newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

కాంగ్రెస్‌కు హార్థిక్ పెద్ద దిక్కయ్యాడా?

22-04-201922-04-2019 14:37:45 IST
Updated On 22-04-2019 14:38:02 ISTUpdated On 22-04-20192019-04-22T09:07:45.272Z22-04-2019 2019-04-22T09:07:43.398Z - 2019-04-22T09:08:02.083Z - 22-04-2019

కాంగ్రెస్‌కు  హార్థిక్ పెద్ద దిక్కయ్యాడా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గుజ‌రాత్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పెద్ద దిక్కు హార్ధిక్ ప‌టేల్ అంటున్నారు స్థానిక కాంగ్రెస్ నేత‌లు. పార్టీ నుంచి ఒక్కరు కూడా స్టార్ క్యాంపెయినర్ లేక పోవ‌డంతో హార్థిక్ ప‌టేల్ స‌భ‌ల కోసం జనం ఎదురుచూశారు. హెలికాప్టర్ అందుబాటులోకి తెచ్చిన కాంగ్రెస్ అధిష్టానం వీలైనన్ని ఎక్కువ బ‌హిరంగ స‌భ‌ల్లో హ‌ర్థిక్ ప‌టేల్ పాల్గొనేలా చేశారు. దాదాపు 30 బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొన్న హార్థిక్ ప‌టేల్, మోడీ మీద రెచ్చిపోయి మాట్లాడ‌టం కాంగ్రెస్ నేత‌ల‌కు బాగా నచ్చింద‌ట‌. 

రైతు స‌మ‌స్యలు, పెద్దనోట్ల ర‌ద్దు త‌దిత‌ర అంశాల మీద ప‌టేల్ చేసిన ప్రసంగాల‌తో త‌మ‌కు ఓట్ల వ‌ర్షం కురుస్తుంద‌నేది కాంగ్రెస్ నేత‌ల ఆలోచ‌న‌గా తెలుస్తోంది. ఈ స్థాయిలో మాట్లాడే నేతలు కాంగ్రెస్ పార్టీకి లేకపోవడం పెద్ద లోటే అంటున్నారు. మహామహులైన కాంగ్రెస్ నేతలు ఒక్క యువనేతపైనే ఆధారపడడం బీజేపీకి బాగా కలిసి వచ్చే అంశం అంటున్నారు. 

ఇక ద‌ళితుల ఓట్లు కూడా త‌మ‌కు వ‌స్తాయ‌నీ,  ఈ ఎన్నిక‌ల్లో గుజ‌రాత్ లోని మొత్తం 26 ఎంపీ సీట్లలో వీలైన‌న్ని ఎక్కువ స్థానాల్లో గెలుచుకుంటామ‌ని కాంగ్రెస్ నేత‌లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్రచారం త‌ర్వాత హార్ధిక్ ప‌టేల్‌ను ఉత్తర‌ప్రదేశ్, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో కూడా ప్రచారానికి పంపాల‌ని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకున‌ట్లు తెలుస్తోంది. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హార్థిక్ ప‌టేల్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ప్రచారం చేసినా, ఆ పార్టీకి అధికారం ద‌క్కలేదు. 

దీంతో ఈ ఎన్నిక‌ల్లో ఏ మేర‌కు సీట్లు వ‌స్తాయ‌న్నది కాంగ్రెస్ పార్టీలో మ‌రోవ‌ర్గం ప్రశ్నిస్తోంది. ఎందుకంటే 2009 పార్లమెంట్ ఎన్నిక‌ల్లో గుజ‌రాత్ లోని మొత్తం 26 సీట్లలో బీజేపీ 14, కాంగ్రెస్ పార్టీ 12 సీట్లు గెల్చుకుంది. కానీ 2014 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మొత్తం 26 సీట్ల‌ను బీజేపీ గెల్చుకుంది. అందుకే ఈసారి కొన్నింటిలో అయినా గెల్చి, ప‌రువు ద‌క్కించుకోడానికి కాంగ్రెస్ పార్టీ తాప‌త్రయప‌డింది. హార్థిక్ కాంగ్రెస్‌కు ప్లస్ అవుతాడో లేదో మంగళవారం జరిగే ఎన్నికల్లో తేలనుంది. 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   7 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   10 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   a day ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle