newssting
BITING NEWS :
* వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని నరేంద్రమోదీ. * ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ మాదిరే‌ రష్యా‌ వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి ప్రయోగాలలో కూడా స్వల్ప దుష్పలితాలు. * అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి. 14 మందికి గాయాలు. * షెడ్యూల్‌ కంటే ముందుగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశం. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచన చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మొగ్గుచూపిన మెజారిటీ సభ్యులు * సాంప్రదాయ, శాస్త్రోక్తంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. * ఏపీలో నేటి నుండి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు. ఈ నెల 26 వరకు.. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరగనున్న పరీక్షలు. ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి. తాజాగా మరో 1065 కేసులు నమోదు. ఒంగోలులో అత్యధికంగా 220 కేసులు నమోదు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు * తెలంగాణలో సోమవారం నుండి ప్రారంభం కానున్న పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు. అన్ని స్కూళ్లలో విధులకు హాజరు కానున్న సగం మంది టీచర్లు. రోజు విడిచి రోజు విధులకు హాజరు కానున్న ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే పాఠశాలకు విద్యార్థులు * ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు అతిభారీ వర్షాలు. పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, వంకలు. కుండపోత వర్షాలకు భారీగా నీటమునిగిన పంటలు.

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

01-08-202001-08-2020 07:48:06 IST
2020-08-01T02:18:06.512Z01-08-2020 2020-08-01T02:18:03.022Z - - 21-09-2020

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక్కరోజులో రికార్డ్‌ స్థాయిలో 55,078 పాజిటివ్‌ కేసులు నమోదైన భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 16 లక్షల సంఖ్యను దాటేశాయి. ఒక్క జూలైలో 21 రోజుల్లోనే కరోనా కేసులు రెట్టింపయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 55,078 కేసులు బయటపడ్డాయి. తాజాగా 779 మంది కరోనా బాధితులు మరణించారు. భారత్‌లో మొత్తం పాజిటివ్‌ కేసులు 16,38,870కి, మరణాలు 35,747కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇప్పటివరకు 10,57,805 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. ప్రస్తుతం 5,45,318 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 64.54 శాతం కాగా మరణాల రేటు 2.18 శాతంగా ఉంది.

31 రోజుల్లో రెట్టింపైన మరణాలు.. జూలైలోనే 18 వేలమంది మృతి

దేశంలో కరోనా మరణాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. వైర్‌సతో తొలి మృతి సంభవించిన మార్చి నెల నుంచి జూన్‌ వరకు 17,400 మంది చనిపోగా, ఒక్క జూలై నెలలోనే వైర్‌సతో 18,347 మంది మృతి చెందారు. అంటే.. రెట్టింపును మించి నమోదయ్యాయి. దీంతో ప్రపంచ జాబితాలో భారత్‌ (35,747).. ఇటలీ (35,132)ని మించి ఐదో స్థానానికి చేరింది. కాగా, శుక్రవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 55,078 మందికి వైరస్‌ సోకిందని, 779 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

వరుసగా రెండో రోజూ దేశంలో 50 వేలపైగా కేసులు రావడం గమనార్హం. ఇదే సమయంలో మొత్తం కేసుల సంఖ్య 16 లక్షలు దాటింది. 10,57,805 మంది కోలుకున్నారని, 5,45,318 మంది చికిత్స పొందుతున్నారని కేంద్రం వెల్లడించింది. దేశంలో ఒక్కరోజులోనే ఆరులక్షల పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు. గురువారం ఒక్కరోజే 6,42,588 కేసులను దేశంలో పరీక్షించారు

కరోనా మృతుల్లో 41 శాతం మహారాష్ట్రమే..

దేశంలో వైరస్‌ కేంద్రంగా ఉన్న మహారాష్ట్రలో మరణాల 15 వేలు దాటాయి. దేశంలో మొత్తం కరోనా మృతుల్లో 41 శాతం ఈ రాష్ట్రానివే. ఢిల్లీ, కర్ణాటకల్లో దాదాపు 4 వేల మంది చనిపోయారు. గుజరాత్‌ (2,418), కర్ణాటక (2,230)ల్లో రెండు వేల మందిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌(1,630), పశ్చిమ బెంగాల్‌(1,536), ఆంధ్రప్రదేశ్‌(1,281)లో వెయ్యికిపైగా మరణాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు మహారాష్ట్రలో మరోసారి 10,320 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 1,195 కేసులు వచ్చాయి.

పరిస్థితి తీవ్రత తగ్గడంతో పాటు అన్‌లాక్‌-3లో భాగంగా హోటళ్లు, వారపు మార్కెట్‌లకు అనుమతివ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ తిరస్కరించారు. ఢిల్లీలో శనివారం నుంచి రెండో సీరో సర్వే ప్రారంభం కానుంది. కాగా, తమిళనాడులో కరోనాతో 97 మంది మరణించారు. మొత్తం కేసులు 2,45,794కి చేరాయి. కాగా ఆదివారాల్లో విధిస్తున్న సంపూర్ణ లాక్‌డౌన్‌ను కర్ణాటక ఎత్తివేసింది. రాష్ట్రంలో మొత్తం కేసులు 1,24,115కి చేరాయి. తాజాగా 84 మంది మృతితో మొత్తం మృతుల సంఖ్య 2,314కి చేరింది.

అయితే దేశంలో కరోనా మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని.. ప్రస్తుతం 2.18 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. కేవలం 0.28 మంది మాత్రమే వెంటిలేటర్‌పై ఉన్నారని పేర్కొన్నారు. యాక్టివ్‌ కేసుల్లో 1.61 శాతం మందికే ఐసీయూ చికిత్స, 2.32 శాతం మందికే ఆక్సిజన్‌ అవసరం ఉందని తెలిపారు.

కరోనా మహమ్మారిపై పోరాటంలో ముందంజలో నిలుస్తున్న వైద్యులకు, ఆరోగ్య కార్యకర్తలకు కొన్ని రాష్ట్రాల్లో సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో తమ ఆదేశాలను పాటించకపోవడం ఏమిటని ప్రశ్నించింది. ఏమాత్రం ఆలస్యం లేకుండా వైద్యులకు సకాలంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

దేశ సినీ పరిశ్రమని టెర్రరిజమ్‌ల నుంచి కాపాడాలి: కంగనా

దేశ సినీ పరిశ్రమని టెర్రరిజమ్‌ల నుంచి కాపాడాలి: కంగనా

   18 hours ago


పుస్తకాలే లేవు.. ఆన్‌లైన్ క్లాసులపై.. తల్లిదండ్రుల తీవ్ర ఆవేదన

పుస్తకాలే లేవు.. ఆన్‌లైన్ క్లాసులపై.. తల్లిదండ్రుల తీవ్ర ఆవేదన

   20 hours ago


పాకిస్తాన్, చైనా.. భారత సహనానికి పరీక్ష.. !

పాకిస్తాన్, చైనా.. భారత సహనానికి పరీక్ష.. !

   21 hours ago


చైనాతో చర్చలు సరే.. మరి పాకిస్తాన్ తో.. ఫరూక్ వ్యాఖ్యలు

చైనాతో చర్చలు సరే.. మరి పాకిస్తాన్ తో.. ఫరూక్ వ్యాఖ్యలు

   21 hours ago


ఆ కాలువ నిర్మాణం పిరమిడ్స్, తాజ్‌మహల్‌ కంటే గొప్ప కృషే... ఆనంద్ మహీంద్రా

ఆ కాలువ నిర్మాణం పిరమిడ్స్, తాజ్‌మహల్‌ కంటే గొప్ప కృషే... ఆనంద్ మహీంద్రా

   a day ago


పెరుగుతున్న నిరుద్యోగం.. అరకోటికి పైగా ఉద్యోగాలు హుష్!

పెరుగుతున్న నిరుద్యోగం.. అరకోటికి పైగా ఉద్యోగాలు హుష్!

   19-09-2020


ఉల్లి ఎగుమతుల నిషేధం ప్రయోజనం ఎవరికి?

ఉల్లి ఎగుమతుల నిషేధం ప్రయోజనం ఎవరికి?

   19-09-2020


అల్ ఖైదా కుట్ర భగ్నం.. అంతర్రాష్ట్ర ఉగ్రవాదులు అరెస్ట్

అల్ ఖైదా కుట్ర భగ్నం.. అంతర్రాష్ట్ర ఉగ్రవాదులు అరెస్ట్

   19-09-2020


ఆ ఏడు దేశాలకే 88 శాతం వ్యాక్సిన్ డోసులు.. గ్లోబల్ నివేదిక

ఆ ఏడు దేశాలకే 88 శాతం వ్యాక్సిన్ డోసులు.. గ్లోబల్ నివేదిక

   19-09-2020


రైతుల దశ మారుతుంది.. వ్యవసాయ బిల్లుల ఆమోదంపై ప్రధాని మోదీ

రైతుల దశ మారుతుంది.. వ్యవసాయ బిల్లుల ఆమోదంపై ప్రధాని మోదీ

   18-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle