newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేసీఆర్ కంటే ఆయనో అడుగు ముందుకేశాడు!

22-12-201822-12-2018 13:17:44 IST
2018-12-22T07:47:44.463Z22-12-2018 2018-12-22T07:47:42.026Z - - 14-05-2021

కేసీఆర్ కంటే ఆయనో అడుగు ముందుకేశాడు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గట్టెక్కించిన పథకాల్లో రైతు బంధు ప్రధానమైంది. ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతులకు కొండంత అండగా నిలుస్తోంది రైతు బంధు. కేసీఆర్ అమలుచేస్తున్న ఈ పథకం పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను ముమ్మరం చేసిన కేసీఆర్.. దేశమంతా రైతుబంధు తేవాలంటున్నారు. తాజాగా ఒడిశా ప్రభుత్వం రైతుబంధు పథకం ప్రవేశపెట్టింది. రైతులకు పెట్టుబడి వ్యయం, భూముల్లేని వారికి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రోత్సాహం, వృద్ధాప్యం, అంగవైకల్యం తదితర కారణాలతో వ్యవసాయం చేయలేని స్థితిలో ఉన్న రైతులకు ఆర్థిక సహాయం తదితరాలు ఈ పథకంలో ఉన్నాయి. కలియా (కృషక్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ లైవ్లీహుడ్‌ అండ్‌ ఇన్‌కం ఆగ్మెంటేషన్‌) పేరుతో కొత్త పథకాన్ని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు. కేసీఆర్ కంటే ఆయనో అడుగు ముందుకేశాడు. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా కేసీఆర్ ఒడిశాలో పర్యటించనున్నారు.  ఈనేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేసీఆర్ ఏమంటారో చూడాలి.  

2019లో ఎన్నికలు రానున్న తరుణంలో నవీన్ పట్నాయక్ ఈ పథకం ప్రకటించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పథకం కింద 2020–21 ఆర్థిక సంవత్సరంలో 10,180 కోట్లను ఖర్చు చేస్తామంటోంది ప్రభుత్వం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తున్న రుణమాఫీ హామీలు అర్థరహితమని నవీన్‌ పట్నాయక్‌ అంటున్నారు. రుణమాఫీ కన్నా తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకంతోనే రైతులకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందనీ, అధిక శాతం మందికి ప్రయోజనాలు చేకూరుతాయని అంటున్నారు. ఒడిశాలో దాదాపు 32 లక్షల మంది రైతులుంటే కేవలం 20 లక్షల మందే పంటరుణాలను తీసుకున్నారనీ, రుణమాఫీ ప్రకటిస్తే మిగిలిన 12 లక్షల మందికి ప్రయోజనం ఉండదనీ, తమ కలియా పథకం మాత్రం 30 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తుందని పట్నాయక్‌ చెబుతున్నారు. ఈ పథకం తెలంగాణ రైతుబంధుకి భూ విస్తీర్ణంతో నిమిత్తం లేకుండా వ్యవసాయం చేసే ప్రతీ కుటుంబానికి ఒక్కో సీజన్‌లో (ఖరీఫ్, రబీ) పెట్టుబడి కోసం రూ.5,000 ఆర్థిక సాయం. కౌలు రైతులు కూడా ఈ మొత్తం పొందడానికి అర్హులే. తెలంగాణలో ఏడాదికి ఎకరానికి ఇప్పటివరకూ రూ.8 వేలు ఇస్తుండగా 2018 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతుబంధు సాయం రూ.10వేలు కానుంది.  తెలంగాణకంటే కాస్త భిన్నంగా కౌలురైతులకు నవీన్ పట్నాయక్ ఈ పథకం అమలుచేయాలని నిర్ణయించడం విశేషంగా చెబుతున్నారు. 

ఒడిశాలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు గొర్రెలు, కోళ్లు, బాతులు, తేనెటీగల పెంపకం దార్లకు, చేపలు పట్టే వారికి అవసరమైన సామగ్రిని సమకూర్చుకునేందుకు రూ. 12,500 ఆర్థిక సాయం చేయనున్నారు. భూమి లేని వారే ఇందుకు అర్హులు. అచ్చం ఇలాంటిదే గొర్రెల పంపిణీ పథకం, చెరువుల్లో చేపల పెంపకం తెలంగాణలోనూ అమలవుతోంది. వృద్ధాప్యం, అంగవైకల్యం, రోగాలు తదితర కారణాల వల్ల వ్యవసాయం చేయలేకపోతున్న రైతులకు ఒక్కో ఇంటికి ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం చేయనున్నారు. భూమి ఉన్నా లేకున్నా అందరికీ రూ. 2 లక్షల జీవిత బీమా, మరో రూ. 2 లక్షల ప్రమాద బీమా అమలు చేయనున్నారు. తెలంగాణలో రైతు బీమా ఇప్పటికే అమలులో ఉండడం విశేషం. రైతులు తీసుకునే రుణాల్లో రూ. 50 వేల వరకు రుణాలపై వడ్డీ  రద్దుచేశారు. తెలంగాణలో అమలవుతున్న అనేక పథకాలను ఇతర రాష్ట్రాలు మోడల్‌గా తీసుకుంటున్నాయి అనడానికి ఒడిశా సీఎం నిర్ణయాలే నిదర్శనంగా చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో నవీన్ పట్నాయక్‌కు రైతుబంధు ప్లస్ కానుందంటున్నారు. మరోవైపు జార్ఖండ్‌లోనూ ఓ పథకాన్ని రైతుల కోసం సీఎం రఘుబర్‌దాస్‌ ప్రారంభించారు. ఈ పథకం కింద రూ. 2,250 కోట్లను ఖర్చు చేస్తారు. దీని ద్వారా 22.76 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులు లబ్ధి పొందనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు ప్రభుత్వం ఏడాదికి రూ. 5,000 ఆర్థిక సాయం అందజేయనుంది. గరిష్టంగా ఐదెకరాల వరకు భూమి ఉన్న రైతులు ఈ సాయం పొందేందుకు అర్హులుగా నిర్ణయించారు. 

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   2 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   10 hours ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   10 hours ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   20 hours ago


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle