newssting
BITING NEWS :
* అమరావతి: వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అమరావతి: నేడు శాసనమండలిలో అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం*విజయవాడ: నేడు బీజేపీ-జనసేన నేతల సమావేశం.. రాజధాని మార్పుపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న పార్టీలు*నేడు ఆందోళనలకు పిలుపునిచ్చిన అమరావతి పరిరక్షణ సమితి.. మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనలు*జగన్ చిన్నవాడైనా చేతులు జోడించి నమస్కరిస్తున్నా..మూడు రాజధానుల నిర్ణయం సరికాదు..తరలింపు మీద జగన్ మరోమారు ఆలోచించాలి : చంద్రబాబు*బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డా.. అభినందించిన హోంమంత్రి అమిత్ షా... బీజేపీ నేతలు

మోడీ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం

30-05-201930-05-2019 07:43:51 IST
2019-05-30T02:13:51.558Z30-05-2019 2019-05-30T02:13:48.017Z - - 21-01-2020

 మోడీ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌ ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై గురువారం రాత్రి 7 గంటలకు కొత్త మంత్రులతో కలసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇంచుమించు 8వేల మంది అతిథుల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రధానమంత్రితో పాటు, కేంద్ర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాత్రి 8.30 గంటల వరకు  ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌ జగన్నాథ్‌, కిర్గిజ్‌ అధ్యక్షుడు సూరోన్‌బే జీన్‌బెకోవ్‌, బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ హమీద్‌, శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన, నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలి, మయన్మార్‌ అధ్యక్షుడు యు విన్‌ మైంట్‌, భూటాన్‌ ప్రధాని లోటయ్‌ సెరింగ్‌, థాయ్‌లాండ్‌ ప్రత్యేక దూత గ్రిసాద బూన్‌రాచ్‌లు హాజరుకానున్నారు. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మోదీ  ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా రానున్నారు. డీఎంకేకు ఆహ్వానం రాలేదని ఆ పార్టీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి టి.ఆర్‌.బాలు తెలిపారు. ఇదిలా ఉంటే మోడీ మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారో అనేది ఉత్కంఠగా ఉంది.

అనారోగ్యం కారణంగా అరుణ్ జైట్లీ మంత్రి పదవికి దూరంగా ఉంటానని ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కేంద్ర మంత్రివర్గంలో చేరుతారా? లేదా? అన్నదానిపైనా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. వచ్చే అక్టోబరు-నవంబర్‌లలో జరిగే మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, హర్యానా ఎన్నికల్లో పార్టీని గెలిపించేంతవరకూ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగి, ఆ తర్వాతే మంత్రివర్గంలో చేరుతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

ఒకవేళ అమిత్‌షా మంత్రివర్గంలో చేరితే ఆర్థిక, హోం, రక్షణశాఖల్లో ఏదో ఒకటి చేపట్టవచ్చన్న ప్రచారం జరుగుతోంది. నిబంధనల ప్రకారం కేంద్రమంత్రివర్గంలో ప్రధానితో సహా 82 మంది ఉండొచ్చు. సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే ఉత్తర్‌ప్రదేశ్‌కు ఎక్కువభాగం పదవులు దక్కుతాయని భావిస్తున్నారు.

ఇప్పుడు ఉన్న మంత్రివర్గంలో ప్రధానమంత్రితో సహా 10 మంది యూపీ వారే ఉన్నారు. పశ్చిమబెంగాల్‌, ఒడిశా, ఈశాన్యరాష్ట్రాలకు కొంత ప్రాధాన్యం పెంచే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణల్లో మాత్రమే తాజా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. అందువల్ల ఈ రెండురాష్ట్రాలకూ మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉంది. .

ఏపీకి కూడా ప్రాధాన్యత ఇవ్వవచ్చని అంటున్నారు.  ప్రస్తుతం కేంద్రమంత్రి వర్గంలో ఉన్న సురేష్‌ ప్రభు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ స్థానంలో ఇంకెవరినైనా తీసుకొని రాష్ట్రంలో భాజపా విస్తరణకు బీజాలు వేయొచ్చని అంచనా వేస్తున్నారు. తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది.

అరుణ్‌జైట్లీ అనారోగ్యం కారణంగా ఆర్థికశాఖ బాధ్యతలను ఇదివరకు తాత్కాలికంగా నిర్వహించిన పీయూష్‌ గోయల్‌కుగానీ, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్‌సిన్హా కుమారుడు జయంత్‌సిన్హాకుగానీ అప్పగించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. రాహుల్‌గాంధీని అమేథీలో ఓడించిన స్మృతి ఇరానీకి మంచి శాఖ ఇవ్వవచ్చు.  

మరోవైపు  బీజేపీ బాస్ అమిత్‌ షాతో బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ భేటీ అయ్యారు. శివసేన,. జేడీ(యు)కు ఒక కేంద్రమంత్రి పదవి, మరో సహాయ మంత్రి పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. బిహార్‌కు చెందిన లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షుడు రాం విలాస్‌ పాశ్వాన్‌కు మళ్లీ మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ ఆ పార్టీ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ పార్టీతోపాటు, అకాలీదళ్‌, అన్నా డీఎంకేలకు ఒక్కో పదవి లభించే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులకు, అతిథులకు విందు ఇవ్వనున్నారు. 

కేంద్రం చొరవ.. కృష్ణా, గోదావరి సమస్యలపై ఫోకస్

కేంద్రం చొరవ.. కృష్ణా, గోదావరి సమస్యలపై ఫోకస్

   3 hours ago


సూరత్ టెక్స్ టైల్స్ భవనంలో భారీ అగ్నిప్రమాదం

సూరత్ టెక్స్ టైల్స్ భవనంలో భారీ అగ్నిప్రమాదం

   3 hours ago


పవన్ కుమార్ గుప్తాకు చుక్కెదురు.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

పవన్ కుమార్ గుప్తాకు చుక్కెదురు.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

   21 hours ago


చైనా వెళుతున్నారా.... ఆ వైరస్‌తో తస్మాత్ జాగ్రత్త!

చైనా వెళుతున్నారా.... ఆ వైరస్‌తో తస్మాత్ జాగ్రత్త!

   20-01-2020


బ‌డ్జెట్‌కు ముందు హ‌ల్వా వేడుక‌.. ఈ క‌థ మీకు తెలుసా..?

బ‌డ్జెట్‌కు ముందు హ‌ల్వా వేడుక‌.. ఈ క‌థ మీకు తెలుసా..?

   20-01-2020


షిర్డీ ఆలయం మూసివేత లేదు.. సంస్థాన్ ట్రస్ట్ ప్రకటన

షిర్డీ ఆలయం మూసివేత లేదు.. సంస్థాన్ ట్రస్ట్ ప్రకటన

   19-01-2020


రూ.2 వేల నోటుపై సంచలన నిజాలు

రూ.2 వేల నోటుపై సంచలన నిజాలు

   19-01-2020


నిర్భయ నిందితులకు రాష్ట్రపతి షాక్.. క్షమాభిక్ష పిటిషన్ డిస్మిస్

నిర్భయ నిందితులకు రాష్ట్రపతి షాక్.. క్షమాభిక్ష పిటిషన్ డిస్మిస్

   17-01-2020


ఇస్రో కీర్తిపతాక.. జీశాట్-30 ప్రయోగం విజయవంతం

ఇస్రో కీర్తిపతాక.. జీశాట్-30 ప్రయోగం విజయవంతం

   17-01-2020


కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం... ఐదుగురి అరెస్ట్

కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం... ఐదుగురి అరెస్ట్

   17-01-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle