newssting
Radio
BITING NEWS :
మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత. కొద్దిరోజుల క్రితమే కరోనా నుంచి కోలుకున్న నాయిని. మళ్లీ లంగ్ ఇన్ఫెక్షన్ సోకడంతో అపోలోలో చికిత్స. బుధవారం అర్థరాత్రి 12.25 గంటలకు నాయిని మరణించినట్లు తెలిపిన అపోలో ఆస్పత్రి వర్గాలు. * 6వ రోజు ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్నదసరా మహోత్సవాలు. లలితా త్రిపురసుందరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. * మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం. నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన వీడియో జర్నలిస్ట్ కుమారుడు దీక్షిత్. మహబూబాబాద్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపై బాలుడి మృతదేహం. కిడ్నాప్ చేసిన రోజే బాలుడిని హతమార్చినట్లు అనుమానిస్తున్న పోలీసులు. పోలీసుల అదుపులో బాధిత కుటుంబ బంధువు మనోజ్ రెడ్డి. * మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే రాజీనామా. నేడు లేదా రేపు కాంగ్రెస్ లో చేరే అవకాశం. * కరోనా టీకా వికటించి వాలంటీర్ మృతి. బ్రెజిల్ లో టీకాను అభివృద్ధి చేసిన ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా. వాలంటీర్ మృతికి గల కారణాలను తెలుసుకుంటున్నామన్న ఆక్స్ ఫర్డ్ వైద్యులు.

రైతుల దశ మారుతుంది.. వ్యవసాయ బిల్లుల ఆమోదంపై ప్రధాని మోదీ

18-09-202018-09-2020 17:26:20 IST
2020-09-18T11:56:20.713Z18-09-2020 2020-09-18T11:56:18.313Z - - 23-10-2020

రైతుల దశ మారుతుంది.. వ్యవసాయ బిల్లుల ఆమోదంపై ప్రధాని మోదీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పార్లమెంటు ఆమోదించిన వ్యవసాయ బిల్లులు దేశంలోని రైతులకు మరిన్ని అవకాశాలు కల్పించనున్నాయని. రైతుల దశ మారుతుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. వ్యవసాయ రంగ చరిత్రలో ఇది గొప్ప మలుపుని,  రైతులను పక్కదోవలు పట్టించడానికే ఈ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారని మోదీ వ్యాఖ్యానించారు. 

గురువారం లోక్ సభ ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులు చారిత్రాత్మకమైనవని, ఇవి రైతులకు మాత్రమే కాకుండా దేశ వ్యవసాయ రంగానికే అతి ముఖ్యమైనవని ప్రధాని అభివర్ణించారు. మధ్య దళారీలనుంచి, ఇతర అడ్డంకుల నుంచి రైతులను బయటపడవేయడమే కాకుండా ఈ బిల్లులు రైతులను విముక్తి చేస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఈ వ్యవసాయ సంస్కరణ బిల్లులు రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడంపై అనేక అవకాశాలు కల్పిస్తోందని, వారికి లాభాలను కొనితెస్తుందని, వ్యవసాయ రంగం కూడా ఆధునిక సాంకేతిక శక్తి సహాయంతో ప్రయోజనం పొందుతాయని ప్రధాని చెప్పారు. దీంతో దేశ రైతులు సాధికారతను పొందుతారని చెప్పారు.

కేంద్రప్రభుత్వం సమర్పించిన రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక) బిల్లు, ధరల హామీపై రైతుల సాధికారత, రక్షణ ఒప్పందం, రైతు సేవల బిల్లులను లోక్ సభ గురువారం మూజువాణీ ఓటుతో ఆమోదించింది. కాగా, కాంగ్రెస్, డీఎంకే, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ సభ్యులు ఈ బిల్లులకు నిరసనగా వాకౌట్ చేశారు.

కాగా, కేంద్ర మంత్రి, ఎన్డీయేలో భాగస్వామి అయిన శిరోమణి అకాలీదళ్ సభ్యురాలు అయిన హరి సిమ్రాట్ కౌర్ బాదల్ వ్యవసాయ రంగ బిల్లులకు వ్యతిరేకంగా తన మంత్రిపదవికి రాజీనామా చేశారు.

కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన తెల్పిన కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. తన ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చాలా సార్లు ఇలాంటి సంస్కరణలను ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీ తీరా కేంద్ర ప్రభుత్వం అవే బిల్లులను తీసుకువచ్చినప్పుడు వ్యతిరేకిస్తోందని విమర్శించారు. దేశరైతులను మోదీ విముక్తి చేశారని, ఈ బిల్లులను ఆమోదించిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని తోమర్ పేర్కొన్నారు.

 

జూలైలో క‌రోనా పేషెంట్ చ‌నిపోతే.. ప‌క్క‌న వారికోసం ఇప్పుడు స‌ర్చింగ్

జూలైలో క‌రోనా పేషెంట్ చ‌నిపోతే.. ప‌క్క‌న వారికోసం ఇప్పుడు స‌ర్చింగ్

   16 hours ago


బీజేపీ నయా ఎన్నికల స్టంట్.. ప్ర‌తి ఒక్క‌రికీ ఉచితంగా కోవిద్ టీకా

బీజేపీ నయా ఎన్నికల స్టంట్.. ప్ర‌తి ఒక్క‌రికీ ఉచితంగా కోవిద్ టీకా

   16 hours ago


భారత నౌకా దళంలోకి వచ్చేసిన ఐఎన్ఎస్ కవ‌ర‌త్తి.. శత్రువుల వెన్నులో వణుకే

భారత నౌకా దళంలోకి వచ్చేసిన ఐఎన్ఎస్ కవ‌ర‌త్తి.. శత్రువుల వెన్నులో వణుకే

   16 hours ago


ఏకంగా బ‌స్టాప్ నే ఎత్తుకెళ్లారు

ఏకంగా బ‌స్టాప్ నే ఎత్తుకెళ్లారు

   17 hours ago


కరోనా కేసుల సంఖ్యపై అప్డేట్స్..!

కరోనా కేసుల సంఖ్యపై అప్డేట్స్..!

   18 hours ago


టెట్‌ వ్యాలిడిటీ శాశ్వతం.. ఎన్‌సీటీఈ నిర్ణయం

టెట్‌ వ్యాలిడిటీ శాశ్వతం.. ఎన్‌సీటీఈ నిర్ణయం

   18 hours ago


భారత్ లో పరిశోధనలు ఎంతో ముఖ్యమని ప్రపంచానికి చెప్పిన బిల్ గేట్స్

భారత్ లో పరిశోధనలు ఎంతో ముఖ్యమని ప్రపంచానికి చెప్పిన బిల్ గేట్స్

   21-10-2020


సాయిబాబాకు మందులు, పుస్తకాలు కూడా ఇవ్వరా.. హరగోపాల్

సాయిబాబాకు మందులు, పుస్తకాలు కూడా ఇవ్వరా.. హరగోపాల్

   21-10-2020


ఫౌచీ ఒక ఇడియట్‌.. నోరు పారేసుకున్న ట్రంప్

ఫౌచీ ఒక ఇడియట్‌.. నోరు పారేసుకున్న ట్రంప్

   21-10-2020


చైనా సైనికుడిని అప్పగించేశారు

చైనా సైనికుడిని అప్పగించేశారు

   21-10-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle