విద్యార్థులకు గుడ్ న్యూస్.. ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఫ్రీ
06-07-202006-07-2020 11:07:13 IST
Updated On 06-07-2020 12:34:35 ISTUpdated On 06-07-20202020-07-06T05:37:13.651Z06-07-2020 2020-07-06T05:37:00.739Z - 2020-07-06T07:04:35.301Z - 06-07-2020

కరోనాతో దేశంలో విద్యారంగం సంక్షోభంలో పడింది. పరీక్షలు రద్దయిపోయి గ్రేడ్ ల ఆధారంగా ఫలితాలు ప్రకటిస్తున్నారు. రాబోయే రోజుల్లో విద్యావ్యవస్థలో కీలక మార్పులు రాబోతున్నాయి. కేంద్రం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలని కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో ఆన్లైన్ క్లాసులు వినాలన్నా, కోర్సులు విజయవంతంగా పూర్తి చేయాలన్నా విద్యార్థులకు సొంతంగా డిజిటల్ డివైజ్‌లు అవసరం ఉంటుంది. దీంతో రూ.15 వేలు విలువ చేసే సాంకేతిక పరికరాలను విద్యార్థులకు అందించాలని మానవ వనరుల అభివృద్ది శాఖ ప్రతిపాదించింది. వచ్చే ఐదేళ్లలో దేశంలోని అన్ని కాలేజీలు, యూనివర్శిటీల్లో ఎన్రోల్ అయ్యే విద్యార్థుల్లో 40 శాతం మందికి ఉచితంగా డిజిటల్ డివైజ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2025-26 నాటికి దేశంలోని 4 కోట్ల మంది స్టూడెంట్స్‌కి ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్, ఫోన్స్, టెలివిజన్ సెట్స్ లాంటివి అవసరం అవుతాయి. వీటిని రెడీచేయనుంది. మేకిన్ ఇండియా కాన్సెప్ట్ లో భాగంగా వీటిని భారతీయ సంస్థలు తయారుచేయనున్నాయి. ఈ డిజిటల్ ప్రాజెక్ట్ కోసం రాబోయే ఐదేళ్లకు గానూ రూ.60 వేల కోట్లు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటాగా రూ.36,473 కోట్లను ఖర్చు చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఆయా రాష్ట్రాలు భరించాలి. దీని ద్వారా 4 కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లల కోసం స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు కొనుగోలు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. కరోనా సంక్షోభం వల్ల ఉపాధి కోల్సోయారు అనేకమంది. దీంతో వారికి పిల్లల చదువులు కష్టంగా మారాయి. తాజాగా కేంద్రం ఆలోచన వారికి ఊరట నిచ్చేలా వుంది.

మరో కీలకమైన పదవిలో భారతీయ-అమెరికన్
11-05-2022

మార్క్సిజంపై నమ్మకాన్ని పెంపొందించండి
10-05-2022

ఉక్రెయిన్‌లో పర్యటించిన అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్
10-05-2022

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జాకెట్కి వేలంలో 90వేల డాలర్లు
10-05-2022

పాత నిబంధనను తెరపైకి తెచ్చిన సెర్బియా ..!
09-05-2022

దక్షిణ కొరియాలో పెరుగుతున్న కొత్త COVID-19 కేసులు
08-05-2022

రెండోసారి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రాన్ ప్రమాణ స్వీకారం
08-05-2022

OPEC క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర పెరిగింది ..!
06-05-2022

‘పద్మ’అవార్డుల కోసం ఆన్లైన్ నామినేషన్లకి ఆహ్వానం
06-05-2022

రక్షణ సహకారంపై దక్షిణ కొరియా, నార్వే ..!
02-05-2022
ఇంకా