భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్
09-08-202009-08-2020 07:33:06 IST
2020-08-09T02:03:06.115Z09-08-2020 2020-08-09T02:03:03.114Z - - 27-06-2022

భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదంలో ప్రతిష్టంభన సమసిపోయిందని, లడఖ్‌లో తమ సేనల ఉపసంహరణ పూర్తయింది కాబట్టి వివాదాలు పక్కనబెట్టి ఇరుదేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నిద్దామంటూ చైనా చేసిన సూచనను భారత్ తిరస్కరించింది. సరిహద్దుల్లో చైనా యథాతథ స్థితిని పునరుద్ధరించే వరకు భారత సేనలు తూర్పు లడఖ్‌లోని 1,597 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖ వెంబడే ఉంటాయని డ్రాగన్‌కు భారత్ తేల్చిచెప్పింది. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలకు తూర్పు లడఖ్‌లోని వివాదాస్పద ప్రాంతాల్లో ఏప్రిల్ 20కి ముందున్న పరిస్థితులు నెలకొనాలని భారత్ షరతు విధించింది. పలుమార్లు డ్రాగన్‌కు ఇదే విషయం స్పష్టం చేసినా సంప్రదింపుల పేరుతో చైనా సరికొత్త ప్రయత్నాలతో ముందుకొస్తూనే ఉంది. సరిహద్దు వివాదం ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చైనా గ్రహించేలా తాము చర్యలు చేపడుతున్నామని ప్రతిష్టంభనపై ప్రభుత్వంతో చర్చిస్తున్న అధికారి ఒకరు వెల్లడించారని ఓ జాతీయ వెబ్సైట్ పేర్కొంది. చైనా దూకుడుకు బ్రేక్ వేసేందుకు భారత్ ఇప్పటికే 100కు పైగా చైనా యాప్‌లను నిషేధించగా, ప్రభుత్వ కాంట్రాక్టులు బీజింగ్‌కు దక్కకుండా నిబంధనలను మార్చింది. ఇక భారత యూనివర్సిటీలతో భాగస్వామ్యంతో ముందుకొచ్చిన చైనా వర్సిటీలు నిబంధనలను పాటిస్తున్నాయా అనే అంశంపై తాజాగా ప్రభుత్వం దృష్టిసారించింది. అయితే చైనాపై భారత్ పలు రకాలుగా ఒత్తిడి పెంచుతున్నా డ్రాగన్ దారికి రాకపోగా సరికొత్త ఎత్తుగడలతో ముందుకొస్తోంది. ఇండో-చైనా ప్రతిష్టంభన సమసిపోయిందని, లడఖ్‌లో సేనల ఉపసంహరణ పూర్తయిందని ప్రపంచాన్ని నమ్మబలుకుతోంది. అయితే డ్రాగన్ తీరు మార్చుకుని సరిహద్దుల్లో చేపట్టిన సానుకూల చర్యలపై మాట్లాడాలని భారత్ కోరుతోంది. చైనా ఇప్పటికీ పెట్రోలింగ్ పాయింట్ 17, 17 ఏ (గోగ్రా)ల వద్ద, ప్యాంగాంగ్ సరస్సు వద్ద తన సేనలను మోహరించిందని భారత సైన్యం ప్రభుత్వానికి క్షేత్రస్ధాయి పరిస్ధితులను నివేదించింది. మరోవైపు ఇండో- చైనా సరిహద్దుల్లో చైనా దుశ్చర్య కారణంగా చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే జాతీయ భద్రతకు ముప్పు అంటూ ప్రభుత్వం టిక్ టాక్ సహా వివిధ యాప్ లపై నిషేధించింది. చైనాకు మరో దెబ్బ : 2500 ఛానళ్లు తొలగింపు కరోనా మహమ్మారికి సంబంధించి సరైన సమాచారం అందించలేదంటూ ప్రపంచ వ్యాప్తంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాకు వరుస ఎదురు దెబ్బలు తప్పడం లేదు. తాజాగా అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ కూడా చైనాపై కొరడా ఝళిపిస్తోంది. తమ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌పై తప్పుడు సమాచారాన్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా చైనాతో ముడిపడి ఉన్న 2,500 కి పైగా యూట్యూబ్ ఛానల్స్ ను తొలగించినట్టు ప్రకటించింది. త్రైమాసిక బులెటిన్ వెల్లడి సందర్భంగా గూగుల్ ఈ విషయాన్ని వివరించింది. స్పామ్, వివాదాస్పద కంటెంట్ ను ఆయా ఛానల్స్ యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్-జూన్ మాసంలో వీటిని తొలగించినట్టు వెల్లడించింది. అయితే తప్పుడు సమాచారం వ్యాప్తి ఆరోపణలను చైనా గతంలో తీవ్రంగా ఖండించింది. గూగుల్ తాజా చర్యపై అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ఇంకా స్పందించలేదు. తాజాగా చైనాకు ట్రంప్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. టిక్ టాక్, వీ చాట్ ద్వారా తమ పౌరుల విలువైన సమాచారాన్ని ఆయా కంపెనీలు చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి అందజేస్తున్నాయని ఆరోపించిన అధ్యక్షుడు ట్రంప్ వాటిని నిషేధించే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. 45 రోజుల్లోగా ఈ నిషేధం అమల్లోకి రానుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరో కీలకమైన పదవిలో భారతీయ-అమెరికన్
11-05-2022

మార్క్సిజంపై నమ్మకాన్ని పెంపొందించండి
10-05-2022

ఉక్రెయిన్‌లో పర్యటించిన అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్
10-05-2022

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జాకెట్కి వేలంలో 90వేల డాలర్లు
10-05-2022

పాత నిబంధనను తెరపైకి తెచ్చిన సెర్బియా ..!
09-05-2022

దక్షిణ కొరియాలో పెరుగుతున్న కొత్త COVID-19 కేసులు
08-05-2022

రెండోసారి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రాన్ ప్రమాణ స్వీకారం
08-05-2022

OPEC క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర పెరిగింది ..!
06-05-2022

‘పద్మ’అవార్డుల కోసం ఆన్లైన్ నామినేషన్లకి ఆహ్వానం
06-05-2022

రక్షణ సహకారంపై దక్షిణ కొరియా, నార్వే ..!
02-05-2022
ఇంకా