newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

యాప్‌ల నిషేధం వివక్షాపూరిత వైఖరే.. చైనా కొత్త బెదిరింపులు

01-07-202001-07-2020 07:53:33 IST
Updated On 01-07-2020 10:30:24 ISTUpdated On 01-07-20202020-07-01T02:23:33.510Z01-07-2020 2020-07-01T02:23:29.210Z - 2020-07-01T05:00:24.880Z - 01-07-2020

యాప్‌ల నిషేధం వివక్షాపూరిత వైఖరే.. చైనా కొత్త బెదిరింపులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ఉన్నాయనే కారణంతో భారత ప్రభుత్వం 59 యాప్‌లపై నిషేధం విధించడంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పెట్టుబడిదారుల చట్టపరమైన హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపింది. చైనా యాప్‌లపై విధించిన నిషేధంపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ మాట్లాడుతూ.. ‘యాప్‌లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై చైనా తీవ్రంగా ఆందోళన చెందుతోంది. భారత ప్రభుత్వ నిర్ణయంతో తలెత్తిన పరిస్థితులను గమనిస్తున్నాం. అంతర్జాతీయ నిబంధనలు, స్థానిక చట్టాలకు లోబడి కార్యకలాపాలు నిర్వహించుకోవాలని చైనా ప్రభుత్వం చైనా వ్యాపార సంస్థలను ఎల్లప్పుడూ కోరుతోంది. చైనా సహా అంతర్జాతీయ పెట్టుబడిదారుల చట్టపరమైన, చట్టబద్ధమైన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంది’అని తెలిపారు. 

భారత్, చైనాల మధ్య ఆచరణాత్మక సహకారం వాస్తవానికి రెండు దేశాలకూ మేలు చేసేదే. అటువంటి సహకారంలో ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకోవడం భారత్‌కు ఏమాత్రం ప్రయోజనం కలిగించవు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

వాస్తవ విరుద్ధ కారణాల ప్రాతిపదికన చైనీస్ యాప్‌లను భారత్ పెద్ద ఎత్తున నిషేధించడం ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ఉల్లంఘనలో భాగమేనని చైనా ఆరోపించింది. అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన సాధారణ నిబంధనలను, ఈ కామర్స్‌ని భారత ప్రభుత్వ నిర్ణయం తోసిపుచ్చుతోందని చైనా ఎత్తిచూపింది.

లడఖ్ సరిహద్దు ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులను చైనా సైన్యం దారుణంగా చంపిన ఘటన జరిగి రెండువారాలు ముగిసిన తర్వాత భారత ప్రభుత్వం.. టిక్ టాక్, వియ్ చాట్, యూసీ బ్రౌజర్, జియోమీ యాప్స్ వంటి 60పైగా చైనా యాప్‌లను నిషేధించింది. 

ఉత్తర్వులకు లోబడి నడుచుకుంటాం

కాగా టిక్‌టాక్‌ యాప్‌ను బ్లాక్‌ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై ఆ సంస్థ స్పందించింది. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తామని, తమ యాప్‌ భారతీయ వినియోగదారుల సమాచారాన్ని చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వానికి చేరవేయలేదని తెలిపింది. వినియోగదారుల సమాచార గోప్యతకు కట్టుబడి ఉన్నామంది. ప్రభుత్వ సంస్థల ఆహ్వానం మేరకు సమాధానం, వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని టిక్‌టాక్‌ ఇండియా హెడ్‌ నిఖిల్‌ గాంధీ చెప్పారు.

మేము భారత ప్రభుత్వ ఆదేశాన్ని పాటించే పనిలో ఉన్నాం. అలాగే సమస్యను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి, పరిష్కారం కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. ఇండియాలో ఉన్న మా వినియోగదారుల భద్రత మాకు అత్యంత ప్రధానమైంది’ అనే సందేశం కనిపిస్తుంది. మరోవైపు భారత్‌లో తమ యాప్‌ను నిషేధించడంపై టిక్‌టాక్‌ ఇండియా హెడ్‌ నిఖిల్‌ గాంధీ స్పందిస్తూ.. తమ వినియోగదారుల డేటాను చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వానికి ఇవ్వలేదని, భవిష్యత్తులో కూడా అలా చేయబోమని వివరణ ఇచ్చారు.  భారత చట్టాల ప్రకారం, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలన్నీ పాటిస్తున్నామంటూ టిక్‌టాక్ ఇండియా  హెడ్ నిఖిల్ గాంధీ ఒక ప్రకటన విడుదల చేశారు. 

గూగుల్‌ ప్లే స్టోర్, యాపిల్‌ ప్లే స్టోర్‌ నుంచి తమ యాప్‌ను టిక్‌టాక్‌ సంస్థ తొలగించింది.

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   8 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   11 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   a day ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle