newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

టెలిగ్రాంకి సాంకేతిక ఇబ్బందులు

19-03-202019-03-2020 15:12:50 IST
2020-03-19T09:42:50.869Z19-03-2020 2020-03-19T09:42:49.291Z - - 16-01-2021

టెలిగ్రాంకి సాంకేతిక ఇబ్బందులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ టెలిగ్రాంకి కరోనా ఎఫెక్ట్ తగిలిందా? ఎందుకు మొరాయిస్తోంది? అంటూ వినియోగదారులు టెలిగ్రాం  కొన్నిగంటలుగా పనిచేయడం లేదు. దీంతో జనం ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు. ప్రపంచవ్యాప్తంగా టెలిగ్రాం యాప్ సరిగా స్పందించడం లేదని ఇతర సోషల్ మీడియా యాప్ లలో మెసేజ్ లు వెల్లువెత్తుతున్నాయి. తాము పోస్ట్ చేసిన మెసేజ్, వీడియోలు వెళ్ళకపోవడంతో వినియోగదారులు తెగ ఇబ్బందులు పడుతున్నారు. 

సెక్యూరిటీపరంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసెంజర్‌ యాప్‌ ఇది. 256-బిట్‌ సిమెట్రిక్‌ AES ఎన్క్రిప్షన్‌, 2048-బిట్‌ =RSA ఎన్క్రిప్షన్‌ దీని ప్రత్యేకత. ఫైల్‌ షేరింగ్‌, క్రాస్‌-ప్లాట్‌ఫాం సపోర్ట్‌, గ్రూప్‌ చాట్స్‌, అన్ని ఫైల్‌ ఫార్మెట్ల సపోర్ట్‌ దీనికుంది. చాలా తక్కువ సమయంలో అత్యంత  ప్రజాదరణ పొందింది. మొదట పెద్దగా వినియోగదారులు లేకపోయినా, ఇప్పుడు ఇప్పుడు కోట్ల మంది ప్రజలు దీని సేవను ఉపయోగించుకోవడం విశేషం. మీడియా గ్రూపులు, వివిధ వ్యాపార సంస్థలు టెలిగ్రాం యాప్ ఎక్కువగా వినియోగిస్తుంటారు. 

టెలిగ్రాం యాప్ ఇటీవల బాగా ప్రచారం పొందింది. టెలిగ్రాం యాప్‌ను పావెల్ దురోవ్, నికోలాయ్ దురోవ్ అనే అన్నదమ్ముళ్లు రూపొందించారు. వీరు రష్యన్లు. అయితే ఈ యాప్ రష్యా ఐటీ చట్టాలకు విరుద్ధంగా ఉన్నందు వల్ల ప్రస్తుతం ఆ సంస్థ దుబాయి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2013లో ఈ యాప్‌ను విడుదల చేశారు. వాట్సప్ మాదిరే ఇది కూడా మెసేంజర్ యాప్. వాట్సప్ వాడి వాడి బోర్ కొట్టినవారు టెలిగ్రాం వాడుకోవచ్చు. వాట్సప్‌కు గ‌ట్టి పోటిస్తున్న యాప్ టెలిగ్రాం అని చెప్ప‌వ‌చ్చు. ఇందులో గ‌రిష్టంగా ఫైల్స్‌ను 1.5 జీబీ వ‌ర‌కు సైజ్ ఉన్న‌ప్ప‌టికీ షేర్ చేసుకోవ‌చ్చు. వాట్సప్‌లో లేని చాలా వ‌ర‌కు ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. వాట్సప్ గ్రూప్‌ల‌లో ఒక గ్రూప్‌కు కేవ‌లం 256 మందిని మాత్ర‌మే యాడ్ చేసుకోవ‌చ్చు. కానీ ఇందులో ఒక గ్రూప్‌కు గ‌రిష్టంగా వేలాదిమందిని యాడ్ చేయ‌వ‌చ్చు. టెలిగ్రాం యాప్ వాడుతున్న వారు కూడా ఎక్కువయ్యారు. గత 24 గంటలుగా టెలిగ్రాం యాప్ సాంకేతిక ఇబ్బందులతో సతమతం అవుతోంది.ఈ టెక్నికల్ ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా వున్నాయని తెలుస్తోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle