newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సీపీఎం నూతన పంథా.. ఆడియో రూపంలో మేనిఫెస్టో

28-03-201928-03-2019 17:31:02 IST
Updated On 28-03-2019 18:47:02 ISTUpdated On 28-03-20192019-03-28T12:01:02.679Z28-03-2019 2019-03-28T12:00:48.161Z - 2019-03-28T13:17:02.578Z - 28-03-2019

సీపీఎం నూతన పంథా.. ఆడియో రూపంలో మేనిఫెస్టో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి నడుస్తోంది. వివిధ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలను విడుదలచేస్తున్నాయి. అయితే ఎన్నికల సంఘం మేనిఫెస్టోల విడుదలపై ఆంక్షలు విధించింది. పోలింగ్ జరిగే తేదీ ముందు చివరి 48 గంటలలో రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలు విడుదల చేయకుండా ఎన్నికల సంఘం నిషేధించింది. ఎన్నికల సంఘం ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోలను విడుదల చేయడాన్ని ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిధిలోకి తీసుకొచ్చింది. ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించిన తరువాత రాజకీయ పార్టీలు తప్పనిసరిగా అనుసరించవలసిన నిబంధనలన్నీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఉంటాయి. 

ఎన్నికలు ఒకే దశలో జరిగితే, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126లో పేర్కొన్న ప్రకారం నిషిద్ధ కాలంలో రాజకీయ పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోలను విడుదల చేయకూడదు. ఒకవేళ ఎన్నికలు రెండు లేదా అంతకన్నా ఎక్కువ దశల్లో జరిగితే, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126లో పేర్కొన్న ప్రకారం అన్ని దశల్లోనూ నిషిద్ధ కాలంలో పార్టీలు మ్యానిఫెస్టోలను విడుదల చేయకూడదు. ఇప్పటి వరకు పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేసే సమయంపై నియమాలు లేవు. కానీ ఇప్పుడు నిబంధనలు కఠినతరం చేయడంతో పార్టీలు ఆలోచనలో పడ్డాయి.

ఇదిలా ఉంటే కమ్యూనిస్టు పార్టీ కొత్త పంథా అనుసరించింది. దేశంలోనే మొదటి సారిగా ఆడియో రూపంలో సీపీఎం మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి విడుదల చేశారు. ఐదేళ్ళ కాలంలో ప్రజలు ఈ ప్రభుత్వ విధానాల పట్ల చాలా ఇబ్బంది పడ్డారని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో ప్రజల బ్రతుకు తెరువుపై దాడులు జరిగాయని, గతంలో ఏ ప్రభుత్వాల హయాంలో ఇలా జరగలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వంలో ధనిక, పేదల మధ్య వ్యత్యాసం బాగా ఎక్కువైందన్నారు. ధనికులు మరింత ఎక్కువైతే.. పేదరికం పెరిగిందన్నారు. 

సీపీఎం ద్వారా మాత్రమే ప్రత్యామ్నాయ విధానాలు సాధ్యం అనేది మేనిఫెస్టోలో వివరించామన్నారు. రైతులకు 50 శాతం సహాయం కూడా అందిస్తామని తెలిపారు. రాష్ట్రస్థాయి కమిటీలు రాష్ట్రస్థాయి మేనిఫెస్టోను విడుదల చేస్తాయని వివరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే లౌకికవాద ప్రభుత్వం రావాలని కోరారు. ఆ లౌకిక వాద ప్రభుత్వంలో కమ్యునిస్టులు ఉండాలనేది మేనిఫెస్టోలో ప్రధాన అంశమన్నారు. మొత్తం మీద కమ్యూనిస్టులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. గతంతో పోలిస్తే దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు ప్రతినిధుల సంఖ్య తగ్గుతూనే ఉంది. 

 

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   2 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   10 hours ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   11 hours ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   21 hours ago


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle