newssting
Radio
BITING NEWS :
మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత. కొద్దిరోజుల క్రితమే కరోనా నుంచి కోలుకున్న నాయిని. మళ్లీ లంగ్ ఇన్ఫెక్షన్ సోకడంతో అపోలోలో చికిత్స. బుధవారం అర్థరాత్రి 12.25 గంటలకు నాయిని మరణించినట్లు తెలిపిన అపోలో ఆస్పత్రి వర్గాలు. * 6వ రోజు ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్నదసరా మహోత్సవాలు. లలితా త్రిపురసుందరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. * మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం. నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన వీడియో జర్నలిస్ట్ కుమారుడు దీక్షిత్. మహబూబాబాద్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపై బాలుడి మృతదేహం. కిడ్నాప్ చేసిన రోజే బాలుడిని హతమార్చినట్లు అనుమానిస్తున్న పోలీసులు. పోలీసుల అదుపులో బాధిత కుటుంబ బంధువు మనోజ్ రెడ్డి. * మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే రాజీనామా. నేడు లేదా రేపు కాంగ్రెస్ లో చేరే అవకాశం. * కరోనా టీకా వికటించి వాలంటీర్ మృతి. బ్రెజిల్ లో టీకాను అభివృద్ధి చేసిన ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా. వాలంటీర్ మృతికి గల కారణాలను తెలుసుకుంటున్నామన్న ఆక్స్ ఫర్డ్ వైద్యులు.

చైనాతో చర్చలు సరే.. మరి పాకిస్తాన్ తో.. ఫరూక్ వ్యాఖ్యలు

20-09-202020-09-2020 09:06:06 IST
2020-09-20T03:36:06.417Z20-09-2020 2020-09-20T03:36:03.545Z - - 23-10-2020

చైనాతో చర్చలు సరే.. మరి పాకిస్తాన్ తో.. ఫరూక్ వ్యాఖ్యలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చైనాతో చర్చలు జరుపగలుగుతున్న భారత్ దేశం పాకిస్తాన్‌తో చర్చలు జరపలేదా.. ప్రజల మరణాలకు, ఆస్తి నష్టాలకు కారణమవుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను తొలగించాలంటే పాకిస్తాన్‌తో కూడా భారత్ చర్చలు జరపాల్సిందే అని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు మాజీ కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిలదీశారు. సుదీర్ఘ నిర్బంధం నుంచి ఇటీవలే విడుదలైన ఫరూక్.. దౌత్య విధానానికి సంబంధించి లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. 

వాస్తవాధీన రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాతో చర్చలు జరుపుతున్నట్లుగానే, దాయాది దేశం పాకిస్తాన్‌తోనూ ఇదే తరహా సంప్రదింపులు జరపాలని ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వానికి సూచించారు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఎంతో మంది ప్రజలు మరణిస్తున్నారని, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించి శాంతి నెలకొనేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ మేరకు శనివారం లోక్‌సభలో ప్రసంగించిన ఫరూక్‌ అబ్దుల్లా.. ‘‘బలగాల ఉపసంహరణ విషయంలో నేడు ఇండియా చైనాతో చర్చలు జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అలాగే పెండింగ్‌లో ఉన్న వివాదాల గురించి పాకిస్తాన్‌తోనూ చర్చలు ప్రారంభించాలి. బార్డర్‌లో ప్రజలు చనిపోతున్నారు. చర్చల ద్వారానే ఇందుకు పరిష్కారం దొరుకుతుంది. లఢఖ్‌ సరిహద్దులో చైనాతో వ్యవహరిస్తున్న తీరుగానే, మన పొరుగు దేశంతోనే మాట్లాడి ఉద్రిక్త పరిస్థితులు తొలగిపోయేలా చూడాలి’’ అని విజ్ఞప్తి చేశారు. 

దేశంలోని ఇతర ప్రాంతాలకు ఉన్న హక్కులు మా కశ్మీర్‌ ప్రజలకు లేవా.. హిందూస్తాన్ అభివృద్ధి చెందుతున్నప్పుడు జమ్మూ కశ్మీర్ అభివృద్ధి చెందకూడదా.. ముస్లింలం కాబట్టి మాకు అభివృద్ధి ఫలాలు అందచేయరా అంటూ ఫరూక్ అబ్దుల్లా లోక్‌సభలో తనను అడ్డుకోబోయిన బీజేపీ ఎంపీలను ప్రశ్నించారు.

ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నట్లుగా కశ్మీర్‌లో మా పిల్లలు, వర్తకులు, విద్యార్థులు పనిచేసుకోవడానికి కనీసం 4జీ సౌకర్యం కూడా లేదని ఫరూక్ వాపోయారు. ప్రపంచం మొత్తంగా ఇంటర్నెట్‌పై ఆధారపడి పనిచేస్తున్నప్పుడు గత సంవత్సరం పైగా కశ్మీర్‌లో మాకు ఎవరికీ 4 జీ సౌకర్యం లేదని ఫరూక్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాగ్దానాలన్నీ నీటిమీద రాతల్లాగే ఉంటున్నాయని, కశ్మీర్‌లో ప్రస్తుతం ఏ అభివృద్ధి కార్యక్రమాలూ జరగలేదని ఫరూక్ ఆవేదన వ్యక్తం చేశారు.

అదే విధంగా.. షోపియాన్‌ ఎన్‌కౌంటర్‌లో తమ తప్పిదం కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించారని ఆర్మీ అధికారులు చెప్పడం తనకు సంతోషంగా ఉందంటూ జూలై నాటి ఘటనను ఫరూక్‌ అబ్దుల్లా సభలో ప్రస్తావించారు.  బాధిత కుటుంబాలకు ప్రభుత్వం భారీగా నష్టపరిహారం చెల్లిస్తుందని ఆశిస్తున్నారన్నారు. 

కాగా గతేడాది ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లాతో పాటు పలువురు కశ్మీరీ నేతలకు ప్రభుత్వం గృహ నిర్బంధం విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే ఆయనకు విముక్తి లభించింది. 

వర్షాకాల పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో లోక్‌సభలో ప్రసంగించిన ఫరూక్‌ అబ్దుల్లా డిటెన్షన్‌ కాలంలో తనకు మద్దతుగా నిలిచిన ఎంపీలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌ ఎలాంటి పురోగతి సాధించలేదన్నారు. కాగా ఫరూక్‌ అబ్దుల్లా ప్రస్తుతం శ్రీనగర్‌ ఎంపీగా ఉన్నారు.  

జూలైలో క‌రోనా పేషెంట్ చ‌నిపోతే.. ప‌క్క‌న వారికోసం ఇప్పుడు స‌ర్చింగ్

జూలైలో క‌రోనా పేషెంట్ చ‌నిపోతే.. ప‌క్క‌న వారికోసం ఇప్పుడు స‌ర్చింగ్

   16 hours ago


బీజేపీ నయా ఎన్నికల స్టంట్.. ప్ర‌తి ఒక్క‌రికీ ఉచితంగా కోవిద్ టీకా

బీజేపీ నయా ఎన్నికల స్టంట్.. ప్ర‌తి ఒక్క‌రికీ ఉచితంగా కోవిద్ టీకా

   16 hours ago


భారత నౌకా దళంలోకి వచ్చేసిన ఐఎన్ఎస్ కవ‌ర‌త్తి.. శత్రువుల వెన్నులో వణుకే

భారత నౌకా దళంలోకి వచ్చేసిన ఐఎన్ఎస్ కవ‌ర‌త్తి.. శత్రువుల వెన్నులో వణుకే

   16 hours ago


ఏకంగా బ‌స్టాప్ నే ఎత్తుకెళ్లారు

ఏకంగా బ‌స్టాప్ నే ఎత్తుకెళ్లారు

   17 hours ago


కరోనా కేసుల సంఖ్యపై అప్డేట్స్..!

కరోనా కేసుల సంఖ్యపై అప్డేట్స్..!

   18 hours ago


టెట్‌ వ్యాలిడిటీ శాశ్వతం.. ఎన్‌సీటీఈ నిర్ణయం

టెట్‌ వ్యాలిడిటీ శాశ్వతం.. ఎన్‌సీటీఈ నిర్ణయం

   18 hours ago


భారత్ లో పరిశోధనలు ఎంతో ముఖ్యమని ప్రపంచానికి చెప్పిన బిల్ గేట్స్

భారత్ లో పరిశోధనలు ఎంతో ముఖ్యమని ప్రపంచానికి చెప్పిన బిల్ గేట్స్

   21-10-2020


సాయిబాబాకు మందులు, పుస్తకాలు కూడా ఇవ్వరా.. హరగోపాల్

సాయిబాబాకు మందులు, పుస్తకాలు కూడా ఇవ్వరా.. హరగోపాల్

   21-10-2020


ఫౌచీ ఒక ఇడియట్‌.. నోరు పారేసుకున్న ట్రంప్

ఫౌచీ ఒక ఇడియట్‌.. నోరు పారేసుకున్న ట్రంప్

   21-10-2020


చైనా సైనికుడిని అప్పగించేశారు

చైనా సైనికుడిని అప్పగించేశారు

   21-10-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle