమ సంపదను కోల్పోయారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle