newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

ఆఫర్లతో బురిడీ కొట్టిస్తున్న ఆన్ లైన్ మోసగాళ్ళు .. జాగ్రత్త!

01-06-202001-06-2020 13:10:28 IST
Updated On 01-06-2020 14:54:21 ISTUpdated On 01-06-20202020-06-01T07:40:28.058Z01-06-2020 2020-06-01T07:40:00.082Z - 2020-06-01T09:24:21.222Z - 01-06-2020

ఆఫర్లతో బురిడీ కొట్టిస్తున్న ఆన్ లైన్ మోసగాళ్ళు .. జాగ్రత్త!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మార్కెట్లో లక్ష రూపాయలు అమ్మే ఫోన్ మీకు 5వేలకే కావాలా?

ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా 90శాతం తగ్గింపు

యాపిల్, వన్ ప్లస్ వంటి కేవలం 10వేలకే... ఇలా ఆఫర్ల గురించి ఊదరగొడతారు. 

ఈజీమనీకి అలవాటు పడిన కేటుగాళ్ళు అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వినియోగదారుల బలహీనతలను సొమ్ముచేసుకుంటున్నారు. .. ఆన్ లైన్ లో ఇలాంటి ప్రకటనలు చూసి ఆశపడే వారిని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు.. తక్కువ ధరలకు వస్తుందనే ఆశే వారికి పెట్టుబడిగా ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. మార్కెట్ లో లక్ష రూపాయలు అమ్మే ఫోన్ కేవలం 5,10వేలకే వస్తుందంటే ఎవరైనా ఆశపడతారు.

అయితే కొంతమంది ఇది ఎలా సాధ్యం, ఇది మోసం అని గ్రహించి లైట్ తీసుకుంటారు. మరికొంతమంది మాత్రం ఆశతో ఆన్ లైన్లో మోసగాళ్ల చేతిలో మోసపోతుంటారు.. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి.. తక్కువ ధరకే ఫోన్లు, ఇతర ఎలక్ట్రా నిక్‌ వస్తువులు ఉన్నట్లు ప్రచారం చేసి ఆశపడిన వారితో ముందుగా కొంత డబ్బు అడ్వాన్స్‌గా చెల్లించాలని చెప్పేవారు. అడ్వాన్స్‌ వచ్చిన తరువాత నకిలీ ఇన్‌వాయిస్‌ చూపించి, సరుకును కొరియర్‌లో పంపామని మిగతా సొమ్ము చెల్లించాలని చెప్పి మిగతా డబ్బు ను వేర్వేరు అకౌంట్‌లలో జమచేయించుకునేవారు. తరువాత కొరియర్‌ బాయ్‌లా ఫోన్‌చేసి పార్సిల్‌ను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారని, జీఎస్ టీ తదితర ఫీజులు చెల్లించాలని చెప్పి మరికొంత డబ్బులాగే వాళ్లు. ఎక్కువయ్యారు. వీళ్ళు మోసగాళ్లు అని తెలుసుకునే లోపే మీ దగ్గర నుంచి మొత్తం దోచుకుంటున్నారు.

ఈ సైబర్ నేరగాళ్లు చివరాఖరికి ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ఆన్ లైన్ డెలివరీ సంస్థల సైట్స్ ని సైతం హ్యాక్ చేస్తున్నారు.. ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ లలో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ పేరుతో  90శాతానికి పైగా ఆపర్లు పెట్టాయి అని చూపిస్తారు.  దానిపై క్లిక్ చేస్తే నిజంగానే సైట్ ఓఫైన్ అవుతుంది.. అక్కడ కూడా  90శాతం తగ్గింపు ఆఫర్లు చూపిస్తాయి. అయితే ఇక్కడే అసలు మతలబు ఉంటుంది.. ఈ పెద్ద సంస్థలకు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం స్పాట్ క్యాష్ అంటే డిజిటల్ ట్రాన్స్ ఫర్లే వుంటాయి.  గూగుల్ పే, ఫోన్ పే అకౌంట్స్ లో చెల్లించాలి. మీరు ఒకసారి చెల్లిస్తే అంతే సంగతులు. 

మార్కెట్లో శాంసంగ్ గేలాక్సీ, గేలాక్సీ ఎస్ 10, యాపిల్, మైక్రోమ్యాక్స్, మాక్ బుక్, ల్యాప్ టాప్ లు, వన్ ప్లస్ వంటి ఫోన్లు చాలా తక్కువ ధరకు 5 నుంచి 10 వేలకు ఇస్తామంటారు. ఇలాంటి నేరగాళ్లపై మీడియా దృష్టిపెట్టింది. ఓ  ఆన్లైన్ మోసగాడికి .. ఓమీడియా ప్రతినిధికి మధ్య జరిగిన సంభాషణ ఎలా సాగిందో మీరే చదవండి. 

సైబర్ నేరగాడు:: హలో బ్రో.. మా దగ్గర వన్ ప్లస్ 7 ఉంది.. తీసుకోవడం ఇంట్రెస్ట్ ఉందా..?

మీడియా ప్రతినిధి :: ఉంది ఎంత కాస్ట్?

సైబర్ నేరగాడు: ఇది కేవలం 10వేలు మాత్రమే.

మీడియా  ప్రతినిధి: క్యాష్ ఆన్ డెలివరీ. ఆప్షన్ ఉందా..

సైబర్ నేరగాడు: లేదు డౌన్ పేమెంట్ 3వేలు.

మీడియా ప్రతినిధి: పేమెంట్ ఎలా ఇవ్వాలి మీకు? 

సైబర్ నేరగాడు: గూగుల్ పే, లేదా ఫోన్ పే ద్వారా నెంబర్ 8895....

మీడియా ప్రతినిధి: ఫోన్ ఎలా పంపిస్తారు.

సైబర్ నేరగాడు::48గంటల్లో డీహెచ్ఎల్ కొరియర్ సర్వీస్ ద్వారా పంపిస్తాం.

మీడియా ప్రతినిధి: డబ్బులు పంపించిన తరువాత మీరు ఫోన్ పంపించకపోతే నా పరిస్థితి?

సైబర్ నేరగాడు:దాని గురించి మీరు ఏమీ ఆలోచించకండి నమ్మండి అలాంటిది ఏమీ జరగలేదు. మాకు పేమెంట్ రాగానే మీకు ఫోన్ షిఫ్ట్ చేసి ట్రాకింగ్ నెంబర్ పంపించడం జరుగుతుంది.. దాని లొకేషన్ ఎక్కడ ఉందో మీరు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు.

మీడియా ప్రతినిధి: నాకు మూడు ఫోన్లు కావాలి ... కానీ నా డబ్బులకు గ్యారంటీ ఏంటి?

సైబర్ నేరగాడు: మనీ రాగానే షిఫ్ మెంట్ చేసి మీకు ట్రాకింగ్ నెంబర్ పంపిస్తాం నమ్మండి.

మీడియా ప్రతినిధి: ట్రాకింగ్ నెంబర్ పంపించకపోతే పరిస్థితి ఏంటి? 

సైబర్ నేరగాడు:నమ్మండి . డబ్బులు కట్టగానే ట్రాకింగ్ నెంబర్ పంపిస్తాం..

మీడియా  ప్రతినిధి: నేను నిన్ను ఎలా నమ్మగలను మీరు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి అథరైజ్డ్ సంస్థ కాదుగా..?

సైబర్ నేరగాడు: ప్రతి వస్తువు 100శాతం గ్యారెంటీ, వారెంటీ తో పంపించడం జరుగుతుంది.. మీరు పేమెంట్ చేయడానికి రెడీగా ఉన్నారా...?

మీడియా ప్రతినిధి: మీ గూగుల్ పే నెంబర్ పంపించండి.

సైబర్ నేరగాడు:88958....

మీడియా ప్రతినిధి: నాకు నమ్మకం కలగడం లేదు మీ ఆధార్ నెంబర్ పంపించండి.

సైబర్ నేరగాడు: నాకు ఆధార్ అంటే తెలియదు... నేను భారతీయుడిని కాదు నమ్మండి... అంటూ ఫోన్ పెట్టేశాడు. 

చూశారుగా ఈ సైబర్ నేరగాళ్లు మన ఆశనే పెట్టుబడిగా చేసుకుని మోసాలకు తెగబడుతున్నారు.. ఒకసారి ఎక్కువ పేమెంట్ అయితే సందేహం వస్తుందని డౌన్ పేమెంట్ 2లేదా 3వేలు పంపించమంటారు.. వాళ్ల టార్గెట్ ఎక్కువ మంది ద్వారా తక్కువ పేమెంట్ వచ్చేలా చేస్తారు. అమౌంట్ తక్కువగా ఉండడం వలన మోసపోయిన వారు సైతం పోలీసులకు కంప్లైంట్ చేయడంలేదు. చూశారుగా ఇలాంటి సైబర్ నేరగాళ్ళ బారిన పడి మీ డబ్బుల్ని పోగొట్టుకోకండి. ఆయా కంపెనీల సెక్యూరిటీ వెబ్ సైట్ల నుండే కొనుగోలు చేయండి. మోసాలకు గురికాకండి. 

 

టిక్ టాక్ పై నిషేధం.. లోకల్ యాప్‌ చట్ పట్‌కు  గిరాకీ

టిక్ టాక్ పై నిషేధం.. లోకల్ యాప్‌ చట్ పట్‌కు గిరాకీ

   04-07-2020


వాట్సాప్ మరింత ఆకర్షణీయం.... కొత్తగా ఐదు ఫీచర్లు

వాట్సాప్ మరింత ఆకర్షణీయం.... కొత్తగా ఐదు ఫీచర్లు

   03-07-2020


తన రికార్డు తనే బ్రేక్ చేసిన అమెజాన్ సీఈవో

తన రికార్డు తనే బ్రేక్ చేసిన అమెజాన్ సీఈవో

   02-07-2020


చింగారి' ఉండగా టిక్ టాక్ ఇక ఎందుకు.. గంటలోపే లక్షమంది డౌన్ లోడ్

చింగారి' ఉండగా టిక్ టాక్ ఇక ఎందుకు.. గంటలోపే లక్షమంది డౌన్ లోడ్

   01-07-2020


ఐపీఎల్ 2020పై చైనా ఎఫెక్ట్.. వివోపై బీసీసీఐ కీలక నిర్ణయం?

ఐపీఎల్ 2020పై చైనా ఎఫెక్ట్.. వివోపై బీసీసీఐ కీలక నిర్ణయం?

   01-07-2020


టిక్ టాక్ పై బ్యాన్. ... డేవిడ్ వార్నర్‌పై సెటైర్లు

టిక్ టాక్ పై బ్యాన్. ... డేవిడ్ వార్నర్‌పై సెటైర్లు

   30-06-2020


టిక్ టాక్‌కి ఇండియా స్ట్రాంగ్ పంచ్.. ప్లే స్టోర్ నుంచి ఔట్

టిక్ టాక్‌కి ఇండియా స్ట్రాంగ్ పంచ్.. ప్లే స్టోర్ నుంచి ఔట్

   30-06-2020


బ్రేకింగ్: ఇండియా సీరియస్ యాక్షన్.. 59 యాప్స్‌పై నిషేధం

బ్రేకింగ్: ఇండియా సీరియస్ యాక్షన్.. 59 యాప్స్‌పై నిషేధం

   29-06-2020


నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అమెజాన్లో అవకాశాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అమెజాన్లో అవకాశాలు

   29-06-2020


గూగుల్ పే పై నిషేధమా? ఎన్ పిసీఐ  వివరణ

గూగుల్ పే పై నిషేధమా? ఎన్ పిసీఐ వివరణ

   27-06-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle