newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

చెరిగిపోని చీకటి రోజులకు 44 ఏళ్ళు

26-06-201926-06-2019 13:38:11 IST
Updated On 26-06-2019 13:38:34 ISTUpdated On 26-06-20192019-06-26T08:08:11.493Z26-06-2019 2019-06-26T08:08:09.293Z - 2019-06-26T08:08:34.028Z - 26-06-2019

చెరిగిపోని చీకటి రోజులకు 44 ఏళ్ళు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భార‌త‌దేశ చ‌రిత్రలో అవి చీక‌టి రోజులు. అహం దెబ్బతిన్న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఒంటెద్దు పోక‌డ‌, క్రూర మ‌న‌స్థత్వానికి చారిత్రక సాక్షాలు. అర్థరాత్రి వ‌చ్చిన స్వాతంత్ర్య వెలుగుల‌ను అర్థరాత్రి చీక‌ట్లోకి నెట్టేసిన నిర్ణ‌యాలు. స‌రిగ్గా 44 సంవ‌త్స‌రాల క్రితం ఇదే రోజు దేశ వ్యాప్తంగా ఎమెర్జెన్సీ అమ‌ల్లోకి వ‌చ్చింది.

నాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ, రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 352 ఆధారంగా దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించారు. 1975 జూన్ 25వ తేదీన అర్థరాత్రి 11 గంట‌ల 45 నిమిషాల‌కు ఎమ‌ర్జెన్సీ అమ‌ల్లోకి వ‌చ్చింది. ఆ మ‌రునాడు రేడియో ద్వారా దేశ ప్ర‌జ‌ల‌కు ఈ విష‌యం తెల్సింది. అప్ప‌టి నుంచీ 1977 మార్చి 21వ తేదీ దాకా అంటే 21 నెల‌ల పాటు దేశంలో అరాచ‌కం రాజ్యమేలింది. 

ఎమ‌ర్జెన్సీ విధించ‌డానికి కేవ‌లం ఇందిరాగాంధీ మీద దాఖ‌లైన కేసులో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు రావ‌డం మాత్రమే కార‌ణం కాదు, ప‌లు రాష్ట్రాల్లో నాటి కాంగ్రెస్ ముఖ్య‌మంత్రుల అవినీతి, అక్రమాల మీద జ‌నం నుంచి మొద‌లైన ఉద్య‌మాలు కూడా ప్రధాన కార‌ణం. రెండో పాకిస్తాన్ యుద్ధం త‌ర్వాత దేశ ఆర్థిక ప‌రిస్థితి చాలా చితికి పోయింది. యుద్ధం త‌ర్వాత బంగ్లాదేశ్ నుంచి దాదాపు 80 ల‌క్ష‌ల మంది శ‌ర‌ణార్ధులు స‌రిహ‌ద్దు దాటి దేశంలోకి వ‌చ్చారు. 

వారికి ఆశ్రయం, ఆహారం అందించ‌డంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీకి క‌ష్టంగా మారింది. అదే స‌మ‌యంలో భార‌త‌దేశం మీద అమెరికా ఎన్నో ఆంక్షలు విధించింది. అలాగే ముడిచ‌మురు దిగుమ‌తి మీద భారీగా సుంకం పెంచింది. దీంతో నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు ఆకాశానికి వెళ్లాయి. జ‌నం ధ‌ర‌ల తాకిడికి అల్లాడి పోయారు. ఇదే స‌మ‌యంలో గుజ‌రాత్ అల్ల‌ర్లు ఇందిరాగాంధీకి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. 

అహ్మదాబాద్ ఎల్డీ కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ విద్యార్ధులు అధిక ఫీజుల‌కు వ్యతిరేకంగా ఆందోళ‌న‌ల‌కు దిగారు. వారి ఉద్యమానికి ఆ రాష్ట్రంలోని అన్ని యూనివ‌ర్శిటీల విద్యార్థులు మ‌ద్దతు ప‌లికారు. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న చిమ‌న్ భాయ్ ప‌టేల్ మీద అవినీతి ఆరోప‌ణ‌లు బ‌లంగా ఉన్నాయి. ఇక విద్యార్థుల ఉద్య‌మానికి ప్ర‌జ‌ల‌తో పాటు కార్మికులు, రైతులు, వ్యాపార‌స్తులు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో హింస రేగింది. చిమ‌న్ భాయ్ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయాల‌న్న డిమాండ్ ఊపందుకుంది. 

Image result for indira gandhi emergency

మొద‌ట్లో ఈ అల్లర్లను అణ‌చాల‌ని భావించిన ఇందిరాగాంధీ  ప్ర‌భుత్వం, ఆ త‌ర్వాత చేసేది లేక 1974 ఫిబ్రవ‌రిలో చిమిన్ భాయ్ ప‌టేల్ ప్రభుత్వాన్ని ర‌ద్దు చేసి రాష్ట్రప‌తి పాల‌న విధించింది. ఇక అదే ఏడాది పెంచిన ఫీజులు ర‌ద్దు చేయాలంటూ లోక నాయ‌క్ జ‌య‌ప్రకాష్ నారాయ‌ణ్ నేతృత్వంలో విద్యార్ధి సంఘాలు బీహార్ వ్యాప్తంగా ఆందోళ‌న‌కు దిగాయి. హింస భారీగా చెల‌రేగింది. ఆ త‌ర్వాత సంపూర్ణ విప్లవానికి జేపీ పిలుపు ఇవ్వడంతో అది ప్రజా ఉద్యమంగా మారింది. ఈ ఉద్య‌మం కూడా ఇందిర ప్ర‌భుత్వాన్నికి మింగుడు ప‌డ‌లేదు. ఇక 1974 మేలో రైల్వే ఉద్యోగులు స‌మ్మెకు దిగారు. కార్మిక సంఘం నేత జార్జ్ ఫెర్నాండెజ్ నేతృత్వంలో దేశ వ్యాప్తంగా ఆందోళ‌న చేశారు. 

దీంతో వేలాది మంది ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వారి కుటుంబాల‌ను రైల్వే క్వార్టర్స్ నుంచి బ‌ల‌వంతంగా గెంటేసింది. ఇది స‌గటు భార‌తీయుడికి ఆగ్ర‌హం క‌లిగింది. ఈ సంఘ‌ట‌న‌లన్నీనాటి ప్రధాని ఇందిరాగాంధీకి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అదే స‌మ‌యంలో ఆమె మీద న‌మోదైన కేసు ఇందిరా గాంధీని విస్తుపోయేలా చేసింది. ఎందుకంటే, 1969లో కాంగ్రెస్ పార్టీలో చీలిక వ‌చ్చింది. దీంతో 1971లో జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో ఇందిర నాయ‌క‌త్వంలోని కాంగ్రెస్ పార్టీకి 351 సీట్లు వ‌చ్చాయి.

అయితే ఈ ఎన్నిక‌ల్లో ఇందిరాగాంధీ అక్రమాల‌కు పాల్పడ్డార‌నీ, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారంటూ ఆమె మీద రాజ్ నారాయ‌ణ్ అనే వ్య‌క్తి అల‌హాబాద్ హై కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. నాలుగేళ్ల పాటు ఈ కేసు విచారించిన అల‌హాబాద్ హై కోర్ట్, ఇందిరా గాంధీ పార్ల‌మెంట్ స‌భ్య‌త్వానికి అనర్హురాలిగా తేలుస్తూ 1975 జూన్ 12వ తేదీన తీర్పు జారీ చేసింది. 

ఆ త‌ర్వాత అదే ఏడాది జూన్ 24వ తేదీన అల‌హాబాద్ కోర్ట్ తీర్పు మీద సుప్రీం కోర్టు స్టే విధించినా, త‌న‌కు వ్యతిరేకంగా అల‌హాబాద్ కోర్ట్ తీర్పు ఇవ్వడంతో ఇందిరా గాంధీ అహం దెబ్బ‌తింది. అదే స‌మ‌యంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాల‌కు వ్యతిరేకంగా జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు ఆమెను చాలా ఇర‌కాటంలో ప‌డేశాయి. అందుకే స‌ర్వ‌రోగ నివారిణి అన్న ఇందిరా గాంధీ ఆలోచ‌న నుంచి పుట్టింది ఎమ‌ర్జెన్సీ. 1975 జూన్ 25వ తేదీ అర్థ‌రాత్రి మొద‌లైన ఎమ‌ర్జెన్సీలో ఎన్నో అరాచ‌కాలు జ‌రిగాయి.

సంజ‌య్ గాంధీ ఆదేశాల‌తో సామూహిక కుటుంబ నియంత్రణ ఆప‌రేష‌న్లు వేలాది జ‌రిగాయి. 1975 జులై 1వ తేదీన పౌర హ‌క్కుల‌పై ఇందిరా గాంధీ ఆంక్షలు విధించారు. అదే ఏడాది ఆగ‌స్టు 5వ తేదీన దేశ వ్యాప్తంగా అంత‌ర్గత భ‌ద్రతా చ‌ట్టం అమ‌ల్లోకి తెచ్చారు. ఇక‌ 1976 జ‌న‌వ‌రి 9వ తేదీన రాజ్యాంగం నిర్దేశించిన స్వేచ్చా నిబంధ‌న‌ల‌ను ఉక్కుపాదంలో అణిచి వేశారు. 

అదే ఏడాది ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన లోక్ స‌భ కాల‌ప‌రిమితిని ఏడాది పొడిగించారు. అదే ఏడాది మే 21వ తేదీన కోర్టుల నుంచి కొన్ని చ‌ట్టాల‌ను ర‌క్షించే పేరుతో రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేశారు. అంతేకాదు, ఎమ‌ర్జెన్సీని వ్య‌తిరేకించిన పలు పార్టీల నేత‌ల‌ను, విద్యార్థుల‌ను, సామాన్య ప్ర‌జ‌ల‌కు నిస్సిగ్గుగా జైల్లో పెట్టి చిత్ర‌హింస‌లు పెట్టారు. ఆర్ఎస్ఎస్, జ‌మాత్ ఏ ఇస్లాం సంస్థ‌ల మీద ఆంక్ష‌లు విధించారు. 

ఈ విధంగా ఆ చీక‌టి రోజుల్లో ఇందిర ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అరాచ‌కాలు అన్నీ ఇన్నీ కావు. ఆ త‌ర్వాత‌ 1977 జ‌న‌వ‌రి 18వ తేదీన సార్వత్రిక ఎన్నిక‌ల న‌గారా మోగింది.

అలాగే 1977 జ‌న‌వ‌రి 24వ తేదీన జ‌న‌తా పార్టీ ఆవిర్భ‌వించింది. అదే ఏడాది మార్చి 16వ తేదీన మొద‌లైన ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌దేన‌ని ఇందిరా గాంధీ ఆశ‌ప‌డ్డారు. కానీ ప్రజాతీర్పుతో అధికారంలోకి వ‌చ్చిన జ‌న‌తా పార్టీ, అదే ఏడాది మార్చి 21వ తేదీన ఎమర్జెన్సీ తొల‌గించింది. ఈ విధంగా 21 నెల‌ల పాటు దేశ చ‌రిత్రలో ఎమ‌ర్జెన్సీ ఓ చీక‌టి అధ్యాయానికి సాక్షీ భూతంగా నిలిచింది.

విమర్శలకు ఒక్క నిర్ణయంతో సమాధానం చెప్పిన విత్త మంత్రి

విమర్శలకు ఒక్క నిర్ణయంతో సమాధానం చెప్పిన విత్త మంత్రి

   15 hours ago


హస్తినను తాకిన అన్నదాత ఆగ్రహం..

హస్తినను తాకిన అన్నదాత ఆగ్రహం..

   18 hours ago


మా హనీమూన్ పాడుచేస్తారా.. చిక్కుల్లో థాయ్ ఎయిర్వేస్

మా హనీమూన్ పాడుచేస్తారా.. చిక్కుల్లో థాయ్ ఎయిర్వేస్

   20 hours ago


ట్రాఫిక్ ఫైన్ కట్టలేకపోతున్నారా.. ఇలా తప్పించుకోండి మరి.. ట్రాఫిక్ పోలీసు చిట్కా

ట్రాఫిక్ ఫైన్ కట్టలేకపోతున్నారా.. ఇలా తప్పించుకోండి మరి.. ట్రాఫిక్ పోలీసు చిట్కా

   21 hours ago


ట్రాఫిక్ జరిమానాలపై గడ్కరీ సమర్ధన...!

ట్రాఫిక్ జరిమానాలపై గడ్కరీ సమర్ధన...!

   20-09-2019


ఉల్లి ఘాటుతో ఉక్కిరి బిక్కిరి..!

ఉల్లి ఘాటుతో ఉక్కిరి బిక్కిరి..!

   20-09-2019


మోడీ హయాంలోనైనా మహిళా బిల్లుకు మోక్షం?

మోడీ హయాంలోనైనా మహిళా బిల్లుకు మోక్షం?

   20-09-2019


‘మహా’ ఎన్నికలు- బీజేపీ, శివసేన పొత్తుకు చిక్కులు

‘మహా’ ఎన్నికలు- బీజేపీ, శివసేన పొత్తుకు చిక్కులు

   19-09-2019


ఉరుములేని పిడుగులా..  జర్నలిస్టులపై ప్రగ్యా అనుచిత వ్యాఖ్యలు.!

ఉరుములేని పిడుగులా.. జర్నలిస్టులపై ప్రగ్యా అనుచిత వ్యాఖ్యలు.!

   19-09-2019


బ్యాలెట్ తో ఎన్నికల నిర్వహణ ఇక ముగిసిన శకం

బ్యాలెట్ తో ఎన్నికల నిర్వహణ ఇక ముగిసిన శకం

   19-09-2019


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle