newssting
BITING NEWS :
*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన* Ap గవర్నర్‌ను కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం, కార్మికుల సమస్యలపై చర్చ*ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై సీఎం జగన్‌ వ్యాఖ్యలు ఖండిస్తున్నా..కన్నా లక్ష్మీనారాయణ *శివసేన గడువును తిరస్కరించిన గవర్నర్‌...మూడో పెద్దపార్టీగా ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానం*కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని కలిసిన ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి *ఏపీ కొత్త సీఎస్ గా నీలం సహాని...కేంద్రం నుంచి నీలం సహాని రిలీవ్*మహారాష్ట్ర: నేడు ఎమ్మెల్యేలతో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ భేటీ.. శివసేనకు మద్దతిచ్చే అంశంపై చర్చ*తెలంగాణలో 39వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు గవర్నర్‌ను కలవనున్న జేఏసీ నేతలు*గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం..జనం మీదకు దూసుకెళ్లిన లారీ... ముగ్గురి మృతి..ఐదుగురికి గాయాలు

న‌వీన్ ప‌ట్నాయ‌క్ నయా టెన్షన్

22-04-201922-04-2019 08:02:45 IST
2019-04-22T02:32:45.490Z22-04-2019 2019-04-22T02:32:42.878Z - - 12-11-2019

న‌వీన్ ప‌ట్నాయ‌క్ నయా టెన్షన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గ‌త 19 ఏళ్లుగా ఒడిశాను పాలిస్తున్న బిజూ జ‌న‌తాద‌ళ్ అధినేత న‌వీన్ ప‌ట్నాయ‌క్ ఈ ఎన్నిక‌లలో టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. గ‌త ఎన్నిక‌ల్లో 147 సీట్లున్న ఒడిశా అసెంబ్లీలో 116 స్థానాల‌ను బీజేడీ గెల్చుకుంది. అలాగే 16 సీట్ల‌లో కాంగ్రెస్, 10 సీట్ల‌లో బీజేపీ, 1 సీటు సీపీఎం, 3 సీట్లు ఇత‌రులు గెల్చుకున్నారు. అంతేకాదు, 21 పార్ల‌మెంటు సీట్ల‌లో బీజేడీ 20 సీట్లు గెల్చుకుంటే, 1 సీటులో బీజేపీ గెలిచింది. 18 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు. 

ఈసారి అసెంబ్లీకి, పార్ల‌మెంటు స్థానాల‌కు ఒకేసారి ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. న‌వీన్ అధికారంలోకి రాక‌ముందు ఒడిశా అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌నీ, ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాతే అభివృద్ధి మొద‌లైంద‌నేది చాలా మంది ఒడిశా ప్ర‌జ‌ల వాదన‌. అయితే గ‌త మూడేళ్లుగా ధ‌ర‌లు పెర‌గ‌డం జ‌నానికి ఇబ్బందిగా మారిన‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే జిల్లాల్లోని బీజేడీ కార్యాల‌యాల‌తో పాటు న‌వీన్ ప‌ట్నాయ‌క్ ఇంట్లో కూడా కార్య‌క‌ర్త‌ల సంద‌డి త‌గ్గింద‌ట‌. దీంతో త‌మ పార్టీ ఓట్ బ్యాంకును కాపాడుకుకోవడానికి న‌వీన్ ప‌ట్నాయ‌క్ క‌ష్ట‌ప‌డుతున్న‌ట్లు జ‌నం భావిస్తున్నారు. 19 ఏళ్ల సుదీర్ఘ పాల‌న‌లో జనానికి ఏం చేశార‌న్న ప్ర‌శ్న‌కు బిజూ జ‌న‌తాద‌ళ్ నేత‌ల నుంచి స‌మాధానం దొర‌క‌డం లేద‌ని చాలా మంది చెబుతున్న మాట‌. 

ముఖ్యంగా విద్య‌, వైద్యం, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో న‌వీన్ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింద‌ని జ‌నం అనుకుంటున్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. అంతేకాదు, ఏటా ఒక పంట‌కే నీళ్లు అందుతున్నాయ‌నీ రైతులు చెబుతున్నారు. కేవ‌లం కాంగ్రెస్ పార్టీని అధికారం అప్ప‌గించ‌డానికి ఇష్టం లేక‌నే, బీజేడీకి ఓట్లు వేస్తున్న‌ట్లు చాలా మంది అనుకుంటున్నారు. 

మొన్న‌టి దాకా బీజేపీ కూడా అంత‌గా ప‌ట్టు సాధించ‌లేక పోయింది. అయితే అమిత్ షా వ్యూహంతో కొంంత మంది బీజేడీ కీల‌క నేత‌ల‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి ఒడిశాలో పెద్ద దిక్కుగా భావించే వారు బీజేపీలో చేరారు. దీంతో న‌వీన్ ప‌ట్నాయ‌క్ మీద వ్య‌తిరేక‌త ఏ మేర‌కు ఉందో అర్థం అవుతోంది. ఇదే స‌మ‌యంలో రోడ్డు మార్గాన వెయ్యి కిలో మీట‌ర్లు  ప్ర‌యాణించిన న‌వీన్ ప‌ట్నాయ‌క్, మొత్తం 147 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో రోడ్ షోలు, బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించారు. పార్టీ ప్ర‌ముఖుల‌తో కూడా ఈసారి చాలా క‌ష్టపడాలంటూ న‌వీన్ ప‌ట్నాయ‌క్ హెచ్చ‌రిక‌లు చేస్తున్న‌ట్లు ఒడిశా మీడియా చెబుతోంది. అంటే ఈ ఎన్నిక‌లు ఆయ‌న‌కు స‌వాల్ విసురుతున్న‌ట్లు అర్థం అవుతోంది. 

ముఖ్యంగా బీజేపీ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న న‌వీన్ ప‌ట్నాయ‌క్, ఈ ఎన్నిక‌ల్లో 2014 ఫ‌లితాల‌ను ఆశించ‌డం లేద‌నీ, ప్ర‌భుత్వం ఏర్పాటుకు స‌రిపోయే మ్యాజిక్ ఫిగ‌ర్ వ‌స్తే చాల‌న్న‌ట్లుగా ఆయ‌న ధోర‌ణి ఉంద‌ని బీజేడీకి చెందిన ఓ కీల‌క నేత ఆఫ్ ది రికార్డులో చెప్పిన‌ట్లు కూడా ఒడిశా మీడియా క‌థ‌నాలు ప్ర‌చురించింది. మొత్తానికి ఈ ఎన్నిక‌లు ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్, బీజేపీ మ‌ధ్య నువ్వా నేనా అన్న‌ట్లు జ‌రుగుతున్నాయ‌ని అర్థం అవుతోంది.

రామాలయ నిర్మాణ బాధ్యత ఏ ట్రస్టుది? కొత్త గొడవలు ప్రారంభం

రామాలయ నిర్మాణ బాధ్యత ఏ ట్రస్టుది? కొత్త గొడవలు ప్రారంభం

   an hour ago


మహారాష్ట్రలో ఉత్కంఠకు తెర...శివసేన ఆశలు గల్లంతేనా?

మహారాష్ట్రలో ఉత్కంఠకు తెర...శివసేన ఆశలు గల్లంతేనా?

   3 hours ago


పిల్లల లైంగిక వేధింపులలో ట్విట్టర్‌దే ప్రధాన పాత్ర: ఐడబ్ల్యూఎఫ్ నివేదిక

పిల్లల లైంగిక వేధింపులలో ట్విట్టర్‌దే ప్రధాన పాత్ర: ఐడబ్ల్యూఎఫ్ నివేదిక

   8 hours ago


రామమందిరం ట్రస్ట్ షురూ.. హోంశాఖ ఏర్పాట్లు

రామమందిరం ట్రస్ట్ షురూ.. హోంశాఖ ఏర్పాట్లు

   9 hours ago


పేదలకు అన్యాయం చేయొద్దు..  పోలీసులకు సీఎం హితవు

పేదలకు అన్యాయం చేయొద్దు.. పోలీసులకు సీఎం హితవు

   9 hours ago


బుల్ బుల్ దెబ్బకు వణికిన బెంగాల్.. ఏడుగురు బలి

బుల్ బుల్ దెబ్బకు వణికిన బెంగాల్.. ఏడుగురు బలి

   11-11-2019


అమెరికన్ ఎన్నారైలకు పెద్ద ఊరట.. హెచ్4 వీసాదారులు పనిచేసుకోవచ్చు

అమెరికన్ ఎన్నారైలకు పెద్ద ఊరట.. హెచ్4 వీసాదారులు పనిచేసుకోవచ్చు

   11-11-2019


సోషల్ మీడియాపై సెన్సార్‌షిప్‌తో ఇంటర్నెట్‌‌ అంతం ఖాయం

సోషల్ మీడియాపై సెన్సార్‌షిప్‌తో ఇంటర్నెట్‌‌ అంతం ఖాయం

   11-11-2019


అయోధ్యపై ఓవైసీ కీలక వ్యాఖ్యలు..అలా అయితే అద్వానీపై విచారణ ఎందుకు?

అయోధ్యపై ఓవైసీ కీలక వ్యాఖ్యలు..అలా అయితే అద్వానీపై విచారణ ఎందుకు?

   11-11-2019


క్లైమాక్స్ లో మహా పాలిటిక్స్ ..హోటల్లో శివసేన ఎమ్మెల్యేలు

క్లైమాక్స్ లో మహా పాలిటిక్స్ ..హోటల్లో శివసేన ఎమ్మెల్యేలు

   10-11-2019


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle