newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

నిర్మలా సీతారామన్ బడ్జెట్ హైలైట్స్

05-07-201905-07-2019 13:24:05 IST
Updated On 06-07-2019 15:33:04 ISTUpdated On 06-07-20192019-07-05T07:54:05.755Z05-07-2019 2019-07-05T07:54:04.022Z - 2019-07-06T10:03:04.836Z - 06-07-2019

నిర్మలా సీతారామన్ బడ్జెట్ హైలైట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక  పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. తొలి ఆర్థిక మంత్రిగా ఆమె ఏం వరాలు కురిపిస్తారోని  సర్వత్రా బడ్జెట్‌ మీద ఆసక్తి నెలకొంది. పార్లమెంటులో శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర‍్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 

* వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు లేవు

*డీజిల్‌, పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూ.1 పెంపు.

*బ్యాంకు ఖాతా నుంచి ఏడాదికి రూ.కోటి నగదు ఉపసంహరణ పరిమితి. రూ.కోటి దాటితే 2శాతం టీడీఎస్‌

* మహిళల నాయకత్వానికి ప్రోత్సాహం కల్పిస్తాం 

*ముద్ర పథకం కింద స్వయం సహాయక సంఘాలకు రూ. లక్ష రుణం..జన్‌ధన్‌ ఖాతా ఉన్న మహిళలకు రూ. 5వేలు ఓవర్‌ డ్రాఫ్ట్‌ తీసుకునే సౌకర్యం

*మహిళల ఆర్థిక స్వావలంబన, వారు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ‘నారీ-నారాయణ’ పథకం 

*బ్యాంకింగ్‌ రంగంలో ప్రక్షాళన..నిరర్థక ఆస్తులు రూ. లక్ష కోట్లకు తగ్గుదల ..నాలుగేళ్లలో రూ. 4 లక్షల కోట్ల నిరర్ధక ఆస్తుల రికవరీ 

* పెట్టుబడులు పెంచేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70వేల కోట్లు కేటాయింపు

* నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలకు ప్రాధాన్యం.. ఎన్‌బీఎఫ్‌సీలకు వన్‌ టైం క్రెడిట్‌ గ్యారెంటీ కల్పిస్తాం

* స్టార్ట్‌అప్‌ల కోసం ప్రత్యేక దూరదర్శన్‌ టీవీ చానల్‌

* స్టాండప్‌ ఇండియా పథకం కింద బలహీన వర్గాల యువతకు శిక్షణ ఇస్తాం

* భారతీయ పాస్‌పోర్టు ఉన్న ఎన్నారైలందరికీ ఆధార్‌ కార్డుల కేటాయింపు..ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే ఎన్నారైలకు ఆధార్ కార్డులు

*కొత్తగా 18 దేశాల్లో భారతీయ ఎంబసీల ఏర్పాటు

* మౌలిక రంగం అభివృద్ధికి ఐడియాస్‌ స్కీం తీసుకొస్తాం

* ఆదివాసీ, గిరిజనుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను డిజిటల్‌రూపంలో భద్రపరుస్తాం

* ఉజ్వలా ఇండియా పథకం కింద 35 కోట్ల ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ.. ఎల్‌ఈడీ బల్బులతో రూ. 18,341 కోట్లు మిగులు

*ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పిస్తాం

* రిజర్వ్‌ బ్యాంక్‌ పరిధిలోకి హౌసింగ్‌ ఫైనాన్స్‌ సెక్టార్‌

* ప్రపంచంలోనే భారత్‌ సరికొత్త అంతరిక్ష శక్తిగా అవతరిస్తోంది

* ఇస్రో సేవలను వాణిజ్యపరంగానూ వృద్ధి చేసేందుకు ప్రత్యేక కంపెనీ ఏర్పాటు ..స్టాక్‌ మార్కెట్‌లో ఎన్నారైలూ పెట్టుబడులు పెట్టేందుకు వెసులుబాటు

*స్టడీ ఇన్‌ ఇండియా పథకంలో భాగంగా విదేశీ విద్యార్థులు ఇక్కడ చదివే అవకాశం

* ఏడాదిలోగా ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటు

* శాస్త్ర సాంకేతిక రంగంలో జాతీయ పరిశోధన సంస్థ ఏర్పాటు

* ఖేలో ఇండియా ద్వారా దేశవ్యాప్తంగా క్రీడలకు ప్రోత్సాహం

* దేశవ్యాప్తంగా మెట్రో రైలు సర్వీసులను మరో 300 కిలోమీటర్ల మేర పెంచుతాం

* విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునేవారికి ప్రత్యేక శిక్షణ

* వేర్వేరు కార్మిక చట్టాలను వృవస్థీకృతం చేసి.. నాలుగు కోడ్‌లుగా రూపొందిస్తాం

* కార్మిక చట్టాల సరళీకరణ.. కార్మిక సంక్షేమం కోసం నాలుగు లేబర్‌ కోడ్‌లు

* నాలుగు కోడ్‌ల కిందకు అన్ని కార్మిక చట్టాలు తీసుకొస్తాం

* దేశవ్యాప్తంగా 256 జిల్లాలలో జలశక్తి అభియాన్‌ పథకం అమలు చేస్తాం

* 2020లో ప్రతి పల్లెలో ప్రతి ఇంటికి తారునీరు అందిస్తాం

* రైతుల ఆదాయం రెండింతలు చేసే విధానాలు అమలుచేస్తాం

* పెట్టుబడి లేకుండా వ్యవసాయ పథకం.. ఈ పథకం కింద రైతులకు శిక్షణ ఇస్తాం

* మూడేళ్లలో విద్యుత్‌, ఎల్పీజీ గ్యాస్‌ సౌకర్యం లేని ఇల్లు ఉండదు

* పేదలకు ఇల్లు నిర్మించే గడువును 114 రోజులకు తగ్గింపు

*అన్ని ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణానికి ఒకే కార్డు..ఒకే కార్డుతో బస్సు, రైలు, విమానం, మెట్రోల్లో ప్రయాణం చేసే సౌలభ్యం

*పేద, మధ్యరగతి వర్గాలకు తక్కువ ధరకు గృహ సదుపాయం కల్పిస్తాం

*దేశవ్యాప్తంగా మూడు కోట్లమంది చిన్న వ్యాపారులకు పెన్షన్‌ సౌకర్యం 

*ఎలక్ట్రిక్‌ బైక్‌లు, కార్లు, వాహనాలు కొనేవారికి రాయితీలు కల్పిస్తాం

 

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!

   2 hours ago


భ‌ర్త‌కు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు త‌ల్లి

భ‌ర్త‌కు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు త‌ల్లి

   9 hours ago


వైట్ హౌజ్ కాదు.. వాషింగ్ట‌న్ నే వ‌దిలేస్తారట

వైట్ హౌజ్ కాదు.. వాషింగ్ట‌న్ నే వ‌దిలేస్తారట

   7 hours ago


ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్

ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్

   10 hours ago


భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..

భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..

   11 hours ago


ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు

ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు

   11 hours ago


తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య

తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య

   13 hours ago


భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..

భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..

   13 hours ago


కాసేప‌ట్లో క‌రోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్ర‌పంచంలో మ‌న‌మే టాప్

కాసేప‌ట్లో క‌రోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్ర‌పంచంలో మ‌న‌మే టాప్

   13 hours ago


ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..

ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..

   15-01-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle