newssting
BITING NEWS :
* నేటి నుంచి మే 31 వరకు మార్క్‌ ఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు .. అన్ని జిల్లాల్లో పసుపు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు *మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 6, 875 చెల్లించాలని ఏపీ సర్కార్ ఆదేశం *నేడు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్ * వెలిగొండ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్న సీఎం జగన్‌ ..పాల్గొననున్న మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఇంజినీరింగ్‌ అధికారులు *ఇవాళ్టితో 65వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ఆందోళన.. ఫాలో అప్‌*జనసేన అధినేత పవన్ ఇవాళ ఢిల్లీ పర్యటన.. సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించనున్న పవన్ *ఇవాళ వేములవాడలో మంత్రి కేటీఆర్‌ పర్యటన *భారతీయుడు -2 సినిమా షూటింగ్‌లో అపశృతి .. క్రేన్ కూలి ముగ్గురి మృతి * మహారాష్ట్రలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం..లారీ-కారు ఢీ. ఆరుగురి మృతి

జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయం సాధ్యమేనా?

20-06-201920-06-2019 09:10:49 IST
Updated On 20-06-2019 09:11:26 ISTUpdated On 20-06-20192019-06-20T03:40:49.237Z20-06-2019 2019-06-20T03:40:43.437Z - 2019-06-20T03:41:26.546Z - 20-06-2019

జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయం సాధ్యమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకే దేశం, ఒకే ఎన్నిక అంశం మరోమారు తెరమీదకు వచ్చింది. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీకి ప్రధాని నరేంద్రమోదీ, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఒడిశా, బిహార్‌ ముఖ్యమంత్రులు నవీన్‌ పట్నాయక్, నితీశ్‌కుమార్, కేంద్ర మంత్రులు నడ్డా, రాజ్‌నాథ్, అమిత్‌ షా, గడ్కరీ తదితరులు హాజరయ్యారు. మమతా బెనర్జీ, స్టాలిన్  హాజరుకాలేదు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 40 మందికి ఆహ్వానం పలికితే 21 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. మరో మూడు పార్టీలు ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశాయని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. 

జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై సూచనలు ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కమిటీని ఏర్పాటు చేస్తారని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. నిర్దిష్ట కాలవ్యవధిలోగా భాగస్వామ్యపక్షాలతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని తెలిపారు. జమిలి ఎన్నికలనేవి ప్రభుత్వ ఎజెండా కాదన్నారు.

ఈ ప్రతిపాదన జాతీయ ఎజెండాగా ప్రధాని స్పష్టం చేశారు. లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనకు చాలా పార్టీలు మద్దతు పలికాయని చెప్పారు. దీనివల్ల ఎంతో విలువైన సమయం, ప్రజాధనం ఆదా అవుతుందని పలు పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఉమ్మడి ఎన్నికల కసరత్తు ఎలా జరుగుతుందనే దానిపై సీపీఐ, సీపీఎం వంటి పార్టీలకు భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ, ఈ ఆలోచనను వారు నేరుగా స్వాగతించారు. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’తో పాటు దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అయ్యే సందర్భంగా 2022లో ఉత్సవాలు నిర్వహించడం, అలాగే ఈ ఏడాది మహాత్మాగాంధీ 150 జయంతి ఉత్సవాలు నిర్వహించడం తదితర అంశాలపై చర్చించేందుకు నిర్వహించిన ఈ సమావేశానికి ఎన్డీయే మిత్రపక్షం శివసేనతో పాటు పలు విపక్ష పార్టీలు హాజరుకాలేదు.

ఈ సమావేశానికి రాని ప్రముఖుల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్, డీఎంకే నేత ఎంకే స్టాలిన్, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, శివసేన అధినేత ఉద్ధవ్‌ థాక్రే, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ , బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉన్నారు.

జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి, సమాఖ్యవాదానికి విరుద్ధమని, ఆ విధంగా అవి రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో సీతారాం ఏచూరి మాట్లాడారు. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దొడ్డిదారిన తొలగించడం అన్నారు ఏచూరి.

భారత్‌ వంటి అతిపెద్ద దేశానికి జమిలి ఎన్నికలనేవి అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధ ఆలోచనగా కనబడుతోందని మాయావతి పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం దేశం ముందున్న అంశం కాదని విమర్శించారు. ఈవీఎంలపై అఖిలపక్షం ఏర్పాటు చేసి ఉంటే హాజరయ్యేదాన్నంటూ మాయావతి అంతకుముందు ట్వీట్‌ చేశారు. సార్వత్రిక ఎన్నికలు ముగిశాక వివిధ రాష్ట్రాల ఎన్నికల వేళ ఈ అంశం తెరమీదకు తీసుకురావడంపై పలు పార్టీలు ఆశ్చర్యం వ్యక్తంచేశాయి. అయితే ఈ ప్రతిపాదన అమలుకు రాజ్యాంగసవరణ ఒక్కటే మార్గం అంటున్నారు రాజ్యాంగ నిపుణులు. 

 

జార్జ్ ఫెర్నాండెజ్ సహాయాన్ని మర్చిపోలేం..  చైనా కృతజ్ఞతలు

జార్జ్ ఫెర్నాండెజ్ సహాయాన్ని మర్చిపోలేం.. చైనా కృతజ్ఞతలు

   12 hours ago


నిర్భయకు న్యాయం దక్కకపోతే ఎవరికీ దక్కనట్లే : ఆశా దేవి

నిర్భయకు న్యాయం దక్కకపోతే ఎవరికీ దక్కనట్లే : ఆశా దేవి

   16 hours ago


ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నివేదిక

ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నివేదిక

   18 hours ago


ట్రంప్ టూర్.. పరువు కోసం ఆరాటం.. పేదల జీవితాలతో చెలగాటం

ట్రంప్ టూర్.. పరువు కోసం ఆరాటం.. పేదల జీవితాలతో చెలగాటం

   19 hours ago


విద్యుత్ కొనుగోలు ఒప్పందాల అమలుకు ట్రిబ్యునల్?

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల అమలుకు ట్రిబ్యునల్?

   20 hours ago


స్టూడెంట్ వీసాలు, ట్రేడ్ డీల్‌పై ట్రంప్ షాక్

స్టూడెంట్ వీసాలు, ట్రేడ్ డీల్‌పై ట్రంప్ షాక్

   19-02-2020


గూగుల్ ఉచిత వై-ఫై ఎత్తివేతకు ఇదా కారణం?

గూగుల్ ఉచిత వై-ఫై ఎత్తివేతకు ఇదా కారణం?

   19-02-2020


ఉగ్రవాద నిరోధక చర్యలపై పాక్ వైఫల్యం కొనసాగింపు

ఉగ్రవాద నిరోధక చర్యలపై పాక్ వైఫల్యం కొనసాగింపు

   19-02-2020


నిరసన తెలుపండి.. కానీ ఇతరుల హక్కు మాటేంటి: సుప్రీం వ్యాఖ్య

నిరసన తెలుపండి.. కానీ ఇతరుల హక్కు మాటేంటి: సుప్రీం వ్యాఖ్య

   18-02-2020


ఆర్మీ అధికారిణులకూ శాశ్వత కమిషన్ : సుప్రీం చారిత్రక తీర్పు

ఆర్మీ అధికారిణులకూ శాశ్వత కమిషన్ : సుప్రీం చారిత్రక తీర్పు

   18-02-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle