newssting
BITING NEWS :
*ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 65.31 లక్షలు... ఇప్పటి వరకు 3.86 లక్షల మంది మృతి*విశాఖ...డా.సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మార్పులు.సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మళ్ళీ మార్పు. డా.మాధవి లత స్థానంలో డా.సుబ్రహ్మణ్యం * గ్రేటర్ హైద్రాబాద్ లో కరోనా పంజా.వారం రోజుల వ్యవధి లోనే కొత్తగా 500పైగా కరోనా కేసులు *ఎల్ జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై నేడు హైపవర్‌ కమిటీ విచారణ *నేడు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ*వైఎస్సార్‌ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల .. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌ * సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశం *తిరుమల: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక జేష్టాభిషేకం ఉత్సవాలు, ఏకాంతంగానే ఉత్సవాల నిర్వహణ.. ఇవాళ ఉత్సవ మూర్తులకు వజ్రకవచ ధారణ* తెలంగాణలో కొత్తగా 129 కొత్త కేసులు. మొత్తం 3020కి చేరిన పాజిటివ్ కేసులు.. మరో ఏడుగురు మృతి *ఈనెల 8 నుంచి హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు? 78 రోజులుగా హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు బంద్. అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమావేశం. అంతరాష్ట్ర బస్ సర్వీసులపై చర్చబెజవాడ గ్యాంగ్ వార్ పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ గ్యాంగ్ వార్ లో ఎంత వారున్నా వదిలే ప్రసక్తే లేదు - ఏపీ డీజీపీ

క‌రోనాతో పోటీ ప‌డుతున్న ఫేక్ న్యూస్‌

29-03-202029-03-2020 16:48:41 IST
2020-03-29T11:18:41.950Z29-03-2020 2020-03-29T11:18:37.914Z - - 04-06-2020

క‌రోనాతో పోటీ ప‌డుతున్న ఫేక్ న్యూస్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌రోనా వైర‌స్ ఒక‌వైపు వేగంగా వ్యాప్తి చెందుతుంటే మ‌రో వైపు ఫేక్ న్యూస్ విజృంభిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌జ‌లంతా పెరుగుతున్న క‌రోనా పాజిటీవ్ కేసుల‌తో ఆందోళ‌న‌లో ఉంటే సోష‌ల్ మీడియాలో రోజుకో త‌ప్పుడు ప్ర‌చారం వారిని మ‌రింత క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన నాటి నుంచి సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫేక్ న్యూస్ వైర‌ల్‌గా మారుతోంది. దీంతో ఏది న‌మ్మాలో, ఏదీ న‌మ్మ‌కూడ‌దో కూడా తేల్చుకోలేని స్థితిలో ప్ర‌జ‌లు ఉన్నారు. ప్ర‌భుత్వాలు త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తే జైలుకు పంపిస్తామ‌ని ఎన్ని హెచ్చ‌రిక‌లు చేసినా త‌ప్పుడు ప్ర‌చారాలు మాత్రం ఆగ‌డం లేదు.

వారం రోజుల క్రితం ఓ ప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు విప‌రీతంగా న‌మ్మారు. ప్ర‌జ‌ల బ‌ల‌హీన‌త‌ల‌ను ఆస‌రాగా చేసుకొని ఎవ‌రో ఆక‌తాయిలు.. మ‌గ పిల్ల‌లు వేప చెట్టుకు ప‌సుపు నీళ్లు పోయాల‌ని, లేక‌పోతే దోషం అంటూ ఓ త‌ప్పుడు ప్ర‌చారం సృష్టించారు. దీంతో త‌ల్లిదండ్రులు ఈ ప్ర‌చారాన్ని నిజ‌మే అనుకొని న‌మ్మి మ‌గ‌పిల్ల‌ల‌తో వేపచెట్ల‌ను వెతికి మ‌రీ ప‌సుపు నీళ్లు పోయించారు. సోష‌ల్ డిస్టెన్సింగ్ పాటించాల‌ని, ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావొద్ద‌ని ప్ర‌భుత్వం చెబుతున్నా వేప చెట్ల వ‌ద్ద‌కు క్యూ క‌ట్టారు.

ఇక రెండు రోజుల క్రితం బ్రహ్మం గారి ఆల‌యంలో ఓ పూజారి క‌రోనా వైర‌స్‌కు విరుగుడు చెప్పి మ‌ర‌ణించాడ‌ని, నీళ్ల‌లో బెల్లం, అల్లం, మెంతులు క‌లిపి తాగితే క‌రోనా రాద‌ని చెప్పాడ‌ని ఓ త‌ప్పుడు ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఒక‌రికొక‌రు ఫోన్లు చేసి మ‌రీ ఈ విష‌యాన్ని చెప్పుకున్నారు. దీంతో అంతా ఇందులో చెప్పిన‌ట్లు తాగారు. దీంతో ఈ ప్ర‌చారం అబ‌ద్ధ‌మ‌ని, అస‌లు బ్ర‌హ్మం గారి ఆల‌యంలో పూజారి ఎవ‌రూ మ‌ర‌ణించలేద‌ని ఆల‌య నిర్వాహ‌కులు వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది.

తాజాగా, ఓ సీనియ‌ర్ రిపోర్ట‌ర్‌తో ప్ర‌ముఖ ఆసుప‌త్రికి చెందిన వైద్యుడు ఫోన్‌లో సంభాషించిన‌ట్లుగా చెబుతున్న ఎనిమిది నిమిషాల ఆడియో క్లిప్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. క‌రోనాపై ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు క‌ల్పించేలా ఈ ఆడియో ఉంది. ఈ ఆడియో క్లిప్ రెండు రోజులుగా విచ్చ‌ల‌విడిగా వైర‌ల్ అవుతోంది. అయితే, ఈ ఆడియో క్లిప్ త‌మ వైద్యుడిది కాదంటూ స‌ద‌రు ఆసుప‌త్రి నిర్వాహ‌కులు పోలీసుల‌కు కూడా పిర్యాదు చేశారు. అయినా, ఈ ఆడియో వైర‌ల్ అవుతూనే ఉంది.

సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ మాట‌లుగా చెబుతూ మ‌రో ఆడియో క్లిప్‌ను కూడా నెటిజ‌న్లు వాట్సాప్‌లో బాగా షేర్ చేస్తున్నారు. ఈ ఆడియోతో త‌న‌కు సంబంధం లేద‌ని స్వ‌యంగా ల‌క్ష్మీనారాయ‌ణ‌నే ఓ వీడియో విడుద‌ల చేయాల్సి వ‌చ్చింది. ఇక‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అంద‌రికీ వెయ్యి జీబీ ఇంట‌ర్నెట్ ఫ్రీగా ఇస్తున్నార‌ని, ఎయిర్‌టెల్‌, జియో కూడా లాక్‌డౌన్ కోసం ఇంట‌ర్నెట్ ఫ్రీగా ఇస్తోందంటూ ర‌క‌ర‌కాల మెసేజ్‌లు కూడా విచ్చ‌ల‌విడిగా షేర్ అవుతున్నాయి. ఇవ‌న్నీ అబ‌ద్ధాలే.

ఇట‌లీ, స్పెయిన్‌లో శ‌వాల దిబ్బ‌లు అంటూ ఓ హాలీవుడ్ సినిమాలోని సీన్‌ను వీడియో రూపంలో వైర‌ల్ చేస్తున్నారు. హైద‌రాబాద్‌కు మిలిట‌రీ దిగిందంటూ పాత వీడియో ఒక‌టి చ‌క్క‌ర్లు కొడుతోంది. క‌రోనా వైర‌స్‌కు మందు క‌నిపెట్టార‌నే అబ‌ద్ధ‌పు ప్ర‌చారం కూడా ఓ రేంజ్‌లో సాగుతోంది. తెలంగాణ‌లో వైన్‌షాపులు తెరుస్తున్నారంటూ న‌కిలీ ఆర్డ‌ర్ కాపీనే సృష్టించారు. ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్‌తో భ‌యంగా ఉన్న ప్ర‌జ‌ల‌ను ఈ ఫేక్ న్యూస్‌లు మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ప్ర‌జ‌లు భ‌యాంతో ఉన్న‌ప్పుడు ఏ వార్త వ‌చ్చినా నిజానిజాలు తెలుసుకోకుండా న‌మ్మేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. కాబ‌ట్టి, ఫేక్ న్యూస్‌కు అడ్డుక‌ట్ట వేయ‌డానికి ప్ర‌భుత్వం మ‌రింత క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటే బాగుంటుంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle