newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

చింగారి' ఉండగా టిక్ టాక్ ఇక ఎందుకు.. గంటలోపే లక్షమంది డౌన్ లోడ్

01-07-202001-07-2020 16:19:49 IST
2020-07-01T10:49:49.035Z01-07-2020 2020-07-01T10:49:46.110Z - - 03-08-2020

చింగారి' ఉండగా టిక్ టాక్ ఇక ఎందుకు.. గంటలోపే లక్షమంది డౌన్ లోడ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిండి తిన‌కుండా ఉంటాం కానీ టిక్‌టాక్ లేకుండా ఉండ‌లేం అంటున్నారు కొంద‌రు టిక్‌టాక్ యూజ‌ర్లు. అందుకే టిక్‌టాక్ స‌హా 59 చైనీస్ యాప్‌లను ప్ర‌భుత్వం నిషేదించ‌డంతో ముఖ్యంగా ప‌లువురు సెల‌బ్రిటీలు అయోమ‌యంలో ప‌డిపోయారు. ఇప్ప‌టికే ఈ యాప్‌ను భార‌త్‌లో దాదాపు 20 కోట్ల మంది వినియోగిస్తున్నారు. దీంతో ఉన్న‌ప‌లంగా తీసేయాలంటే ఇంకోటి రిప్లేస్‌ చేయాల్సిందే అనుకున్నారేమో వెంట‌నే టిక్‌టాక్ ప్ర‌త్యామ్నాయం ఏంటా అని శోధించారు. అదృష్ట‌వ‌శాత్తూ మ‌న భార‌తీయులు త‌యారు చేసిన 'చింగారి' యాప్ క‌ళ్లెదుట ప్ర‌త్య‌క్ష‌మయ్యింది. ఇంకేముంది గంటలోనే ఈ యాప్‌ను ల‌క్ష‌మంది దాకా డౌన్‌లోడ్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. కాగా 20 లక్షల వ్యూస్‌తో చింగారి రికార్డు సృష్టించింది కూడా.

షార్ట్ వీడియో స‌ర్వీస్‌తో అచ్చం టిక్‌టాక్ మాదిరే ఉన్న ఈ యాప్‌పై ప్ర‌స్తుతం భార‌తీయులు మ‌క్కువ చూపిస్తున్నారు.  తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ,  గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళం భాష‌ల్లో ఈయాప్ అందుబాటులో ఉంది. దీంతో స్వ‌దేశీ ప‌రిఙ్ఞానంతో రూపొందింన 'చింగారి' యాప్‌ను ప్రోత్స‌హించాలంటూ ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పారిశ్రామికవేత్త ఆనంద్ మ‌హింద్రా సైతం చింగారి యాప్‌ను డౌన్‌లోడ్ చేసి దాని ప్ర‌త్యేక ఫీచ‌ర్స్‌ను వివ‌రించారు. స్వ‌దేశీ ప‌రిఙ్ఞానంతో రూపుదిద్దుకున్న చింగారి యాప్ రూప‌క‌ర్త‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. మ‌రో విశేషం ఏంటంటే ఆనంద్ మ‌హింద్రా ఇప్ప‌టివ‌ర‌కు టిక్‌టాక్ యాప్‌ను మునుపెన్న‌డూ డౌన్‌లోడ్ చేసుకోలేదు. 

బెంగుళూరుకు చెందిన బిస్వాత్మ నాయక్‌,  సిద్ధార్థ్ గౌతమ్ గ‌తేడాది చింగారి యాప్‌ను రూపొందించారు. అయితే మ‌నోళ్ల‌కు విదేశీ వ‌స్తువులు, యాప్‌లపై మోజెక్కువ కాబ‌ట్టి చింగారి యాప్ ఆద‌ర‌ణ‌కు నోచుకోలేదు. కానీ తాజాగా 59 చైనా యాప్‌ల‌పై ప్ర‌భుత్వం నిషేదం విధించ‌డంతో చింగారి యాప్ డౌన్‌లోడ్స్ పెరిగాయి. ఇప్ప‌టికే 1 మిలియ‌న్ మార్కును దాటేసి గూగుల్ ప్లే స్టోర్‌లో అగ్ర‌స్థానానికి చేరుకుంది. అంతేకాకుండా ప‌లు సామాజిక ప్లాట్‌ఫామ్‌లు సైతం చింగారిలో పెట్టుబుడులు పెట్టేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారని ప్రోగ్రామ‌ర్ నాయ‌క్ తెలిపారు.  

59 చైనీస్ యాప్‌ల‌పై నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని చింగారి యాప్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు సుమిత్ ఘోష్ స్వాగతించారు. డేటా త‌స్క‌రించి గూఢ‌చార్యానికి పాల్ప‌డ్డ యాప్‌ను భార‌త్ తిరిగి త‌న గూటికి చేర్చింది. ఎట్ట‌కేల‌కు ఈ బ్యాన్ జరిగినందుకు మ‌కు సంతోషంగా ఉంద‌న్నారు.

భారత్‌లో టిక్‌టాక్‌తో సహా 59 చైనీస్‌ యాప్‌లపై కేంద్రం సోమవారం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో గూగుల్‌ ప్లే స్టోర్,యాప్‌ స్టోర్‌ల‌లో టిక్‌టాక్‌తో పాటు మిగిలిన కొన్ని యాప్‌లను తొలగించారు. మరోవైపు ఆయా ఫోన్లలో ఇన్​స్టాల్ అయి ఉన్న యాప్స్‌ మాత్రం మామూలుగా పనిచేస్తూ వచ్చాయి. అయితే కొద్దిసేపటి నుంచి మొబైల్‌ ఫోన్లలో, డెస్క్‌టాప్‌ వర్షన్‌లో టిక్‌టాక్‌ యాప్‌ సేవలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా టిక్‌టాక్‌ యాప్‌ పూర్తిగా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయింది. టిక్‌టాక్‌ యాప్‌ ఓపెన్‌ చేస్తున్న వినియోగదారులకు.. నెట్‌వర్క్‌ ఎర్రర్‌ కనిపిస్తుంది. 

చైనా యాప్‌లను గంపగుత్తగా భారత ప్రభుత్వం నిషేధించడం, ఈలోపు చింగారి అనే దేశీయ ప్రత్యామ్నాయ యాప్ ఉనికిలోకి రావడంతో సంతోషం పట్టలేని భారతీయులు కేవలం గంటలోపే లక్ష డౌన్‌లోడ్లతో, 20 లక్షల వ్యూస్‌తో చింగారి యాప్‌కు స్వాగతం పలికారు. చైనా యాప్‌లపై నిషేధం విధించకముందే 30 లక్షల సార్లు టిక్ టాక్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle