newssting
BITING NEWS :
* వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని నరేంద్రమోదీ. * ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ మాదిరే‌ రష్యా‌ వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి ప్రయోగాలలో కూడా స్వల్ప దుష్పలితాలు. * అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి. 14 మందికి గాయాలు. * షెడ్యూల్‌ కంటే ముందుగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశం. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచన చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మొగ్గుచూపిన మెజారిటీ సభ్యులు * సాంప్రదాయ, శాస్త్రోక్తంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. * ఏపీలో నేటి నుండి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు. ఈ నెల 26 వరకు.. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరగనున్న పరీక్షలు. ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి. తాజాగా మరో 1065 కేసులు నమోదు. ఒంగోలులో అత్యధికంగా 220 కేసులు నమోదు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు * తెలంగాణలో సోమవారం నుండి ప్రారంభం కానున్న పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు. అన్ని స్కూళ్లలో విధులకు హాజరు కానున్న సగం మంది టీచర్లు. రోజు విడిచి రోజు విధులకు హాజరు కానున్న ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే పాఠశాలకు విద్యార్థులు * ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు అతిభారీ వర్షాలు. పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, వంకలు. కుండపోత వర్షాలకు భారీగా నీటమునిగిన పంటలు.

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

04-08-202004-08-2020 06:53:31 IST
Updated On 04-08-2020 06:59:09 ISTUpdated On 04-08-20202020-08-04T01:23:31.256Z04-08-2020 2020-08-04T01:23:20.201Z - 2020-08-04T01:29:09.065Z - 04-08-2020

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దాదాపు అయిదు శతాబ్దాల భారత హిందువుల కల, 9 దశాబ్దాల న్యాయ పోరాటం అనంతరం అయోధ్యలో రామమందిర నిర్మాణ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్ట్‌ 5 ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అయోధ్య రామాలయ గొప్పతనం గురించి కనీవినీ ఎరుగని విధంగా వార్తలు, కథనాల ప్రసారంతో మీడియా వెర్రెత్తిపోతోంది. ఈ నేపథ్యంలో ఏనాటికైనా అయోధ్యలో ఆలయనిర్మాణం తప్పదంటూ కొండంత ఆశ పెట్టుకున్న ఇద్దరు సోదరులు గత 50 ఏళ్లకుపైగా మహా సముద్రాలు, నదులనుంచి నీటిని సేకరిస్తూ వస్తున్న వైనం తెలియవచ్చింది.

డెబ్బై సంవత్సరాల వయస్సు ఇద్దరు సోదరులు  రాధే శ్యామ్ పాండే, షాబ్ వైజ్ఞానిక్ మహాకవి త్రిఫాల తమ రామభక్తిని చాటుకున్నారు. వీరు 1968 నుంచి శ్రీలంకలోని పదహారు ప్రదేశాలు, ఎనిమిది నదులు, మూడు సముద్రాల ద్వారా రామమందిర నిర్మాణానికి నీటిని సేకరించారు. ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  రాధే శ్యామ్ పాండే స్పందిస్తూ.. రామమందిర నిర్మాణ ప్రారంభోత్సవానికి భారత్‌, శ్రీలంక నదుల నుంచి నీటిని సేకరించడం తన కల అని రాధే శ్యామ్ తెలిపారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణం ఎప్పుడు జరిగినా ఆ మహత్కార్యానికి భారత్, శ్రీలంకల నుంచి నదులు, సముద్రాల నుంచి పవిత్ర జలాలను సేకరించాలన్నది మా కల. శ్రీరామడి దయచేత ఆ లక్ష్యాన్ని ఇన్నాళ్లకు నెరవేర్చాము. 1968లో మొదలుపెట్టి 2019 వరకు 151 నదులు, మూడు సముద్రాల నుంచి నీటిని, శ్రీలంకలోని 16 ప్రాంతాల నుంచి మట్టిని సేకరించి నిల్వ చేశామని ఇద్దరు సోదరుల్లో ఒకరైన రాధే శ్యామ్ పాండే తెలిపారు. 

1968 నుంచి 2019 దాకా నేను కాలినడకన, మోటార్ సైకిల్‌లో, రైళ్లు, విమానాల్లో తిరిగి ఇన్ని నదులు, సముద్రాల నుంచి నీటిని, మట్టిని తీసుకొచ్చాను. రాముడి జన్మస్థలానికి ఆ పవిత్ర జలాలను, మట్టిని భక్తితో అప్పగిస్తానని రాధేశ్యామ్ పాండే వివరించారు. రాముడి అనుగ్రహంతోనే కొన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తూ వచ్చిన తన లక్ష్యం నెరవేరిందని తెలిపారు. 

కాగా మందిర నిర్మాణ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. 

రామాలయ భూమిపూజను చూసేందుకు పేద ముస్లిం 800 కి.మీ పాదయాత్ర

అతడొక పేదముస్లిం.. పేరు  మ‌హ్మ‌ద్ ఫైజ్ ఖాన్‌.. పేరులో ఏ విశేషమూ లేదు. కానీ అత‌ను శ్రీరామచంద్రుడి భ‌క్తుడు.. అయోధ్య‌లో రామమందిరం నిర్మాణం భూమి పూజ‌ను క‌ళ్లారా వీక్షించేందుకు వంద‌ల కిలోమీటర్లు కాలిన‌డ‌క‌న‌ ప్ర‌యాణం కొన‌సాగిస్తున్నాడు. ఇత‌ను రాముడి త‌ల్లి కౌస‌ల్యాదేవి జ‌న్మ‌స్థానంగా చెప్పుకుంటున్న చ‌త్తీస్‌గ‌ఢ్‌లోని చంద్‌ఖురి గ్రామవాసి. ఆయ‌న‌కు హిందూ దేవుళ్లంటే అమిత‌మైన భ‌క్తిగౌర‌వాలు. ఎంతోమంది దేవుళ్ల‌ను స్మ‌రించుకుంటూ ప‌రవ‌శించిపోతాడు. 

ఎన్నో ఏళ్ల నుంచి క‌ల గంటున్న అయోధ్య రామ‌మందిరానికి పునాదులు ప‌డుతుండ‌టంతో భూమి పూజ‌కు వెళ్లేందుకు కాలిన‌డ‌క‌న బ‌య‌లు దేరాడు. ప్ర‌స్తుతం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని అనుప్పుర్‌కు చేరుకున్నాడు. ఈ సంద‌ర్భంగా ఓ మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ తాను ముస్లింనే అయినా తన పూర్వీకులు హిందువులే కాబట్టి యావద్భారత దేశానికే దేవుడైన రాముడి ఆలయ నిర్మాణం కోసం అవసరమైన మట్టిని అయోధ్యకు 800 కిలోమీటర్లు కాలనడకన బయలుదేరానని చెప్పాడు. 

"ఇలా ఆల‌యాల‌ను సంద‌ర్శించ‌డం నాకు తొలిసారేం కాదు. 1500 కి.మీ న‌డిచి  ఎన్నో గుళ్లు, ఆశ్ర‌మాల్లో బ‌స చేశాను. వీటితో పోలిస్తే ఈ ప్ర‌యాణం కేవ‌లం 800 కిలోమీట‌ర్లు మాత్ర‌మే. ఇప్ప‌టివ‌ర‌కు ఏ ఒక్క‌రూ నాకు వ్య‌తిరేకంగా ఒక్క మాట మాట్లాడ‌లేదు. నేను ముస్లింనే.. కానీ, మా పూర్వీకులు హిందువులు. పాకిస్తాన్ జాతీయ క‌వి అల్లామా ఇక్బాల్.. రాముడిని భారత దేశానికే దేవునిగా పేర్కొన్నారు. అందుకే నా భ‌క్తి కొద్దీ కౌశ‌ల్యా జ‌న్మ‌స్థ‌ల‌మైన‌ చంద్‌ఖురి నుంచి అయోధ్య‌కు మ‌ట్టి తీసుకెళ్తున్నాను" అని మ‌హ్మ‌ద్ ఫైజ్ ఖాన్‌ తెలిపారు. 

కాగా అయోధ్య‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌నున్న రామ‌మందిర నిర్మాణానికి ఈ నెల 5న‌ భూమి పూజ చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి సుమారు 200 మంది హాజ‌రు కానున్నారు. 

దేశ సినీ పరిశ్రమని టెర్రరిజమ్‌ల నుంచి కాపాడాలి: కంగనా

దేశ సినీ పరిశ్రమని టెర్రరిజమ్‌ల నుంచి కాపాడాలి: కంగనా

   16 hours ago


పుస్తకాలే లేవు.. ఆన్‌లైన్ క్లాసులపై.. తల్లిదండ్రుల తీవ్ర ఆవేదన

పుస్తకాలే లేవు.. ఆన్‌లైన్ క్లాసులపై.. తల్లిదండ్రుల తీవ్ర ఆవేదన

   19 hours ago


పాకిస్తాన్, చైనా.. భారత సహనానికి పరీక్ష.. !

పాకిస్తాన్, చైనా.. భారత సహనానికి పరీక్ష.. !

   19 hours ago


చైనాతో చర్చలు సరే.. మరి పాకిస్తాన్ తో.. ఫరూక్ వ్యాఖ్యలు

చైనాతో చర్చలు సరే.. మరి పాకిస్తాన్ తో.. ఫరూక్ వ్యాఖ్యలు

   20 hours ago


ఆ కాలువ నిర్మాణం పిరమిడ్స్, తాజ్‌మహల్‌ కంటే గొప్ప కృషే... ఆనంద్ మహీంద్రా

ఆ కాలువ నిర్మాణం పిరమిడ్స్, తాజ్‌మహల్‌ కంటే గొప్ప కృషే... ఆనంద్ మహీంద్రా

   21 hours ago


పెరుగుతున్న నిరుద్యోగం.. అరకోటికి పైగా ఉద్యోగాలు హుష్!

పెరుగుతున్న నిరుద్యోగం.. అరకోటికి పైగా ఉద్యోగాలు హుష్!

   19-09-2020


ఉల్లి ఎగుమతుల నిషేధం ప్రయోజనం ఎవరికి?

ఉల్లి ఎగుమతుల నిషేధం ప్రయోజనం ఎవరికి?

   19-09-2020


అల్ ఖైదా కుట్ర భగ్నం.. అంతర్రాష్ట్ర ఉగ్రవాదులు అరెస్ట్

అల్ ఖైదా కుట్ర భగ్నం.. అంతర్రాష్ట్ర ఉగ్రవాదులు అరెస్ట్

   19-09-2020


ఆ ఏడు దేశాలకే 88 శాతం వ్యాక్సిన్ డోసులు.. గ్లోబల్ నివేదిక

ఆ ఏడు దేశాలకే 88 శాతం వ్యాక్సిన్ డోసులు.. గ్లోబల్ నివేదిక

   19-09-2020


రైతుల దశ మారుతుంది.. వ్యవసాయ బిల్లుల ఆమోదంపై ప్రధాని మోదీ

రైతుల దశ మారుతుంది.. వ్యవసాయ బిల్లుల ఆమోదంపై ప్రధాని మోదీ

   18-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle