newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

టిక్ టాక్‌కి ఇండియా స్ట్రాంగ్ పంచ్.. ప్లే స్టోర్ నుంచి ఔట్

30-06-202030-06-2020 11:51:40 IST
Updated On 30-06-2020 12:46:12 ISTUpdated On 30-06-20202020-06-30T06:21:40.047Z30-06-2020 2020-06-30T06:21:29.002Z - 2020-06-30T07:16:12.297Z - 30-06-2020

టిక్ టాక్‌కి ఇండియా స్ట్రాంగ్ పంచ్.. ప్లే స్టోర్ నుంచి ఔట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చైనా దూకుడుకి కళ్ళెం వేయడంలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ పొందిన టిక్‌టాక్‌తో సహా 59 యాప్స్ ని కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో టిక్ టాక్ ను గూగుల్‌ ప్లేస్టోర్, యాపిల్‌ యాప్‌ స్టోర్‌‌ నుంచి తొలగించాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గూగుల్‌, యాపిల్‌ మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నాయి. టిక్‌టాక్‌, హెలో, షేర్‌ ఇట్‌తో సహా 59 చైనీస్‌ యాప్స్‌ను నిషేధిస్తూ చైనాకు భారత్‌ షాకిచ్చింది. 

దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, ప్రజాభద్రత దృష్ట్యా ఈ యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర సర్కారు సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. చైనా కుట్రలను మోడీ సర్కారు ఈ విధంగా తిప్పికొట్టింది. చైనా కంపెనీలతో సంబంధం ఉన్న 59 యాప్‌లను మోదీ ప్రభుత్వం నిషేధించింది. కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ ఈ మేరకు ఆయా యాప్‌లను నిషేధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

దేశ భద్రత, ప్రజల డేటాకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ప్రజలు దీన్ని మోదీ ”డిజిటల్‌ స్ట్రైక్‌”గా చెప్పుకుంటున్నారు. భారత్‌–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్లోబల్‌ వెబ్‌ ఇండెక్స్‌ లెక్కల ప్రకారం గతేడాది జూన్ నాటికి భారతదేశంలో 12  కోట్ల మంది నెలవారీ టిక్‌టాక్ వినియోగదారులు ఉన్నారు. తమ యాప్‌ను నిషేధించిన నేపథ్యంలో  తమ వివరణ వినడానికి ప్రభుత్వం అంగీకరించిందని టిక్‌టాక్‌ ఇండియా తెలిపింది.  భారత్ మార్కెట్ లేకుంటే టిక్ టాక్ ఎంతో నష్టపోతుందని. గతంలో నిషేధం విధించినప్పుడే కేంద్రానికి అభ్యర్ధనలు పంపి కోర్టుద్వారా పునరుద్ధరణ పొందిందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడా పరిస్థితి వుంటుందా అనేది ఇతమిద్థంగా చెప్పలేకపోతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle