newssting
BITING NEWS :
* నేటి నుంచి మే 31 వరకు మార్క్‌ ఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు .. అన్ని జిల్లాల్లో పసుపు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు *మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 6, 875 చెల్లించాలని ఏపీ సర్కార్ ఆదేశం *నేడు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్ * వెలిగొండ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్న సీఎం జగన్‌ ..పాల్గొననున్న మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఇంజినీరింగ్‌ అధికారులు *ఇవాళ్టితో 65వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ఆందోళన.. ఫాలో అప్‌*జనసేన అధినేత పవన్ ఇవాళ ఢిల్లీ పర్యటన.. సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించనున్న పవన్ *ఇవాళ వేములవాడలో మంత్రి కేటీఆర్‌ పర్యటన *భారతీయుడు -2 సినిమా షూటింగ్‌లో అపశృతి .. క్రేన్ కూలి ముగ్గురి మృతి * మహారాష్ట్రలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం..లారీ-కారు ఢీ. ఆరుగురి మృతి

కుమార సంకటం... యడ్యూరప్ప ఆరాటం

08-07-201908-07-2019 08:24:58 IST
2019-07-08T02:54:58.020Z08-07-2019 2019-07-08T02:54:23.761Z - - 21-02-2020

 కుమార సంకటం... యడ్యూరప్ప ఆరాటం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్ణాటక రాజకీయాలు రోజురోజుకీ ఉత్కంఠను కలిగిస్తున్నాయి. 13 మంది కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాతో కన్నడ డ్రామా ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలతో కాంగ్రెస్, జేడీఎస్‌ సంకీర్ణంలో మాత్రం బీటలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక ఎవరున్నాదనే దానిపై ఆసక్తికరమయిన అంశాలు బయటకు వస్తున్నాయి.

అమెరికా పర్యటనలో ఉన్న సీఎం కుమారస్వామి హుటాహుటిన బెంగళూరుకు వచ్చేశారు.మాజీ సీఎం, కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య కావాలనే తమ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తున్నారని.. ఆయన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎంగా ఒప్పుకోమంటూ మాజీ ప్రధాని, జేడీఎస్‌ చీఫ్‌ హెచ్‌డీ దేవేగౌడ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో కలకలం రేపుతున్నాయి.

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌–జేడీఎస్‌ విభేదాలను క్యాష్ చేసుకునేందుకు బీజేపీ సిద్ధమయింది. తాజా పరిణామాలను ఆ పార్టీ నిశితంగా గమనిస్తోంది. అవసరమైతే రాష్ట్రపతిపాలన పెట్టయినా పరిస్థితిని తన నియంత్రణలోకి తెచ్చుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి ఢోకా లేదని చెబుతున్నా, బీజేపీ మార్క్ పాలిటిక్స్ ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. 

పార్లమెంటు ఎన్నికల తర్వాత నెలకొన్న పరిస్థితుల వెనక మాజీ సీఎం సిద్దరామయ్య హస్తం ఉందని జేడీఎస్‌ ఆరోపిస్తోంది. రాజీనామాలు చేసిన కాంగ్రెస్, జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు సిద్దు మద్దతు ఖచ్చితంగా ఉందని కుమారస్వామి సన్నిహితులు ఆరోపిస్తున్నారు.

ఎందుకంటే సిద్ధరామయ్యను సీఎంని చేస్తే తమ రాజీనామాలు వెనక్కి తీసుకుంటామని కొంతమంది అనడాన్ని జేడీఎస్ వాదనలకు బలం చేకూరుస్తోంది.

అటు కాంగ్రెస్‌ కూడా ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నం చేస్తూనే.. సిద్దరామయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించే అవకాశాలున్నాయి. అయితే దీనికి జేడీఎస్‌ కచ్చితంగా ఒప్పుకునే అవకాశం లేదు.

అయితే.. ఇదంతా మంగళవారం సభకు రానున్న స్పీకర్‌.. ఈ 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తారా? లేదా అన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో సిద్దు అభ్యర్థిత్వానికే కాంగ్రెస్‌ జై కొడితే.. జేడీఎస్‌ ఏకపక్షంగా బీజేపీకి మద్దతిచ్చే అవకాశాలూ లేకపోలేదు.  

ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల రాజీనామాలపై సీఎం కుమారస్వామి, సిద్ధరామయ్య సమాధానం చెప్పాలని బీజేపీ నేత యడ్యూరప్ప డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై యడ్యూరప్ప స్పందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలంఉందన్న ఆయన… మారుతున్న రాజకీయ పరిణామాల ఆధారంగా తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. 

జార్జ్ ఫెర్నాండెజ్ సహాయాన్ని మర్చిపోలేం..  చైనా కృతజ్ఞతలు

జార్జ్ ఫెర్నాండెజ్ సహాయాన్ని మర్చిపోలేం.. చైనా కృతజ్ఞతలు

   12 hours ago


నిర్భయకు న్యాయం దక్కకపోతే ఎవరికీ దక్కనట్లే : ఆశా దేవి

నిర్భయకు న్యాయం దక్కకపోతే ఎవరికీ దక్కనట్లే : ఆశా దేవి

   16 hours ago


ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నివేదిక

ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నివేదిక

   18 hours ago


ట్రంప్ టూర్.. పరువు కోసం ఆరాటం.. పేదల జీవితాలతో చెలగాటం

ట్రంప్ టూర్.. పరువు కోసం ఆరాటం.. పేదల జీవితాలతో చెలగాటం

   19 hours ago


విద్యుత్ కొనుగోలు ఒప్పందాల అమలుకు ట్రిబ్యునల్?

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల అమలుకు ట్రిబ్యునల్?

   20 hours ago


స్టూడెంట్ వీసాలు, ట్రేడ్ డీల్‌పై ట్రంప్ షాక్

స్టూడెంట్ వీసాలు, ట్రేడ్ డీల్‌పై ట్రంప్ షాక్

   19-02-2020


గూగుల్ ఉచిత వై-ఫై ఎత్తివేతకు ఇదా కారణం?

గూగుల్ ఉచిత వై-ఫై ఎత్తివేతకు ఇదా కారణం?

   19-02-2020


ఉగ్రవాద నిరోధక చర్యలపై పాక్ వైఫల్యం కొనసాగింపు

ఉగ్రవాద నిరోధక చర్యలపై పాక్ వైఫల్యం కొనసాగింపు

   19-02-2020


నిరసన తెలుపండి.. కానీ ఇతరుల హక్కు మాటేంటి: సుప్రీం వ్యాఖ్య

నిరసన తెలుపండి.. కానీ ఇతరుల హక్కు మాటేంటి: సుప్రీం వ్యాఖ్య

   18-02-2020


ఆర్మీ అధికారిణులకూ శాశ్వత కమిషన్ : సుప్రీం చారిత్రక తీర్పు

ఆర్మీ అధికారిణులకూ శాశ్వత కమిషన్ : సుప్రీం చారిత్రక తీర్పు

   18-02-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle