newssting
BITING NEWS :
* అమరావతి: వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అమరావతి: నేడు శాసనమండలిలో అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం*విజయవాడ: నేడు బీజేపీ-జనసేన నేతల సమావేశం.. రాజధాని మార్పుపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న పార్టీలు*నేడు ఆందోళనలకు పిలుపునిచ్చిన అమరావతి పరిరక్షణ సమితి.. మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనలు*జగన్ చిన్నవాడైనా చేతులు జోడించి నమస్కరిస్తున్నా..మూడు రాజధానుల నిర్ణయం సరికాదు..తరలింపు మీద జగన్ మరోమారు ఆలోచించాలి : చంద్రబాబు*బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డా.. అభినందించిన హోంమంత్రి అమిత్ షా... బీజేపీ నేతలు

సోనియా త‌ప్ప వేరే దారి లేదా..?

12-07-201912-07-2019 07:07:19 IST
Updated On 12-07-2019 11:35:58 ISTUpdated On 12-07-20192019-07-12T01:37:19.848Z12-07-2019 2019-07-12T01:37:15.933Z - 2019-07-12T06:05:58.444Z - 12-07-2019

సోనియా త‌ప్ప వేరే దారి లేదా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
130 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సంక్షోభాలు ఆ పార్టీకి కొత్తేమీ కాకున్నా ఇప్పుడు మాత్రం ఆ పార్టీ తేరుకుంటుందా అనే అనుమానాలు ఆ పార్టీ శ్రేణుల్లోనే వ‌స్తున్నాయి. ఓ వైపు పార్టీకి అధ్య‌క్షుడు లేకుండా చుక్కాని లేని నావ‌లా ఆ పార్టీ ప‌య‌నిస్తుంటే మ‌రో వైపు కాంగ్రెస్ పార్టీని ఒక్కో రాష్ట్రంలో క‌బ‌లించే దిశ‌గా భార‌తీయ జ‌న‌తా పార్టీ పావులు క‌దుపుతోంది.

క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ - జేడీఎస్ కూట‌మి ప్ర‌భుత్వం కూలిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. క‌ర్ణాట‌క‌లో ప్ర‌భుత్వాన్ని కాపాడుకునేందుకు పార్టీ ప్ర‌య‌త్నిస్తుండ‌గా మ‌రోవైపు గోవాలో కాంగ్రెస్‌కు బీజేపీ పెద్ద షాక్ ఇచ్చింది. ఏకంగా ప‌ది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌కు కాషాయ కండువాడ క‌ప్పేసింది.

ఇక‌, తెలంగాణ స‌హా ప‌లు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ను దెబ్బ‌తీసేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తుంది. ఎత్తెస‌రు మెజారీటీ నెట్టుకొస్తున్న రాజ‌స్థాన్‌, మ‌ధ్య ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాల‌ను బీజేపీ టార్గెట్ చేసింద‌ని, అక్క‌డ కూడా కర్ణాట‌క త‌ర్వాత ఆప‌రేష‌న్ క‌మ‌ల స్టార్ట్ చేసే యోచ‌న‌లో బీజేపీ ఉంద‌నే ప్ర‌చారం ఉంది.

మ‌రో వైపు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీ దారుణ ఓట‌మి త‌ర్వాత నైతిక బాధ్య‌త వ‌హిస్తూ పార్టీ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. సీనియ‌ర్లు ఎంత న‌చ్చ‌జెప్పినా ఆయ‌న వెన‌క్కు త‌గ్గ‌డంతో ఆయ‌న స్థానంలో పార్టీ తాత్కాలిక అధ్య‌క్షుడిగా 90 ఏళ్ల మోతీలాల్ వోరాను పెట్టారు. రాహుల్ గాంధీ రాజీనామా త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తున్నారు.

దీంతో పార్టీ ప‌రిస్థితి రోజురోజుకూ దిగ‌జారిపోతోంది. ఈ స‌మ‌యంలో పార్టీ కొత్త అధ్య‌క్షుడిగా ఎవ‌రిని నియ‌మించాల‌నేది కూడా ఆ పార్టీ తేల్చుకోలేక‌పోతోంది. నిన్న‌టి వ‌ర‌కు మోతీలాల్ వోరా, సుశీల్ కుమార్ షిండే, అహ్మ‌ద్ ప‌టేల్‌, జ్యోతిరాధిత్య సింధియా, స‌చిన్ పైల‌ట్ వంటి వారి పేర్లు వినిపించాయి.

అయితే, వీరెవ‌రు పార్టీ బాధ్య‌త‌లు తీసుకున్నా ప్ర‌స్తుత క్లిష్ట ప‌రిస్థితుల్లో పార్టీని గాడిన పెట్ట‌డం సాధ్యం కాద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్లు భావిస్తున్నారు. దీంతో మ‌రోసారి సోనియా గాంధీని కాంగ్రెస్ అధ్య‌క్షురాలిని చేయాల‌ని వారు ఆలోచ‌న చేస్తున్నార‌ట‌. తాత్కాలికంగా అయినా ఆమె అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌డితే పార్టీ కొంత తేరుకునే అవ‌కాశం ఉంటుంద‌నేది వారి ఆలోచ‌న‌.

ఈ విషయాన్ని సోనియా గాంధీ కూడా ఖండించ‌క‌పోవ‌డంతో మ‌రోసారి ఆమెనె కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు జాతీయ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. 1998లోనూ పార్టీ క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు సోనియా గాంధీ పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టి స‌మ‌ర్థంగా నిర్వ‌హించారు. రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకురాగ‌లిగారు. దీంతో సోనియాపై కాంగ్రెస్ సీనియ‌ర్లు ఆశ‌లు పెట్టుకున్నారు.

కేంద్రం చొరవ.. కృష్ణా, గోదావరి సమస్యలపై ఫోకస్

కేంద్రం చొరవ.. కృష్ణా, గోదావరి సమస్యలపై ఫోకస్

   an hour ago


సూరత్ టెక్స్ టైల్స్ భవనంలో భారీ అగ్నిప్రమాదం

సూరత్ టెక్స్ టైల్స్ భవనంలో భారీ అగ్నిప్రమాదం

   2 hours ago


పవన్ కుమార్ గుప్తాకు చుక్కెదురు.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

పవన్ కుమార్ గుప్తాకు చుక్కెదురు.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

   19 hours ago


చైనా వెళుతున్నారా.... ఆ వైరస్‌తో తస్మాత్ జాగ్రత్త!

చైనా వెళుతున్నారా.... ఆ వైరస్‌తో తస్మాత్ జాగ్రత్త!

   20-01-2020


బ‌డ్జెట్‌కు ముందు హ‌ల్వా వేడుక‌.. ఈ క‌థ మీకు తెలుసా..?

బ‌డ్జెట్‌కు ముందు హ‌ల్వా వేడుక‌.. ఈ క‌థ మీకు తెలుసా..?

   20-01-2020


షిర్డీ ఆలయం మూసివేత లేదు.. సంస్థాన్ ట్రస్ట్ ప్రకటన

షిర్డీ ఆలయం మూసివేత లేదు.. సంస్థాన్ ట్రస్ట్ ప్రకటన

   19-01-2020


రూ.2 వేల నోటుపై సంచలన నిజాలు

రూ.2 వేల నోటుపై సంచలన నిజాలు

   19-01-2020


నిర్భయ నిందితులకు రాష్ట్రపతి షాక్.. క్షమాభిక్ష పిటిషన్ డిస్మిస్

నిర్భయ నిందితులకు రాష్ట్రపతి షాక్.. క్షమాభిక్ష పిటిషన్ డిస్మిస్

   17-01-2020


ఇస్రో కీర్తిపతాక.. జీశాట్-30 ప్రయోగం విజయవంతం

ఇస్రో కీర్తిపతాక.. జీశాట్-30 ప్రయోగం విజయవంతం

   17-01-2020


కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం... ఐదుగురి అరెస్ట్

కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం... ఐదుగురి అరెస్ట్

   17-01-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle