newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

టిక్ టాక్‌కి పోటీగా.. యూట్యూబ్ నయా ఫీచర్

27-06-202027-06-2020 09:13:38 IST
Updated On 27-06-2020 09:29:41 ISTUpdated On 27-06-20202020-06-27T03:43:38.296Z27-06-2020 2020-06-27T03:43:17.671Z - 2020-06-27T03:59:41.737Z - 27-06-2020

టిక్ టాక్‌కి పోటీగా.. యూట్యూబ్ నయా ఫీచర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నెన్నో కొత్తరకాల యాప్ లు వస్తున్నాయి. తాజాగా చైనాకు వ్యతిరేకంగా భారతదేశంలో ప్రచారం సాగుతోంది. చైనా బ్యాన్,  చైనా యాప్స్ తొలగింపు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు జనం. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందికి చేరువయిన గూగుల్ మరో విభాగం యూట్యూబ్ వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు కొత్త ఫీచర్‌తో రానున్నట్టు ప్రకటించింది. 

పాపులర్ వీడియో ప్లాట్‌ఫామ్, చైనాకు చెందిన టిక్‌టాక్‌ మాదిరిగానే సరికొత్త ఫీచర్‌ను యూట్యూబ్ త్వరలోనే త్వరలో ప్రారంభం కానుంది. గూగుల్ యాజమాన్యంలోని వీడియో ప్లాట్‌ఫాం క్రొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండిండిలోనూ దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్టు యూట్యూబ్ తెలిపింది. అయితే ఇందులో 15 సెకన్ల వీడియో పోస్ట్ చేయడానికి  మాత్రమే అనుమతి ఉంది. టిక్ టాక్ మాదిరిగా అన్ని రకాల ప్రత్యేకతలు ప్రస్తుతానికి ఇందులో అందుబాటులో లేవని తెలుస్తోంది. 

తమ వెబ్‌సైట్‌లో ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. పరీక్షల అనంతరం దీన్ని భారీగా ప్రారంభించనున్నారు. ఈ ఫీచర్ లో 15 సెకన్ల వరకు వీడియోలను పోస్ట్ చేయవచ్చు. ఒకేసారి ఎక్కువ వీడియోలను అప్‌లోడ్ చేయాలనుకుంటే, ఫోన్ గ్యాలరీ నుండి నేరుగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే టిక్‌టాక్ మాదిరిగా ఫిల్టర్లు, మ్యూజిక్ సపోర్ట్ లభిస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. టిక్‌టాక్ లేదా ఇతర ఆధునిక చిన్న వీడియో యాప్ లలో కూడా వీడియో కంటెంట్ లిమిట్ ఎక్కువ ఉండటంతోపాటు, ఏఆర్ ఎడిటింగ్ ఎఫెక్టులతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. యూట్యూబ్ దీన్ని మరింత మెరుగుపర్చాలని లేకుంటే వినియోగదారుల దీని గురించి ఆలోచించే అవకాశమే వుండదని అంటున్నారు.

షార్ట్స్ పేరుతో టిక్‌టాక్‌ లాంటి యాప్‌ను యూట్యూబ్ త్వరలో తీసుకురానుందని వార్తలు వచ్చాయి. ఆ ఫీచర్ గురించే యూట్యూబ్ ఇప్పుడు ప్రకటన చేసింది. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ఫీచర్లను అనుకరించడం యూట్యూబ్‌కి  కొత్తేం కాదు.  గతంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, స్నాప్‌చాట్ తరహాలో స్టోరీస్ అప్‌డేట్ ఫీచర్‌ రీల్స్ ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం యూట్యూబ్ తీసుకురానున్న కొత్త ఫీచర్ గురించి ఆసక్తి కనబరుస్తున్నారు యూట్యూబ్ వినియోగదారులు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle