newssting
BITING NEWS :
* వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని నరేంద్రమోదీ. * ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ మాదిరే‌ రష్యా‌ వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి ప్రయోగాలలో కూడా స్వల్ప దుష్పలితాలు. * అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి. 14 మందికి గాయాలు. * షెడ్యూల్‌ కంటే ముందుగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశం. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచన చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మొగ్గుచూపిన మెజారిటీ సభ్యులు * సాంప్రదాయ, శాస్త్రోక్తంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. * ఏపీలో నేటి నుండి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు. ఈ నెల 26 వరకు.. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరగనున్న పరీక్షలు. ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి. తాజాగా మరో 1065 కేసులు నమోదు. ఒంగోలులో అత్యధికంగా 220 కేసులు నమోదు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు * తెలంగాణలో సోమవారం నుండి ప్రారంభం కానున్న పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు. అన్ని స్కూళ్లలో విధులకు హాజరు కానున్న సగం మంది టీచర్లు. రోజు విడిచి రోజు విధులకు హాజరు కానున్న ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే పాఠశాలకు విద్యార్థులు * ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు అతిభారీ వర్షాలు. పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, వంకలు. కుండపోత వర్షాలకు భారీగా నీటమునిగిన పంటలు.

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

03-08-202003-08-2020 06:42:09 IST
Updated On 03-08-2020 06:43:49 ISTUpdated On 03-08-20202020-08-03T01:12:09.467Z03-08-2020 2020-08-03T01:12:05.224Z - 2020-08-03T01:13:49.048Z - 03-08-2020

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చైనా మద్దతు దన్నుతో నేపాల్ పూర్తిగా భారత వ్యతిరేక వైఖరితో రగిలిపోతోంది. గత కొద్ది రోజులుగా భారత్‌కు వ్యతిరేకంగా దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న నేపాల్‌ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్‌ రూపొందించిన నూతన మ్యాప్‌ను.. ఐక్యరాజ్యసమితి, గూగుల్‌కు పంపించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆ దేశ మీడియా శనివారం తెలిపింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం మ్యాప్‌ను ఆంగ్లంలో ప్రచురించడంతో పాటు.. ఐక్యరాజ్యసమితి, గూగుల్‌తో సహా అంతర్జాతీయ సమాజానికి పంపడానికి అవసరమైన సన్నాహాలు చేస్తోందని సమాచారం. 

ఈ సందర్భంగా ‘మేము త్వరలో లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలతో ఉన్న మ్యాప్‌ను అంతర్జాతీయ సమాజానికి పంపిస్తాము’ అని నేపాల్‌ మంత్రి పద్మ ఆర్యాల్‌ తెలిపారు. అంతేకాక ‘ఆక్రమిత భూభాగాలతో’ అనే పేరుతో ఈ మూడు భూభాగాలకు సంబంధించి ఒక పుస్తకాన్ని ప్రచురించడానికి కూడా నేపాల్ ప్రభుత్వం సన్నద్ధమవుతోందని పద్మ ఆర్యాల్ తెలిపారు. అయితే, ఈ నూతన మ్యాప్‌ను అంతర్జాతీయ సమాజానికి పంపడమే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. 

లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలను తమ దేశ అంతర్భాగంలో చేర్చిన మ్యాప్‌ను జూన్‌ 13న నేపాల్‌ పార్లమెంట్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మూడు ప్రాంతాలు తమకు చెందినవేనని భారత్‌ స్పష్టం చేసింది.

కాగా భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న నేపాల్‌ను మరింత మచ్చిక చేసుకునేందుకు డ్రాగన్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఇటీవల పరిణామాల ద్వారా స్పష్టమవతోంది. భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలైన లిపులేఖ్‌, లింపియదుర, కాలాపానీలను నేపాల్‌ తన భూభాగంలోకి కలుపుతూ కొత్త మ్యాప్‌లు విడుదల చేసింది. అంతేగాక కరోనా వ్యాప్తి నేపథ్యంలో నేపాల్‌ ప్రధాని భారత్‌కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం సహా.. అసలు సిసలైన రామజన్మ భూమి తమ దేశంలోనే ఉందంటూ వివాదానికి తెరతీశారు. ఈ క్రమంలో తన పదవికి ఎసరు రావడంతో చైనా ఆయనకు మద్దతుగా నిలిచింది.

రాజకీయ సంక్షోభం తలెత్తకుండా, అధికార నేపాలీ కమ్యూనిస్టు పార్టీలో చీలిక రాకుండా ఉండేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌- చైనాల మధ్య గల్వాన్‌ లోయ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న వేళ నేపాల్‌ సహా ఇతర సరిహద్దు దేశాలతో బంధం మరింత బలపరచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇక ఇప్పటికే పాకిస్తాన్‌కు మిత్రదేశంగా కొనసాగుతున్న డ్రాగన్‌‌, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌లకు కూడా అండగా నిలుస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే.

రాబోయే కాలంలో నేపాల్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు చైనా తెలిపింది. పరస్పర సహాయ, సహకారాలతో ముందుకు సాగుతామని స్పష్టం చేసింది. డ్రాగన్‌- హిమాలయ దేశాల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక బంధానికి నేటితో 65 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. నేపాల్‌ అధ్యక్షురాలు విద్యాదేవీ భండారికి శనివారం ప్రత్యేక సందేశాన్ని పంపించారు. ‘‘ ఎల్లప్పుడూ ఒకరిని ఒకరం గౌరవించుకుంటూ.. సమానత్వ భావన కలిగి ఉండి పరస్పర విశ్వాసంతో ముందుకు సాగుతున్నాం. తద్వారా ఇరు వర్గాలకు లబ్ది చేకూరుతోంది. ఇక కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో మహమ్మారిపై పోరులో కలిసికట్టుగా పనిచేసి చైనా- నేపాల్‌ బంధంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాం’’అని ఇరు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాల గురించి ప్రస్తావించారు. 

 

దేశ సినీ పరిశ్రమని టెర్రరిజమ్‌ల నుంచి కాపాడాలి: కంగనా

దేశ సినీ పరిశ్రమని టెర్రరిజమ్‌ల నుంచి కాపాడాలి: కంగనా

   17 hours ago


పుస్తకాలే లేవు.. ఆన్‌లైన్ క్లాసులపై.. తల్లిదండ్రుల తీవ్ర ఆవేదన

పుస్తకాలే లేవు.. ఆన్‌లైన్ క్లాసులపై.. తల్లిదండ్రుల తీవ్ర ఆవేదన

   20 hours ago


పాకిస్తాన్, చైనా.. భారత సహనానికి పరీక్ష.. !

పాకిస్తాన్, చైనా.. భారత సహనానికి పరీక్ష.. !

   20 hours ago


చైనాతో చర్చలు సరే.. మరి పాకిస్తాన్ తో.. ఫరూక్ వ్యాఖ్యలు

చైనాతో చర్చలు సరే.. మరి పాకిస్తాన్ తో.. ఫరూక్ వ్యాఖ్యలు

   21 hours ago


ఆ కాలువ నిర్మాణం పిరమిడ్స్, తాజ్‌మహల్‌ కంటే గొప్ప కృషే... ఆనంద్ మహీంద్రా

ఆ కాలువ నిర్మాణం పిరమిడ్స్, తాజ్‌మహల్‌ కంటే గొప్ప కృషే... ఆనంద్ మహీంద్రా

   a day ago


పెరుగుతున్న నిరుద్యోగం.. అరకోటికి పైగా ఉద్యోగాలు హుష్!

పెరుగుతున్న నిరుద్యోగం.. అరకోటికి పైగా ఉద్యోగాలు హుష్!

   19-09-2020


ఉల్లి ఎగుమతుల నిషేధం ప్రయోజనం ఎవరికి?

ఉల్లి ఎగుమతుల నిషేధం ప్రయోజనం ఎవరికి?

   19-09-2020


అల్ ఖైదా కుట్ర భగ్నం.. అంతర్రాష్ట్ర ఉగ్రవాదులు అరెస్ట్

అల్ ఖైదా కుట్ర భగ్నం.. అంతర్రాష్ట్ర ఉగ్రవాదులు అరెస్ట్

   19-09-2020


ఆ ఏడు దేశాలకే 88 శాతం వ్యాక్సిన్ డోసులు.. గ్లోబల్ నివేదిక

ఆ ఏడు దేశాలకే 88 శాతం వ్యాక్సిన్ డోసులు.. గ్లోబల్ నివేదిక

   19-09-2020


రైతుల దశ మారుతుంది.. వ్యవసాయ బిల్లుల ఆమోదంపై ప్రధాని మోదీ

రైతుల దశ మారుతుంది.. వ్యవసాయ బిల్లుల ఆమోదంపై ప్రధాని మోదీ

   18-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle