newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రయిక్.. చైనాపై డిజిటల్ స్ట్రయిక్

30-06-202030-06-2020 12:02:03 IST
Updated On 30-06-2020 12:52:19 ISTUpdated On 30-06-20202020-06-30T06:32:03.204Z30-06-2020 2020-06-30T06:31:51.480Z - 2020-06-30T07:22:19.136Z - 30-06-2020

పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రయిక్..  చైనాపై డిజిటల్ స్ట్రయిక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నోటితో పొగిడి నొసటితో వెక్కిరించడం చైనాకు బాగా అలవాటు. ఎట్టకేలకు డ్రాగన్ కుట్రలను మోడీ సర్కారు పసిగట్టింది. సమర్థవంతంగా తిప్పికొట్టింది. చైనా కంపెనీలతో సంబంధం ఉన్న 59 యాప్‌లను మోదీ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ ఈ మేరకు ఆయా యాప్‌లను నిషేధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దేశ భద్రత, ప్రజల డేటాకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ప్రజలు దీన్ని మోదీ ”డిజిటల్‌ స్ట్రైక్‌”గా చెప్పుకుంటున్నారు. 

అప్పట్లో పాకిస్థాన్‌ ఉగ్రవాదులు పుల్వామాలో భారత జవాన్లపై జరిపిన దాడికి మోదీ సర్కారు సర్జికల్‌ దాడులు జరిపి ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఇప్పుడు చైనాపై మోదీ ప్రభుత్వం డిజిటల్‌ స్ట్రైక్‌ చేసిందని జనాలు అంటున్నారు. దీని వల్ల చైనా కుట్ర భగ్నమైందని నిపుణులు అంటున్నారు. అవును.. నిజమే.. ఇప్పుడే కాదు.. చైనా గతంలో ఎప్పటి నుంచో డిజిటల్‌ మార్గంలో ప్రపంచ దేశాలపై పట్టు సాధించాలని కుట్ర పన్నింది. 

అందులో భాగంగానే తమ దేశానికి చెందిన హువావే వంటి కంపెనీలతో కుమ్మక్కై అవి తయారు చేసే హార్డ్‌వేర్‌ ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు విక్రయించేలా ప్లాన్‌ వేసింది. చాలా సంవత్సరాల పాటు ప్రపంచ దేశాలకు హువావే సహా పలు ఇతర చైనా కంపెనీలు కంప్యూటర్‌, స్మార్ట్‌ఫోన్‌ హార్డ్‌వేర్‌, నెట్‌వర్కింగ్‌ ఉత్పత్తులను విక్రయిస్తూ వచ్చాయి. అయితే హువావేపై అమెరికా ఆంక్షలు విధించి ఆ కంపెనీ ఉత్పత్తులను తమ దేశంలో విక్రయించకుండా నిషేధం విధించింది. దీంతో ఆ కంపెనీ కన్ను సహజంగానే భారత్‌పై పడింది.

ఇక భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌ అప్‌గ్రేడ్‌కు కావల్సిన హార్డ్‌వేర్‌ను తయారు చేసి ఇవ్వాల్సిందిగా ఇక్కడి కంపెనీలు హువావేతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ తాజాగా చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సహా పలు కంపెనీలు హువావేతో ఉన్న కాంట్రాక్టులను రద్దు చేసుకున్నాయి. 

అయితే ఇప్పుడు మోదీ తాజాగా చైనాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీలపై కూడా దెబ్బ కొట్టారు. ఆ కంపెనీలు డెవలప్‌ చేసిన 59 యాప్‌లను నిషేధం విధించింది. భారత్‌పై డిజిటల్‌ మార్గంలో పట్టు బిగించాలనుకున్న చైనా ప్లాన్‌ ఫెయిలైంది. చైనా దీన్ని ”డిజిటల్‌ సిల్క్‌ రూట్‌”గా భావిస్తోంది. అయితే చైనా యాప్స్‌ను నిషేధించడంతో ఆ యాప్స్‌ భారత్‌ నుంచి పెద్ద ఎత్తున వచ్చే ఆదాయాన్ని, ఇక్కడి యూజర్ల బేస్‌ను కోల్పోనున్నాయి. ఇది ఆ యాప్‌ డెవలపర్‌ కంపెనీలకే కాదు.. చైనాకూ దెబ్బే..

నిజానికి చైనా యాప్స్‌ పైకి కనిపించేంత మంచి యాప్స్‌ కావని.. అవి యూజర్ల ఫోన్లలో వారికి తెలియకుండానే డేటాను చోరీ చేసి భారత్‌ బయట ఉన్న సర్వర్లలో ఆ డేటాను స్టోర్‌ చేస్తున్నాయని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. కానీ వాటిని ఆ యాప్‌ డెవలపర్‌ కంపెనీలు ఖండిస్తూ వచ్చాయి. 

ఇక ఇటీవలే షియోమీకి చెందిన యూసీ బ్రౌజర్‌ ఇన్‌కగ్నిటో మోడ్‌లో ఉన్నా కూడా యూజర్ల డేటాను చోరీ చేస్తుందని గుర్తించారు.  ఈ క్రమంలో ఆ కంపెనీ ఆ యాప్‌కు కొత్త అప్‌డేట్‌ను అందించి యాప్‌ను మళ్లీ విడుదల చేసింది. ఇక టిక్‌టాక్‌ యాప్‌ తాజాగా ఐఫోన్లలో యూజర్ల డేటాను వారికి తెలియకుండానే చోరీ చేస్తుందని గుర్తించారు. కానీ దీనిపై టిక్‌టాక్‌ డెవలపర్లు ఇంకా స్పందించలేదు. అయితే ఇంతలోనే ఆ యాప్‌తో కలిపి మొత్తం 59 యాప్‌లపై నిషేధం విధించడంతో.. ఇక ఇప్పుడు ఆ యాప్‌ డెవలపర్లకు ఒక్కసారిగా దిమ్మ తిరిగింది. 

అయితే చైనా డిజిటల్‌ సిల్క్‌ రూట్‌కు భారత్‌ బ్రేకులు వేయడంతో.. ప్రపంచ దేశాలు కూడా భారత్‌ బాటలోనే నడుస్తాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇతర దేశాలు కూడా ఈ యాప్స్‌ను తమ తమ ప్రాంతాల్లో నిషేధించవచ్చని సమాచారం. అసలు కరోనాతో చైనాపై పీకలదాకా కోపంతో ఊగిపోతున్న ఆయా దేశాలు ఈ రూపేణా చైనాపై ప్రతీకారం తీర్చుకుంటానికి తహతహలాడుతున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలో రానున్న రోజుల్లో చైనాకు, అది అపురూపంగా భావిస్తున్న డిజిటల్‌ సిల్క్‌ రూట్‌కు గట్టి దెబ్బ ఎదురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. అదే నిజమైతే ప్రపంచ దేశాలపై డిజిటల్‌ మార్గంలో ఆధిపత్యం చెలాయిద్దామనుకున్న, ప్రపంచ దేశాల ప్రజలపై నిఘా పెడదామనుకున్న చైనా కుట్ర పూర్తిగా భగ్నమవుతుంది.

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   8 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   11 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   02-08-2020


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle