జేపీ నడ్డా సారథిగా బీజేపీ రథం పరుగులు పెడుతుందా?
30-05-201930-05-2019 08:32:54 IST
Updated On 30-05-2019 08:33:51 ISTUpdated On 30-05-20192019-05-30T03:02:54.774Z30-05-2019 2019-05-30T03:02:48.866Z - 2019-05-30T03:03:51.736Z - 30-05-2019

అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ కమలం వికసించింది. అమిత్ షా-మోడీ జోడీ ఫార్ములా సక్సెస్ అయింది. అయితే ఈసారి మంత్రిగా అమిత్ షా మోడీకి చేదోడువాదోడుగా ఉండనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ పగ్గాలు వేరెవరికి ఇస్తారన్న అంచనాలు ఎవరికివారే వేసుకుంటున్నారు. అయితే, బీజేపీ నూతన సారధిగా జే పీ నడ్డా నియమితులవుతారని హస్తినలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఇప్పటివరకూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందారు. ఆయన్ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోనుండడంతో పార్టీ అధ్యక్షుణ్ణి ఎన్నుకోవాల్సి వచ్చింది. 59 ఏళ్ళ నడ్డా బీజేపీ పగ్గాలు చేపట్టనున్నారు.ఈ పదవికి మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు కూడా వినిపిస్తోంది.
నడ్డాకు అమిత్ షాతో సాన్నిహిత్యం కారణంగా పార్టీ ఆయనవైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. మోడీకి ఏమాత్రం తీసిపోని విధంగా అమిత్ షా వ్యూహరచన చేశారు. ఈ గెలుపు వెనుకు మోదీ కరిష్మా ఎంత ఉందో.. అమిత్ షా వ్యూహరచన, పనితీరు అంతే ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో పార్టీని అనేక రాష్ట్రాల్లో కాషాయమయం చేశారు.
జేపీ నడ్డా ఇటు మోడీకి-అమిత్ షాకు మంచి సంబంధాలున్నాయి. గత మోదీ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడైన నడ్డా బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు కార్యదర్శిగా కొనసాగుతున్నారు. పార్టీలో మంచి వ్యూహకర్తగా నడ్డాకు మంచిపేరుంది. చాలా వేగంగా వ్యూహాలు రచిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు.
మినీ ఇండియాగా పేరొందిన ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి ఎన్నికల ఇన్చార్జిగా ఈ ఏడాది జనవరిలో నియమితులయ్యారు. ఆయన నేతృత్వంలో సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 80సీట్లలో బీజేపీ ఏకంగా 62 లోక్‌సభ సీట్లను గెలుచుకుంది. మిత్రపక్షం అప్నాదళ్ రెండింట్లో విజయం సాధించింది. బీఎస్పీ-ఎస్పీ కూటమి నుంచి గట్టీ పోటీ ఎదురైనప్పటికీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడంలో ఆయన వ్యూహాలు ఫలించాయి. నడ్డాకు బీజేపీ అధ్యక్ష పదవి అప్పగించేందుకు ప్రధాని మోదీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ నడ్డాకు బాధ్యతలు అప్పగిస్తే దేశవ్యాప్తంగా బీజేపీ రథాన్ని ఎలా నడిపిస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.



మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!
3 hours ago

భర్తకు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు తల్లి
10 hours ago

వైట్ హౌజ్ కాదు.. వాషింగ్టన్ నే వదిలేస్తారట
8 hours ago

ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్
11 hours ago

భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..
12 hours ago

ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు
13 hours ago

తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య
14 hours ago

భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..
14 hours ago

కాసేపట్లో కరోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్రపంచంలో మనమే టాప్
15 hours ago

ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..
15-01-2021
ఇంకా