newssting
BITING NEWS :
*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన* Ap గవర్నర్‌ను కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం, కార్మికుల సమస్యలపై చర్చ*ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై సీఎం జగన్‌ వ్యాఖ్యలు ఖండిస్తున్నా..కన్నా లక్ష్మీనారాయణ *శివసేన గడువును తిరస్కరించిన గవర్నర్‌...మూడో పెద్దపార్టీగా ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానం*కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని కలిసిన ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి *ఏపీ కొత్త సీఎస్ గా నీలం సహాని...కేంద్రం నుంచి నీలం సహాని రిలీవ్*మహారాష్ట్ర: నేడు ఎమ్మెల్యేలతో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ భేటీ.. శివసేనకు మద్దతిచ్చే అంశంపై చర్చ*తెలంగాణలో 39వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు గవర్నర్‌ను కలవనున్న జేఏసీ నేతలు*గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం..జనం మీదకు దూసుకెళ్లిన లారీ... ముగ్గురి మృతి..ఐదుగురికి గాయాలు

కేంద్ర బడ్జెట్‌పై ఎవరేమన్నారంటే...?

05-07-201905-07-2019 15:51:29 IST
Updated On 06-07-2019 15:32:03 ISTUpdated On 06-07-20192019-07-05T10:21:29.130Z05-07-2019 2019-07-05T10:12:19.459Z - 2019-07-06T10:02:03.002Z - 06-07-2019

 కేంద్ర బడ్జెట్‌పై ఎవరేమన్నారంటే...?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. బడ్జెట్లో అందరికీ న్యాయం చేశామని దేశభద్రత, ఆర్థిక సుస్థిరత తమకు ముఖ్యం అన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టాక అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ సమృద్ధి, ప్రజల స్వావలంబన దిశగా ఈ బడ్జెట్‌ కృషి చేస్తుందని ఆయన కొనియాడారు.

ఈ బడ్జెట్‌ ద్వారా పేదలకు మంచి జరుగుతుందని, యువత మంచి భవిష్యత్తు లభిస్తుందన్నారు. నవభారత నిర్మాణం కోసం ఈ బడ్జెట్‌ రోడ్డుమ్యాపు రూపొందించిందని, నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా దేశ వ్యవసాయ ముఖచిత్రాన్ని ఇది మార్చబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తు పట్ల ఆశావాదంతో ఈ బడ్జెట్‌ రూపొందిందని పేర్కొన్నారు.    

మరోవైపు  వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కేంద్ర బడ్జెట్‌పై పెదవి విరిచారు. బడ్జెట్‌ నిరాశపరిచిందని, ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని ఆయన అన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించిందని, బడ్జెట్‌లో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదన్నారు.

విశాఖ, విజయవాడ మెట్రో రైలుకు నిధుల విషయంలోనూ అన్యాయం జరిగిందని, బడ్జెట్‌లో ఏపీకి ఒరిగింది సున్నా అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారనే దానిపై స్పష్టత లేదని ఆయన అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఏ పోరాటానికైనా తాము సిద్ధమన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్‌లో ప్రశ్నిస్తామని విజయసాయి రెడ్డి తెలిపారు.

పెట్రోల్, డీజిల్ పై సర్ చార్జి వేయడం దారుణం అన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. కేంద్రం నిర్ణయం వల్ల సామాన్యులపై భారం పడుతుందన్నారు. సీపీఐ నేత డాక్టర్ రాజా బడ్జెట్ పై అసహనం వ్యక్తంచేశారు. పెట్టుబడుల ఉపసంహరణ విధానాలు ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా ఉన్నాయన్నారు రాజా. ఇటు సీతారాం ఏచూరి కూడా బడ్జెట్ నిరుత్సాహం కలిగించిందన్నారు. 

ఈ బడ్జెట్ నిరుత్సాహ పరిచిందన్నారు ఎంపీ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడానికి అంతగా ప్రోత్సాహకాలు లేవన్నారు ఉత్తమ్.  తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు టీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వరరావు. సామాన్యులకు ఈ బడ్జెట్ ప్రయోజనకరంగా ఉందని ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్ అన్నారు. ఒక మహిళ ఆర్థికమంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందన్నారు.

రామాలయ నిర్మాణ బాధ్యత ఏ ట్రస్టుది? కొత్త గొడవలు ప్రారంభం

రామాలయ నిర్మాణ బాధ్యత ఏ ట్రస్టుది? కొత్త గొడవలు ప్రారంభం

   2 hours ago


మహారాష్ట్రలో ఉత్కంఠకు తెర...శివసేన ఆశలు గల్లంతేనా?

మహారాష్ట్రలో ఉత్కంఠకు తెర...శివసేన ఆశలు గల్లంతేనా?

   5 hours ago


పిల్లల లైంగిక వేధింపులలో ట్విట్టర్‌దే ప్రధాన పాత్ర: ఐడబ్ల్యూఎఫ్ నివేదిక

పిల్లల లైంగిక వేధింపులలో ట్విట్టర్‌దే ప్రధాన పాత్ర: ఐడబ్ల్యూఎఫ్ నివేదిక

   9 hours ago


రామమందిరం ట్రస్ట్ షురూ.. హోంశాఖ ఏర్పాట్లు

రామమందిరం ట్రస్ట్ షురూ.. హోంశాఖ ఏర్పాట్లు

   10 hours ago


పేదలకు అన్యాయం చేయొద్దు..  పోలీసులకు సీఎం హితవు

పేదలకు అన్యాయం చేయొద్దు.. పోలీసులకు సీఎం హితవు

   10 hours ago


బుల్ బుల్ దెబ్బకు వణికిన బెంగాల్.. ఏడుగురు బలి

బుల్ బుల్ దెబ్బకు వణికిన బెంగాల్.. ఏడుగురు బలి

   11-11-2019


అమెరికన్ ఎన్నారైలకు పెద్ద ఊరట.. హెచ్4 వీసాదారులు పనిచేసుకోవచ్చు

అమెరికన్ ఎన్నారైలకు పెద్ద ఊరట.. హెచ్4 వీసాదారులు పనిచేసుకోవచ్చు

   11-11-2019


సోషల్ మీడియాపై సెన్సార్‌షిప్‌తో ఇంటర్నెట్‌‌ అంతం ఖాయం

సోషల్ మీడియాపై సెన్సార్‌షిప్‌తో ఇంటర్నెట్‌‌ అంతం ఖాయం

   11-11-2019


అయోధ్యపై ఓవైసీ కీలక వ్యాఖ్యలు..అలా అయితే అద్వానీపై విచారణ ఎందుకు?

అయోధ్యపై ఓవైసీ కీలక వ్యాఖ్యలు..అలా అయితే అద్వానీపై విచారణ ఎందుకు?

   11-11-2019


క్లైమాక్స్ లో మహా పాలిటిక్స్ ..హోటల్లో శివసేన ఎమ్మెల్యేలు

క్లైమాక్స్ లో మహా పాలిటిక్స్ ..హోటల్లో శివసేన ఎమ్మెల్యేలు

   10-11-2019


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle