newssting
BITING NEWS :
* వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని నరేంద్రమోదీ. * ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ మాదిరే‌ రష్యా‌ వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి ప్రయోగాలలో కూడా స్వల్ప దుష్పలితాలు. * అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి. 14 మందికి గాయాలు. * షెడ్యూల్‌ కంటే ముందుగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశం. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచన చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మొగ్గుచూపిన మెజారిటీ సభ్యులు * సాంప్రదాయ, శాస్త్రోక్తంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. * ఏపీలో నేటి నుండి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు. ఈ నెల 26 వరకు.. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరగనున్న పరీక్షలు. ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి. తాజాగా మరో 1065 కేసులు నమోదు. ఒంగోలులో అత్యధికంగా 220 కేసులు నమోదు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు * తెలంగాణలో సోమవారం నుండి ప్రారంభం కానున్న పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు. అన్ని స్కూళ్లలో విధులకు హాజరు కానున్న సగం మంది టీచర్లు. రోజు విడిచి రోజు విధులకు హాజరు కానున్న ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే పాఠశాలకు విద్యార్థులు * ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు అతిభారీ వర్షాలు. పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, వంకలు. కుండపోత వర్షాలకు భారీగా నీటమునిగిన పంటలు.

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

01-08-202001-08-2020 10:59:03 IST
Updated On 01-08-2020 13:51:26 ISTUpdated On 01-08-20202020-08-01T05:29:03.073Z01-08-2020 2020-08-01T05:28:20.939Z - 2020-08-01T08:21:26.679Z - 01-08-2020

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ ను అదుపులోకి తెచ్చేందుకు ఒక్క టీకా సరిపోదని డాక్టర్లు అంటున్నారు. కరోనా నియంత్ర‌ణ‌కు ఒక‌టి క‌న్నా ఎక్కువ టీకాలు అవ‌స‌రమ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 180కిపైగా క‌రోనా వ్యాక్సిన్ల ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇందులో 26 టీకాలు మాన‌వుల‌పై ప్ర‌యోగ ద‌శ‌కు చేరుకున్నాయి. కాగా, వైర‌స్ ప‌లు దేశాల్లో ప‌లు విధాలుగా మార్పులు చెందుతోంది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచవ్యాప్తంగా క‌రోనా నియంత్ర‌ణ‌కు ఒక‌టి క‌న్నా ఎక్కువ టీకాలు అవ‌స‌ర‌మ‌ని అమెరికన్ ఇమ్యునోలజిస్ట్, యు.ఎస్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అధిపతి ఆంథోనీ ఫౌసీ తెలిపారు.

ప్రస్తుతం 4 కంపెనీల వ్యాక్సిన్లు ట్ర‌య‌ల్స్ చివ‌రి ద‌శ‌లో ఉన్న‌ట్లు ఫౌసీ వెల్ల‌డించారు. అవి అమెరికాలోని మోడెర్నా ఇంక్, ఆక్స్‌ఫ‌ర్డ్-ఆస్ట్రాజెనెకా, చైనీస్ కంపెనీ సినోఫార్మ్, చైనీస్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం సినోవాక్ గా తెలుస్తోంది జాన్సన్ అండ్ జాన్సన్ కూడా విరివిగా పరిశోధనలు చేస్తోంది. 

సాధార‌ణంగా ఒక టీకా అభివృద్ధికి సుమారు ప‌దేళ్ళ స‌మ‌యం ప‌డుతుందని, క‌రోనా వ్యాప్తిలోకి వ‌చ్చిన ఏడు నెల‌ల్లోనే వ్యాక్సిన్ ప్ర‌యోగాలు కీల‌క ద‌శ‌కు చేరుకోవడం శుభ పరిణామంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాన‌వుల‌పై ప్ర‌యోగాలు మూడో ద‌శ‌కు చేరుకున్న నేప‌థ్యంలో ఈ ఏడాది చివ‌రిక‌ల్లా క‌రోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశ‌ం వుంది.

ఇదిలా వుంటే బ్రిటన్లో మరో టీకా ప్రయోగం తుది దశకు చేరుకుంది. బ్రిటన్లోని ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తలు మొదటి విడత ప్రయోగంలో భాగంగా కొందరికి వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగలేదు. 300 మందికి పైగా ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. వీరిలో 70 ఏళ్ల పైబడినవారే వున్నారు. ఇది విజయవంతం అయితే అక్టోబరులో వేలమందికి ఇచ్చి పరీక్షిస్తామన్నారు. బ్రిటన్లో గతంలో కంటే ఇన్ఫెక్షన్లు తగ్గాయి. దీంతో మరిన్ని చోట్ల ప్రయోగాలు చేయనున్నారు. ఏది ఏమైనా టీకాలు అందుబాటులోకి వచ్చినా వాటిని వెంటనే అందరికీ అందించడం సాధ్యం కాదు. 

 

దేశ సినీ పరిశ్రమని టెర్రరిజమ్‌ల నుంచి కాపాడాలి: కంగనా

దేశ సినీ పరిశ్రమని టెర్రరిజమ్‌ల నుంచి కాపాడాలి: కంగనా

   17 hours ago


పుస్తకాలే లేవు.. ఆన్‌లైన్ క్లాసులపై.. తల్లిదండ్రుల తీవ్ర ఆవేదన

పుస్తకాలే లేవు.. ఆన్‌లైన్ క్లాసులపై.. తల్లిదండ్రుల తీవ్ర ఆవేదన

   20 hours ago


పాకిస్తాన్, చైనా.. భారత సహనానికి పరీక్ష.. !

పాకిస్తాన్, చైనా.. భారత సహనానికి పరీక్ష.. !

   21 hours ago


చైనాతో చర్చలు సరే.. మరి పాకిస్తాన్ తో.. ఫరూక్ వ్యాఖ్యలు

చైనాతో చర్చలు సరే.. మరి పాకిస్తాన్ తో.. ఫరూక్ వ్యాఖ్యలు

   21 hours ago


ఆ కాలువ నిర్మాణం పిరమిడ్స్, తాజ్‌మహల్‌ కంటే గొప్ప కృషే... ఆనంద్ మహీంద్రా

ఆ కాలువ నిర్మాణం పిరమిడ్స్, తాజ్‌మహల్‌ కంటే గొప్ప కృషే... ఆనంద్ మహీంద్రా

   a day ago


పెరుగుతున్న నిరుద్యోగం.. అరకోటికి పైగా ఉద్యోగాలు హుష్!

పెరుగుతున్న నిరుద్యోగం.. అరకోటికి పైగా ఉద్యోగాలు హుష్!

   19-09-2020


ఉల్లి ఎగుమతుల నిషేధం ప్రయోజనం ఎవరికి?

ఉల్లి ఎగుమతుల నిషేధం ప్రయోజనం ఎవరికి?

   19-09-2020


అల్ ఖైదా కుట్ర భగ్నం.. అంతర్రాష్ట్ర ఉగ్రవాదులు అరెస్ట్

అల్ ఖైదా కుట్ర భగ్నం.. అంతర్రాష్ట్ర ఉగ్రవాదులు అరెస్ట్

   19-09-2020


ఆ ఏడు దేశాలకే 88 శాతం వ్యాక్సిన్ డోసులు.. గ్లోబల్ నివేదిక

ఆ ఏడు దేశాలకే 88 శాతం వ్యాక్సిన్ డోసులు.. గ్లోబల్ నివేదిక

   19-09-2020


రైతుల దశ మారుతుంది.. వ్యవసాయ బిల్లుల ఆమోదంపై ప్రధాని మోదీ

రైతుల దశ మారుతుంది.. వ్యవసాయ బిల్లుల ఆమోదంపై ప్రధాని మోదీ

   18-09-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle