newssting
BITING NEWS :
*కేంద్ర కేబినెట్‌ సమావేశం..లాక్‌డౌన్లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై, చైనాతో సరిహద్దు వివాదం సహా కీలక అంశాలపై చర్చ*ఈనెల ఐదున ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం*తెలంగాణా లో ఇవాళ 199 కేసులు నమోదు.. గ్రేటర్లో పెరుగుతున్న కేసులతో ఆందోళన ..మొత్తం 2698 కేసులు నమోదు*భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 8,392కొత్త కరోనా కేసులు నమోదు, 1,90,535కిచేరిన పాజిటివ్‌ కేసులు, ఒకే రోజు 230 మంది మృతి.. ఇప్పటి వరకు మృతిచెందినవారు 5,394 మంది*అరేబియా సముద్రంలో అల్పపీడనం..అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం...తెలంగాణలో నేడు,రేపు వర్షాలు*ఏపీలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ..రాష్ట్రవ్యాప్తంగా 58.22లక్షల మందికి పెన్షన్‌..రూ.1,421.20 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్‌ *అంతరాష్ట్ర బస్సుల సర్వీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ సర్కార్. ఆర్టీసీ బస్సులు కేవలం సరిహద్దుల వరకే. పొరుగు రాష్ట్రాల బస్సులను కూడా అనుమతించని తెలంగాణ ప్రభుత్వం *ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 76 కరోనా కేసులు.. 3118 కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసులు, ఏపీలో ఇప్పటి వరకు 64 మంది మృతి*ఏపీ: టీడీపీని వీడే ఆలోచన లేదు, కావాలనే కొందరు నాపై తప్పుడు ప్రచారం చేశారు-పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

కరోనా విరాళాలకు చిన్నదీ, పెద్దదీ అనే తేడాలేదు.. ప్రధాని ఉద్వేగం

29-03-202029-03-2020 13:16:43 IST
2020-03-29T07:46:43.742Z29-03-2020 2020-03-29T07:46:41.650Z - - 01-06-2020

కరోనా విరాళాలకు చిన్నదీ, పెద్దదీ అనే తేడాలేదు.. ప్రధాని ఉద్వేగం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వ్యాధి నివారణ కోసం దేశప్రజలు ఇస్తున్న విరాళాలకు చిన్న మొత్తాలు లేక పెద్ద మొత్తాలు అనే తేడా ఉండదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. శనివార్ కరోనావైరస్‌పై పోరాటానికి సహాయ నిధి గురించి ప్రధానమంత్రి ప్రకటించగానే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ 25 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. దీంతో స్పందించిన మోదీ గొప్ప పని చేశారు అక్షయ్.. ఆరోగ్యకరమైన భారత్ కోసం విరాళాలను కొనసాగిద్దాం అంటూ ప్రధాని కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. 

అయితే ఒక వ్యక్తి కేవలం రూ.501 రూపాయలను మాత్రమే పంపగలుగుతున్నానని, అయితే ఇది చాలా చిన్నమొత్తమే కావచ్చని చెబుతూ ట్వీట్ చేశాడు. దానికి స్పందించిన ప్రధాని విరాళాల్లో చిన్నదీ, పెద్దదీ అంటూ ఉండబోదని దేశసహాయం కోసం చేసే విరాళం ఎంతైనా అది సహాయమేనని రీట్వీట్ చేశారు. ప్రతి ఒక్క సహాయమూ విలువైందే. కోవిడ్-19ని ఓడించడానికి మనం చేస్తున్న సామూహిక తీర్మానాన్ని అది ప్రదర్శిస్తుందని మోదీ చెప్పారు.

అలాగే ఒక విద్యార్థి తన వంతు సహాయంగా వెయ్యి రూపాయలు పంపినందుకు కూడా ప్రధాని ఆ విద్యార్థికి కృతజ్ఞతలు తెలిపారు. దేశ భవిష్యత్తు అయిన యువతరం జాతి భవితవ్యానికి ఇలాంటి విరాళాల ద్వారా హామీ ఇస్తోందని ప్రధాని ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. అలాగే క్రికెటర్ సురేష్ రైనా కూడా పీఎమ్ కేర్స్ నిధికి 31 లక్షలు, ఉత్తరప్రదేశ్ సీఎం విపత్తు సహాయ నిధికి 21 లక్షలు అంటే మొత్తం 52 లక్షల రూపాయలు ప్రకటించడాన్ని కూడా ప్రధాని అభినందించారు.  ఇది గొప్ప సహాయం రాణా అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. 

ప్రధానమంత్రి మోదీ కరోనా వైరస్‌పై పోరాటానికి శనివారం పీఎం కేర్‌ను ప్రకటించగానే బహుశా తొలి విరాళం ప్రకటించింది బాలీవుడ్ హీరో అక్షయ్ కుమారే కావచ్చు. 25 కోట్ల రూపాయలను తనవంతుగా ప్రకటించిన తర్వాత అక్షయం ట్వీట్ చేస్తూ ప్రజల జీవితాలను కాపాడాల్సిన సమయం ఇదే. ప్రజలకు అవసరమైన ప్రతిదీ మనం ఇవ్వాల్సిందే. నా పొదుపు మొత్తాల నుంచి 25 కోట్ల రూపాయలను PM-CARES ఫండ్‌కు ఇస్తున్నాను అని అక్షయ్ ప్రకటించి సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు.

కరోనా వైరస్‌కి వ్యతిరేకంగా పోరాడటానికి అలాగే ఇతర విపత్తు పరిస్థితులపై పోరాడటానికి ప్రజలు విరాళాలు ఇవ్వాల్సిందిగా పిలుపునిస్తూ ప్రధాని నరేంద్రమోదీ పీఎమ్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ (PM-CARES Fund)ని ప్రకటించారు. దేశంలో అన్ని రంగాలకు చెందిన ప్రజలు కోవిడ్-19పై భారత్ చేస్తున్న యుద్ధానికి సహాయంగా విరాళాలను అందిస్తామంటూ చెబుతున్నారని ప్రధాని తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఈ స్ఫూర్తితోనే పీఎమ్ కేర్స్ ఫండ్‌ని ఏర్పరుస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన భారత్‌ను సృష్టించడంలో భాగంగా ఇది చాలా దూరం ప్రయాణిస్తుందని ప్రధాని చెప్పారు. బారతీయులందరూ దయచేసి పీఎమ్-కేర్స్ పండ్‌కి సహాయం చేయాలని మోదీ పిలుపునిచ్చారు.

 కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఆత్మనిర్భర భారత్‌కు రోడ్ మ్యాప్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఆత్మనిర్భర భారత్‌కు రోడ్ మ్యాప్

   5 minutes ago


అమెరికాలో ఆగని అల్లర్లు.. 12 నగరాల్లో కర్ఫ్యూ.. వైరస్ విజృంభణ

అమెరికాలో ఆగని అల్లర్లు.. 12 నగరాల్లో కర్ఫ్యూ.. వైరస్ విజృంభణ

   4 hours ago


చైనా ఉత్పత్తులు బహిష్కరించండి.. భారత్‌లో ఆన్‌లైన్‌ యుద్ధం ప్రారంభం

చైనా ఉత్పత్తులు బహిష్కరించండి.. భారత్‌లో ఆన్‌లైన్‌ యుద్ధం ప్రారంభం

   10 hours ago


కరోనా కేసుల్లో భారత్‌కి 7వ స్థానం.. ఒక్కరోజులో 8,380 కేసుల నమోదు

కరోనా కేసుల్లో భారత్‌కి 7వ స్థానం.. ఒక్కరోజులో 8,380 కేసుల నమోదు

   10 hours ago


లాక్ డౌన్ నియంత్రణ ఇక చాలు.. కరోనాకు భయపడం అంటున్న అమెరికన్లు

లాక్ డౌన్ నియంత్రణ ఇక చాలు.. కరోనాకు భయపడం అంటున్న అమెరికన్లు

   31-05-2020


భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగే రోజు సాకారం.. దేశ ప్రజలకు మోదీ లేఖ

భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగే రోజు సాకారం.. దేశ ప్రజలకు మోదీ లేఖ

   31-05-2020


 లాక్ డౌన్ పై రాష్ట్రాలదే నిర్ణయం ..ఆ నగరాలపైనే  ఫోకస్

లాక్ డౌన్ పై రాష్ట్రాలదే నిర్ణయం ..ఆ నగరాలపైనే ఫోకస్

   30-05-2020


ఒక్కరోజే 7,466 కరోనా కేసులు.. కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్?

ఒక్కరోజే 7,466 కరోనా కేసులు.. కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్?

   30-05-2020


ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్‌.. తిప్పికొట్టిన సంస్థ సీఈఓ

ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్‌.. తిప్పికొట్టిన సంస్థ సీఈఓ

   29-05-2020


కరోనా ఆందోళన.. ప్రపంచంలో 9వ స్థానానికి ఇండియా

కరోనా ఆందోళన.. ప్రపంచంలో 9వ స్థానానికి ఇండియా

   29-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle