ఢిల్లీ సీపీపై హోంమంత్రి సీరియస్
03-07-201903-07-2019 15:06:29 IST
2019-07-03T09:36:29.722Z03-07-2019 2019-07-03T09:36:27.356Z - - 16-01-2021

ఈమధ్యకాలంలో దేశ రాజధాని ఢిల్లీలో గ్యాంగ్ వార్ లు సాధారణం అయిపోయాయి. దీంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా చాందినీ చౌక్‌లో రెండురోజుల క్రితం రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా ఒక ప్రార్థనామందిరం పాడైంది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీరియస్ అయ్యారు. ఢిల్లీ పోలీసు కమీషనర్ అమూల్య పట్నాయక్‌ను ఆయన మందలించారు. ఓ పార్కింగ్ స్థలం గురించి రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ అల్లర్లలో ఓ ప్రార్థనా మందిరం ధ్వంసమైంది. దీని గురించి తెలుసుకునేందుకు ఢిల్లీ పోలీసు చీఫ్‌కు కేంద్ర హోంశాఖ సమన్లు జారీ చేసింది. చాందినీ చౌక్‌లోని హౌజ్ ఖ్వాజీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే ప్రార్థనా మందిరం కూల్చివేత ఘటనపై ఢిల్లీ హైకోర్టులో అడ్వకేట్ అలక్ పిల్ వేశారు. ఓ బిల్డింగ్ ముందు 20 ఏళ్ల కుర్రాడు స్కూటర్ పార్కింగ్ చేస్తున్న సమయంలో గొడవ జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో వందలాది మంది పోలీసులు, పారా మిలటరీ సైనికులు మోహరించారు. ఈప్రాంతంలో శాంతి సామరస్యాలు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని డిప్యూటీ సీపీ మన్ దీప్ సింగ్ రాంధవా తెలిపారు. సాధారణ పరిస్ధితులు నెలకొనేలా అంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!
3 hours ago

భర్తకు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు తల్లి
10 hours ago

వైట్ హౌజ్ కాదు.. వాషింగ్టన్ నే వదిలేస్తారట
8 hours ago

ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్
11 hours ago

భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..
12 hours ago

ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు
12 hours ago

తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య
14 hours ago

భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..
14 hours ago

కాసేపట్లో కరోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్రపంచంలో మనమే టాప్
14 hours ago

ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..
15-01-2021
ఇంకా