newssting
BITING NEWS :
* అమరావతి: వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అమరావతి: నేడు శాసనమండలిలో అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం*విజయవాడ: నేడు బీజేపీ-జనసేన నేతల సమావేశం.. రాజధాని మార్పుపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న పార్టీలు*నేడు ఆందోళనలకు పిలుపునిచ్చిన అమరావతి పరిరక్షణ సమితి.. మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనలు*జగన్ చిన్నవాడైనా చేతులు జోడించి నమస్కరిస్తున్నా..మూడు రాజధానుల నిర్ణయం సరికాదు..తరలింపు మీద జగన్ మరోమారు ఆలోచించాలి : చంద్రబాబు*బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డా.. అభినందించిన హోంమంత్రి అమిత్ షా... బీజేపీ నేతలు

నరేంద్ర మోడీ నెక్స్ట్ టార్గెట్ అదేనా..?

17-08-201917-08-2019 08:34:22 IST
Updated On 20-08-2019 12:48:56 ISTUpdated On 20-08-20192019-08-17T03:04:22.859Z17-08-2019 2019-08-17T03:04:16.082Z - 2019-08-20T07:18:56.730Z - 20-08-2019

నరేంద్ర మోడీ నెక్స్ట్ టార్గెట్ అదేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌కోట‌పై నుంచి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇచ్చిన ప్ర‌సంగం ప‌లు కొత్త చ‌ర్చ‌ల‌కు దారితీస్తోంది. గ‌తం కంటే ఎక్కువ సీట్ల‌తో రెండోసారి అధికారం చేప‌ట్టాక ప్ర‌ధాని ప‌లు కీల‌క అంశాలపై దృష్టి పెట్టారు. ఎన్నో ఏళ్లుగా ప‌రిష్కారం దొర‌క‌ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే జ‌మ్ము క‌శ్మీర్ విభ‌జ‌న‌, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేశారు.

ఆ త‌ర్వాత బీజేపీ ప్ర‌భుత్వం ల‌క్ష్యాలు ఇవే అంటూ అనేక అంశాలు వినిపించాయి. పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటార‌ని, ఆయోధ్య‌లో రామ మందిరం నిర్మిస్తార‌ని ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ప్ర‌ధాని మోడీ మాత్రం దేశ జ‌నాభా గురించి ఎర్ర‌కోట‌పై మాట్లాడ‌టం ఆస‌క్తి క‌లిగిస్తోంది. దేశంలో పెరుగుతున్న జ‌నాభా స‌మ‌స్య‌ను గుర్తించిన ఆయ‌న జ‌నాభాను నియంత్రించ‌డం కూడా దేశ‌భ‌క్తే అని పిలుపునిచ్చారు.

దీంతో ప్ర‌ధాని మోడీ నెక్ట్స్ టార్గెట్ ఇదే అయి ఉంటుంద‌నే వాద‌న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. పెరుగుతున్న జ‌నాభా దేశానికి అతిపెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది. ప్ర‌పంచంలో కూడా అనేక దేశాలు ఈ స‌మ‌స్య‌పై మాట్లాడుతున్నాయి. 2017లో ఐక్య రాజ్య స‌మ‌తి వేసిన అంచ‌నాల ప్ర‌కారం 2024 నాటికి భార‌త్ జ‌నాభా చైనాను మించే అవ‌కాశం ఉంది. 2030 నాటికి మ‌న జ‌నాభా 150 కోట్ల‌కు చేరుతుందని స‌ద‌రు ఐరాస అంచ‌నా వేసింది.

పెరుగుతున్న దేశ జ‌నాభా స‌మ‌స్య‌పై వివిధ ప్ర‌భుత్వాలు 40 - 50 ఏళ్లుగా మాట్లాడుతూనే ఉన్నాయి. ఈ స‌మ‌స్య‌పై ఇప్ప‌టి వ‌ర‌కు పార్ల‌మెంటు 35 మంది స‌భ్యులు ప్రైవేటు బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఇందిరా గాంధీ హ‌యాంలో ఎమ‌ర్జ‌న్సీ స‌మ‌యంంలో 1975 నుంచి 77 వ‌ర‌కు జ‌నాభా నియంత్ర‌ణ‌కు బ‌ల‌వంత‌పు ప్ర‌య‌త్నాలు కూడా జ‌రిగాయి. త‌ర్వాత దీనిపై పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త వ‌చ్చింది.

త‌ర్వాత వ‌చ్చిన ప్ర‌భుత్వాలు సైతం జ‌నాభాను నియంత్రించేందుకు ప్ర‌య‌త్నించినా పెద్ద‌గా స‌ఫ‌లం కాలేదు. మోడీ మొద‌టిసారి అధికారంలోకి వ‌చ్చాక కూడా ఎక్కువ జ‌నాభా పెరుగుద‌ల ఉన్న 146 జిల్లాల‌ను దేశ‌వ్యాప్తంగా గుర్తించి జ‌నాభాను నియంత్రించేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే, ఇది చాలా పెద్ద స‌మ‌స్య‌గా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గుర్తించి జ‌నాభా నియంత్ర‌ణ‌పై ఈసారి మ‌రింత కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే, స్వ‌చ్ఛ భార‌త్ త‌ర‌హాలో ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించే దిశ‌గా మోడీ ప్ర‌య‌త్నాలు ఉంటాయా లేదా జ‌నాభాను నియంత్రించేలా కీల‌క నిర్ణ‌యాల‌ను ప్ర‌భుత్వ ప‌రంగా అమ‌లు చేస్తారా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వానికి ఉన్న బ‌లంతో ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకున్నా అమ‌లు చేసే బ‌లం ఉంది. కానీ, న‌రేంద్ర మోడీ ఈ అంశంపై మాట్లాడ‌టంపై కూడా విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.

జ‌నాభాను ఎలా ఉప‌యోగించుకోవాల‌నే ప్ర‌ధానికి తెలియ‌ద‌ని ఎంఐఎం అధినేత అస‌దుద్దిన్ ఓవైసీ విమ‌ర్శించారు. ఎంత‌టి కీల‌కమైన‌, క‌ఠిన‌మైనా నిర్ణ‌యాలైనా వెన‌క‌డుగు వేయ‌కుండా తీసుకోగ‌లిగే ప్ర‌ధాని మోడీ జ‌నాభా నియంత్ర‌ణ‌పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.

 

కేంద్రం చొరవ.. కృష్ణా, గోదావరి సమస్యలపై ఫోకస్

కేంద్రం చొరవ.. కృష్ణా, గోదావరి సమస్యలపై ఫోకస్

   an hour ago


సూరత్ టెక్స్ టైల్స్ భవనంలో భారీ అగ్నిప్రమాదం

సూరత్ టెక్స్ టైల్స్ భవనంలో భారీ అగ్నిప్రమాదం

   an hour ago


పవన్ కుమార్ గుప్తాకు చుక్కెదురు.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

పవన్ కుమార్ గుప్తాకు చుక్కెదురు.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

   18 hours ago


చైనా వెళుతున్నారా.... ఆ వైరస్‌తో తస్మాత్ జాగ్రత్త!

చైనా వెళుతున్నారా.... ఆ వైరస్‌తో తస్మాత్ జాగ్రత్త!

   20-01-2020


బ‌డ్జెట్‌కు ముందు హ‌ల్వా వేడుక‌.. ఈ క‌థ మీకు తెలుసా..?

బ‌డ్జెట్‌కు ముందు హ‌ల్వా వేడుక‌.. ఈ క‌థ మీకు తెలుసా..?

   20-01-2020


షిర్డీ ఆలయం మూసివేత లేదు.. సంస్థాన్ ట్రస్ట్ ప్రకటన

షిర్డీ ఆలయం మూసివేత లేదు.. సంస్థాన్ ట్రస్ట్ ప్రకటన

   19-01-2020


రూ.2 వేల నోటుపై సంచలన నిజాలు

రూ.2 వేల నోటుపై సంచలన నిజాలు

   19-01-2020


నిర్భయ నిందితులకు రాష్ట్రపతి షాక్.. క్షమాభిక్ష పిటిషన్ డిస్మిస్

నిర్భయ నిందితులకు రాష్ట్రపతి షాక్.. క్షమాభిక్ష పిటిషన్ డిస్మిస్

   17-01-2020


ఇస్రో కీర్తిపతాక.. జీశాట్-30 ప్రయోగం విజయవంతం

ఇస్రో కీర్తిపతాక.. జీశాట్-30 ప్రయోగం విజయవంతం

   17-01-2020


కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం... ఐదుగురి అరెస్ట్

కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం... ఐదుగురి అరెస్ట్

   17-01-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle