newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

గూగుల్ పే పై నిషేధమా? ఎన్ పిసీఐ వివరణ

27-06-202027-06-2020 13:49:21 IST
Updated On 27-06-2020 13:49:15 ISTUpdated On 27-06-20202020-06-27T08:19:21.672Z27-06-2020 2020-06-27T08:18:53.493Z - 2020-06-27T08:19:15.374Z - 27-06-2020

గూగుల్ పే పై నిషేధమా? ఎన్ పిసీఐ  వివరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నోట్ల రద్దు అనంతరం దేశంలో డిజిటల్ లావాదేవీలు బాగా పెరిగాయి. కేంద్రం కూడా ఈ-లావాదేవీలకు ప్రాధాన్యత ఇస్తోంది. తాజాగా గూగుల్ పే పై రిజర్బుబ్యాంక్ నిషేధం విధించిందని వార్తలు వస్తున్నాయి. అయితే, భారత్‌లో గూగుల్‌ పే యాప్‌ను ఆర్‌బీఐ బ్యాన్‌ చేసిందంటూ సోషల్‌ మీడియాలో షికార్లు చేస్తున్న పుకార్లపై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) క్లారిటీ ఇచ్చింది. గూగుల్‌ పే యాప్‌ను ఇండియాలో బ్యాన్‌ చేయలేదని, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.  

గూగుల్‌ పే లావాదేవీలపై వచ్చిన పుకార్లపై సంస్థ స్పష్టత నిచ్చింది. గూగుల్‌ పే యాప్‌ చట్టపరిధిలోనే ఉండి పని చేస్తుందని, తాము అన్ని నిబంధనలను పాటిస్తున్నామని సంస్థ వివరణ ఇచ్చింది. తమ యాప్‌ యూపీఐ ద్వారా చెల్లింపుల కోసం బ్యాంకులకు టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తుందని పేర్కొంది. గూగుల్‌ పే ద్వారా జరిగే ప్రతీ లావాదేవి పూర్తిగా సురక్షితమేనని వెల్లడించింది. గూగుల్‌ పే థర్డ్‌ పార్టీ యాప్‌ ప్రొవైడర్‌ మాత్రమేనని, ఇది ఎలాంటి పేమెంట్‌ వ్యవస్థను నిర్వహించదని ఆర్‌బీఐ ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌ ప్రచురించిన అథీకృత చెల్లింపు వ్యవస్థల ఆపరేటర్ల జాబితాలో గూగుల్ పే లేదని ఆర్ బీఐ తెలిపింది. 

గూగుల్‌ పే కార్యకలాపాలు చెల్లింపులు పరిష్కారాల చట్టం 2007ను ఉల్లంఘించడం లేదని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ ప్రతీక్‌ జలన్‌లతో కూడిన బెంచ్‌కు ఆర్‌బీఐ నివేదించింది. గూగుల్ పే విషయంలో వచ్చిన వార్తల నిరాధారమయినవి అని, ఖాతాదారులు సురక్షితమయిన చెల్లింపులు చేసుకోవచ్చని గూగుల్ పే వివరించింది. 

 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle