newssting
BITING NEWS :
*కేంద్ర కేబినెట్‌ సమావేశం..లాక్‌డౌన్లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై, చైనాతో సరిహద్దు వివాదం సహా కీలక అంశాలపై చర్చ*ఈనెల ఐదున ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం*తెలంగాణా లో ఇవాళ 199 కేసులు నమోదు.. గ్రేటర్లో పెరుగుతున్న కేసులతో ఆందోళన ..మొత్తం 2698 కేసులు నమోదు*భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 8,392కొత్త కరోనా కేసులు నమోదు, 1,90,535కిచేరిన పాజిటివ్‌ కేసులు, ఒకే రోజు 230 మంది మృతి.. ఇప్పటి వరకు మృతిచెందినవారు 5,394 మంది*అరేబియా సముద్రంలో అల్పపీడనం..అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం...తెలంగాణలో నేడు,రేపు వర్షాలు*ఏపీలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ..రాష్ట్రవ్యాప్తంగా 58.22లక్షల మందికి పెన్షన్‌..రూ.1,421.20 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్‌ *అంతరాష్ట్ర బస్సుల సర్వీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ సర్కార్. ఆర్టీసీ బస్సులు కేవలం సరిహద్దుల వరకే. పొరుగు రాష్ట్రాల బస్సులను కూడా అనుమతించని తెలంగాణ ప్రభుత్వం *ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 76 కరోనా కేసులు.. 3118 కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసులు, ఏపీలో ఇప్పటి వరకు 64 మంది మృతి*ఏపీ: టీడీపీని వీడే ఆలోచన లేదు, కావాలనే కొందరు నాపై తప్పుడు ప్రచారం చేశారు-పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

దేశ ఆరోగ్య సంరక్షణకు మావంతు వాటా రూ. 1500 కోట్లు.. టాటా గ్రూప్ వితరణ

29-03-202029-03-2020 08:41:41 IST
2020-03-29T03:11:41.513Z29-03-2020 2020-03-29T03:11:38.881Z - - 01-06-2020

దేశ ఆరోగ్య సంరక్షణకు మావంతు వాటా రూ. 1500 కోట్లు.. టాటా గ్రూప్ వితరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచమంతటా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి భారత్ లోనూ తన ప్రతాపం చూపుతున్న నేపథ్యంలో కరోనా పోరుకై మొత్తం రూ. 1500 కోట్లను వెచ్చించనున్నట్లు భారతీయ వ్యాపార దిగ్గజం టాటా ట్రస్టు ప్రకటించింది. టాటా ట్రస్ట్‌ చైర్మన్‌ రతన్‌ టాటా ట్విటర్‌లో శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ‘యావత్‌ ప్రపంచం, భారత్‌ కోవిడ్‌-19 తో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. దీన్నుంచి బయటపడాలంటే సత్వర చర్యలు అవసరం. ప్రతీ గంటా ఎంతో విలువైనది. జాతి మొత్తం ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. మన ముందున్న కష్టతరమైన సవాలు ఇది. టాటా ట్రస్ట్‌ జాతి రక్షణకు ప్రతిజ్ఞ చేస్తోంది. వైరస్‌ పోరులో అనునిత్యం శ్రమిస్తున్న వారికి, బాధితులకు సాయం కోసం రూ.500 కోట్లు కేటాయించాలని నిర్ణయించాం’ అని రతన్‌ టాటా పేర్కొన్నారు.  మొదటగా రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు టాటా ట్రస్టు వెల్లడించింది. అనంతరం రూ.1,000 కోట్ల విరాళాన్ని ‘టాటా సన్స్‌’ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ప్రకటించారు. దీంతో టాటా గ్రూప్‌ మొత్తం రూ.1,500 కోట్ల విరాళం ప్రకటించినట్లయ్యింది.

వైరస్‌ బాధితులకు సేవలందించే వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామాగ్రి, బాధితులకు వైద్య పరికరాలు, వైరస్‌ పరీక్షలకు టెస్టింగ్‌ కిట్లు, ప్రజలకు వైరస్‌పై అవగాహన కార్యక్రమాలకు ఈ మొత్తం  ఖర్చు చేయనున్నట్టు రతన్ టాటా వెల్లడించారు. వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు టాటా ట్రస్ట్‌, టాటా సన్స్‌, టాటా గ్రూప్‌ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా కలిసి పనిచేస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టి మహమ్మారితో పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ బారినపడి 28 వేల మంది ప్రాణాలు కోల్పోగా.. 6 లక్షలకు పైగా బాధితులుగా మారారు.

కరోనా వైరస్‌ పీడితులకు అవసరమైన వెంటిలేటర్లను సాధ్యమైనంత త్వరగా అందజేస్తామని చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. వాటిని తయారు చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. దేశంలో.. ప్రపంచంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేగవంతమైన నివారణ చర్యలు అవసరమన్నారు. కరోనా నివారణకు టాటా ట్రస్టుతో కలిసి పని చేస్తామన్నారు. కరోనాను అరికట్టే విషయంలో తక్షణమే స్పందించాల్సిన సమయం వచ్చిందని టాటా ట్రస్టు చైర్మన్‌ రతన్‌ టాటా వ్యాఖ్యానించారు. మానవ జాతి ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్లలో కరోనా కూడా ఒకటని తెలిపారు.   

కరోనా నివారణతోపాటు సహాయక కార్యకలాపాలకు రూ.500 కోట్ల విరాళాన్ని టాటా ట్రస్టు ప్రకటించింది. తాము ఇవ్వనున్న రూ.1,000 కోట్లతో డాక్టర్లు, వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు, కరోనా టెస్టింగ్‌ కిట్లు అందజేయనున్నట్లు టాటా సన్స్‌ తెలిపింది. 

అలాగే కరోనాపై పోరాటంలో ప్రభుత్వానికి సహకరించేందుకు సన్‌ ఫార్మా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ముందుకు వచ్చింది. కరోనా వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు రూ.25 కోట్ల విలువైన హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్‌ తదితర మందులు, శానిటైజర్లను సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది.  

అమెరికాలో ఆగని అల్లర్లు.. 12 నగరాల్లో కర్ఫ్యూ.. వైరస్ విజృంభణ

అమెరికాలో ఆగని అల్లర్లు.. 12 నగరాల్లో కర్ఫ్యూ.. వైరస్ విజృంభణ

   3 hours ago


చైనా ఉత్పత్తులు బహిష్కరించండి.. భారత్‌లో ఆన్‌లైన్‌ యుద్ధం ప్రారంభం

చైనా ఉత్పత్తులు బహిష్కరించండి.. భారత్‌లో ఆన్‌లైన్‌ యుద్ధం ప్రారంభం

   10 hours ago


కరోనా కేసుల్లో భారత్‌కి 7వ స్థానం.. ఒక్కరోజులో 8,380 కేసుల నమోదు

కరోనా కేసుల్లో భారత్‌కి 7వ స్థానం.. ఒక్కరోజులో 8,380 కేసుల నమోదు

   10 hours ago


లాక్ డౌన్ నియంత్రణ ఇక చాలు.. కరోనాకు భయపడం అంటున్న అమెరికన్లు

లాక్ డౌన్ నియంత్రణ ఇక చాలు.. కరోనాకు భయపడం అంటున్న అమెరికన్లు

   31-05-2020


భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగే రోజు సాకారం.. దేశ ప్రజలకు మోదీ లేఖ

భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగే రోజు సాకారం.. దేశ ప్రజలకు మోదీ లేఖ

   31-05-2020


 లాక్ డౌన్ పై రాష్ట్రాలదే నిర్ణయం ..ఆ నగరాలపైనే  ఫోకస్

లాక్ డౌన్ పై రాష్ట్రాలదే నిర్ణయం ..ఆ నగరాలపైనే ఫోకస్

   30-05-2020


ఒక్కరోజే 7,466 కరోనా కేసులు.. కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్?

ఒక్కరోజే 7,466 కరోనా కేసులు.. కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్?

   30-05-2020


ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్‌.. తిప్పికొట్టిన సంస్థ సీఈఓ

ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్‌.. తిప్పికొట్టిన సంస్థ సీఈఓ

   29-05-2020


కరోనా ఆందోళన.. ప్రపంచంలో 9వ స్థానానికి ఇండియా

కరోనా ఆందోళన.. ప్రపంచంలో 9వ స్థానానికి ఇండియా

   29-05-2020


నేపాల్ ప్రధానికి భారత్ గట్టి కౌంటర్.. కొత్త మ్యాపులకు బ్రేక్

నేపాల్ ప్రధానికి భారత్ గట్టి కౌంటర్.. కొత్త మ్యాపులకు బ్రేక్

   29-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle