newssting
BITING NEWS :
*ఏపీలో కరోనా కేసుల సంఖ్య 4,112...మరణాలు 71*ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు 65.31 లక్షలు... ఇప్పటి వరకు 3.86 లక్షల మంది మృతి*విశాఖ...డా.సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మార్పులు.సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మళ్ళీ మార్పు. డా.మాధవి లత స్థానంలో డా.సుబ్రహ్మణ్యం * గ్రేటర్ హైద్రాబాద్ లో కరోనా పంజా.వారం రోజుల వ్యవధి లోనే కొత్తగా 500పైగా కరోనా కేసులు *ఎల్ జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై నేడు హైపవర్‌ కమిటీ విచారణ *నేడు జలసౌధలో కృష్ణా బోర్డు భేటీ*వైఎస్సార్‌ వాహనమిత్ర ఆర్థిక సాయం విడుదల .. లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌ * సమగ్ర భూసర్వేను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశం *తిరుమల: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక జేష్టాభిషేకం ఉత్సవాలు, ఏకాంతంగానే ఉత్సవాల నిర్వహణ.. ఇవాళ ఉత్సవ మూర్తులకు వజ్రకవచ ధారణ* తెలంగాణలో కొత్తగా 129 కొత్త కేసులు. మొత్తం 3020కి చేరిన పాజిటివ్ కేసులు.. మరో ఏడుగురు మృతి *ఈనెల 8 నుంచి హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు? 78 రోజులుగా హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు బంద్. అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమావేశం. అంతరాష్ట్ర బస్ సర్వీసులపై చర్చబెజవాడ గ్యాంగ్ వార్ పై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ గ్యాంగ్ వార్ లో ఎంత వారున్నా వదిలే ప్రసక్తే లేదు - ఏపీ డీజీపీ

ఇక చెక్కులకు చెల్లు చీటీ.. ఆర్థిక వ్యవహారాలన్నీ డిజిటల్

27-03-202027-03-2020 13:13:08 IST
2020-03-27T07:43:08.077Z27-03-2020 2020-03-27T07:42:21.884Z - - 04-06-2020

ఇక చెక్కులకు చెల్లు చీటీ.. ఆర్థిక వ్యవహారాలన్నీ డిజిటల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ లావాదేవీలు బాగా పెరిగాయి. ఎప్పుడూ లేని విధంగా వివిధ రకాల డిజిటల్ లావాదేవీలకు జనం అలవాటుపడిపోయారు. ఇంచుమించు చెక్కులు చాలా కొద్ది కార్యకలాపాలకే పరిమితం అయ్యాయి. ప్రభుత్వ చెల్లింపు వ్యవహారాలన్నీ ఇక నుంచి డిజిటల్‌ రూపంలోనే జరుగనున్నాయి. చెక్కుల ద్వారా చెల్లించే విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 

ఈ కొత్త విధానం వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి రానుంది. ఈమేరకు గురువారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నిర్ణయం నేపథ్యంలో రుణమాఫీ డబ్బులు కూడా నేరుగా బ్యాంకు ఖాతాలోకే బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆర్బీఐ సూచనల మేరకు ఈ విధానాన్ని అమలుపరుస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. చెక్కులు తీసుకోవడం వాటిపై సంబంధిత మొత్తాలు రాయడం, సంతకాలు చేయడం అనేది ఇక నుంచి ఉండదంటోంది ప్రభుత్వం. 

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ తన కార్యకలాపాలను డిజిటలైజ్ చేసింది. క్యాష్ అవసరం, చెక్ బుక్ అవసరంలేకుండానే వివిధ డిజిటల్ పద్ధతులను అనుసరిస్తోంది. వచ్చే అయిదేళ్లలో ఎస్ బి ఐ డెబిట్ కార్డులు అవసరం లేకుండా బ్యాంక్ డిజిటల్ పేమెంట్ యాప్‌తోనే అన్ని రకాల ట్రాంజాక్షన్లు పూర్తయ్యేలా చూస్తామని అధికారులు అంటున్నారు. గతంతో పోలిస్తే చెక్ బుక్ ల కోసం వచ్చేవారు తగ్గిపోయారని అన్నీ డిజిటల్ ద్వారానే జరుగుతున్నాయని బ్యాంకు అధికారులే చెబుతున్నారు.

డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల వినియోగం పెరగడంతో పాటు ఎన్ ఇ ఎఫ్ టీ, ఐఎంపీఎస్, ఆర్టీ జీఎస్ కార్యకలాపాలు పెరిగాయి. తాజాగా ప్రభుత్వం 24/7 అందుబాటులోకి తేవడంతో డిజిటల్ లావాదేవీలకు గిరాకీ పెరిగింది. వినియోగదారులు బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండాపోయింది. 2018లో కోటి వరకూ వున్న డెబిట్ కార్డులు రెండేళ్లలో గణనీయంగా తగ్గాయి. 2019 నాటికి 83 లక్షలకు, 2020 మార్చి నాటికి 75 లక్షలకు చేరాయని తెలుస్తోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle