newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

కన్నడ పాలిటిక్స్‌లో ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు

09-07-201909-07-2019 09:42:13 IST
Updated On 09-07-2019 11:44:02 ISTUpdated On 09-07-20192019-07-09T04:12:13.429Z09-07-2019 2019-07-09T04:12:03.893Z - 2019-07-09T06:14:02.656Z - 09-07-2019

కన్నడ పాలిటిక్స్‌లో ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కన్నడ రాజకీయాలు గంటకో రకంగా మారుతున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో చిక్కుల్లో పడ్డ సంకీర్ణ ప్రభుత్వానికి స్వతంత్ర ఎమ్మెల్యే, మంత్రి అయిన హెచ్.నగేష్ కూడా షాకివ్వడంతో మరింత వివాదం రాజుకుంది. సోమవారం గవర్నర్‌ను కలిసిన నగేష్ తన రాజీనామా లేఖను సమర్పించారు.

ఆ సందర్భంగా ఆయన గవర్నర్‌తో మాట్లాడుతూ.. హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తేల్చి చెప్పారు. అంతేకాదు, ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తే తన మద్దతు కమలం పార్టీకే ఉంటుందని నగేష్ స్పష్టం చేశారు. దీంతో కుమారస్వామి శిబిరం నుంచి ఓ ఎమ్మెల్యే బీజేపీకి జై కొట్టినట్టు ఈ పరిణామంతో తేలిపోయింది.

కాగా, మరో స్వతంత్ర ఎమ్మెల్యే, మంత్రి ఆర్. శంకర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ను కలిసిన ఆయన… సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తే.. మద్దతు తెలుపుతానంటూ స్పష్టంచేశారు. దీంతో పాటు స్పీకర్ ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు.

స్పీకర్ ఏంచేస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 13 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా సమర్పించారు. కాగా, ఈ రాజీనామాలను ఆమోదించవద్దని కాంగ్రెస్‌ న్యాయవిభాగం స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ను కోరింది. ఈ ఎమ్మెల్యేలు నియమ నిబంధనల మేరకు, స్వచ్ఛందంగా రాజీనామాలు సమర్పించలేదని స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే.. కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర ఇంట్లో సమావేశమైన కాంగ్రెస్‌ నేతలు, జేడీఎస్‌ ప్రతినిధులు ఈ మేరకు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పరమేశ్వరతో సమావేశమైన సీఎం కుమారస్వామి రాష్ట్ర రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు.

అసంతృప్త నేతలకు మంత్రి పదవులు ఇచ్చేందుకు వీలుగా కాంగ్రెస్‌ నుంచి 21 మంది మంత్రులు, జేడీఎస్‌కు చెందిన 9 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై సీఎం కుమారస్వామి తొలిసారి నోరువిప్పారు. తాను దేనికీ భయపడబోననీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి తాను ఏమాత్రం ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. కన్నడ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. 

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!

మోదీ వ్యాక్సిన్ వేసుకుంటే చాలు అని అంటున్నారుగా..!

   3 hours ago


భ‌ర్త‌కు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు త‌ల్లి

భ‌ర్త‌కు విడాకులు.. కొడుకుతో పెళ్లి.. ఇప్పుడు త‌ల్లి

   10 hours ago


వైట్ హౌజ్ కాదు.. వాషింగ్ట‌న్ నే వ‌దిలేస్తారట

వైట్ హౌజ్ కాదు.. వాషింగ్ట‌న్ నే వ‌దిలేస్తారట

   8 hours ago


ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్

ట్రంప్‌పై బండ పడింది.. అభిశంసనకు ఆమోదం.. సెనేట్ నిర్ణయం ఫైనల్

   11 hours ago


భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..

భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్..

   12 hours ago


ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు

ఎంత గ్యాప్ ఉంటే అంత సమర్థంగా వ్యాక్సిన్ పనితీరు.. సీరమ్ సైంటిస్టు

   12 hours ago


తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య

తొమ్మిదో రౌండ్ చర్చలు 120 శాతం విఫలం.. రైతుసంఘాల వ్యాఖ్య

   13 hours ago


భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..

భారత్ చైనా ప్రతిష్టంభన.. సడలింపు.. పాంగాంగ్ సరస్సు ప్రారంభం..

   14 hours ago


కాసేప‌ట్లో క‌రోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్ర‌పంచంలో మ‌న‌మే టాప్

కాసేప‌ట్లో క‌రోనా వ్యాక్సిన్ ప్రారంభం.. ప్ర‌పంచంలో మ‌న‌మే టాప్

   14 hours ago


ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..

ఏపీలో మద్యం ధరల పెంపు.. దేశంలో పెట్రోల్ ధరల పెంపు ఒక్కటేనా..

   15-01-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle