newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ఐపీఎల్ 2020పై చైనా ఎఫెక్ట్.. వివోపై బీసీసీఐ కీలక నిర్ణయం?

01-07-202001-07-2020 12:27:34 IST
Updated On 01-07-2020 18:04:49 ISTUpdated On 01-07-20202020-07-01T06:57:34.946Z01-07-2020 2020-07-01T06:57:22.273Z - 2020-07-01T12:34:49.173Z - 01-07-2020

ఐపీఎల్ 2020పై చైనా ఎఫెక్ట్.. వివోపై బీసీసీఐ కీలక నిర్ణయం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల సెగ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ని కూడా తాకింది. లఢక్‌లోని గాల్వన్ సరిహద్దు దగ్గర ఇటీవల చైనా సైనికుల దుశ్చర్య కారణంగా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. దాంతో.. చైనా తీరుని నిరసిస్తూ ఆ దేశానికి చెందిన 59 యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో.. ఐపీఎల్ స్ఫాన్సర్స్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏం నిర్ణయం తీసుకోబోతోంది..? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్‌గా చైనాకి చెందిన వివో ఉంది. బీసీసీఐతో 2018లో ఐదేళ్లకాలానికి రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న వివో.. ఏటా రూ. 440 కోట్లు చెల్లిస్తోంది. దిన్ని వీలైనంత త్వరగా క్యాన్సిల్ చేసుకోవాలని బీసీసీఐకి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ- యజమాని నెస్ వాడియా సూచించాడు. 

ఐపీఎల్‌తో వివోనే కాదు.. పేటీఎం, స్విగీ, డ్రీమ్ ఎలెవన్ తదితర కంపెనీలు కూడా అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నాయి. దాంతో.. ఇప్పటికిప్పుడు అగ్రిమెంట్‌లను రద్దు చేసుకుంటే రూ.వేల కోట్లని బీసీసీఐ నష్టపోవాల్సి ఉంటుంది.ఐపీఎల్‌లో చైనా కంపెనీలతో ఉన్న అగ్రిమెంట్‌లను బీసీసీఐ వదులుకోవాలి. ముందు దేశం.. తర్వాతే డబ్బు అని బీసీసీఐ ఆలోచిస్తోంది. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్.. అంతే తప్ప చైనీస్ ప్రీమియర్ లీగ్ కాదు అనే భావనతో ముందుకు సాగుతుంది. ఆ కంపెనీలతో ఒప్పందాల్ని త్యజించడం ద్వారా బీసీసీఐ అందరికీ ఆదర్శంగా నిలవాలని ఐపిఎల్ ప్రాంఛైజిలు అనుకుంటున్నాయి. 

ఇప్పటికిప్పుడు స్ఫాన్సర్లని వదులుకుంటే వెంటనే దొరకడం కష్టం..  కానీ.. భారత్‌లోనే ఆ స్ఫాన్సర్లని భర్తీ చేయగల కంపెనీలు చాలా ఉన్నాయి. దేశాన్ని, ప్రభుత్వాన్ని.. అన్నికంటే మించి దేశం కోసం ప్రాణాల్ని పెట్టి పోరాడుతున్న సైనికుల్ని మనం గౌరవించాలి’’ అని నెస్ వాడియా సూచించాడు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle