newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ఒక్క రోజులో 507 మరణాలు.. త్వరలో మూడో స్థానంలోకి భారత్

02-07-202002-07-2020 07:05:36 IST
Updated On 02-07-2020 08:42:24 ISTUpdated On 02-07-20202020-07-02T01:35:36.231Z02-07-2020 2020-07-02T01:35:33.058Z - 2020-07-02T03:12:24.965Z - 02-07-2020

ఒక్క రోజులో 507 మరణాలు.. త్వరలో మూడో స్థానంలోకి భారత్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా మహమ్మారి జాతీయ స్థాయిలో ఉగ్రరూపం దాల్చింది. కొవిడ్‌ కేసుల సంఖ్య 6 లక్షలు దాటింది. బుధవారం ఉదయం నాటికి మరో 18,653 కేసులు కొత్తగా నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 5.85 లక్షలకు చేరింది. ఇక సాయంత్రం అయ్యేసరికి మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలు కేసుల చిట్టాను విప్పడంతో.. మరో ఏడు రాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రత అధికంగానే ఉండటంతో మరో 15 వేల కొత్త కేసులు వచ్చి చేరాయి. దీంతో బుధవారం రాత్రి కడపటి సమాచారం అందే సరికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య  6,00,032కు చేరింది. ప్రస్తుతం కొవిడ్‌ కేసుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న భారత్‌.. మూడో స్థానంలో ఉన్న రష్యాకు కేవలం 50వేల కేసుల దూరంలో నిలిచింది. 

కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఎన్నడూ లేనంత భారీ సంఖ్యలో 24 గంటల్లోనే 507 మంది ఇన్ఫెక్షన్‌తో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటివరకు కరోనా సోకి 17,400 మంది ప్రాణాలు కోల్పోగా.. 2,20,114 మంది చికిత్స పొందుతున్నారు. మరో 3,47,979 మంది కరోనా నుంచి కోలుకుని, డిశ్చార్జి అయ్యారు. గడిచిన జూన్‌లోనే దేశంలో 4 లక్షల పాజిటివ్‌ కేసులు  నమోదయ్యాయి. దాదాపు 12వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 

దేశంలో జూన్‌ ఒకటి నాటికి 1,90,535 పాజిటివ్‌ కేసులు ఉండగా, ఇప్పుడవి ఏకంగా 6 లక్షలు దాటడం గమనార్హం. హరియాణాలో ఇప్పటివరకు 14,548 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, వీరిలో 236 మంది మరణించారు. మరో 4,340 మంది చికిత్స పొందుతుండగా, 9,972 మంది కోలుకున్నారు. మధ్యప్రదేశ్‌లో  ఇంతవరకు 13,593 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, వీటిలో 572 మంది మరణించారు. 2,626 మంది చికిత్స పొందుతుండగా, 10,395 మంది కోలుకున్నారు. 

కర్ణాటకలో బుధవారం ఒక్కరోజే 1,272 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 16,514కు చేరుకొంది. 145 మంది కోలుకొని డిశ్చార్జ్‌ కావడంతో మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 8,063కు పెరిగింది.  8,194మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 50 ఏళ్లు పైబడిన 10 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు నిర్బంధ సెలవు మంజూరు చేశారు. 

తమిళనాడులో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 94 వేలు దాటింది. రాష్ట్రంలో తాజాగా 3,882 పాజిటివ్‌ కేసులు నమోదుకావటంతో మొత్తం కేసుల సంఖ్య 94,047కు పెరిగింది. చెన్నై ప్రస్తుతం కరోనా కేంద్రంగా మారింది.  తాజాగా 2,182 మందికి వైరస్‌ లక్షణాలు బయటపడ్డాయి. బుధవారం 63 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,852 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

ఆర్థిక రాజధానిలో నిషేధాజ్ఞలు - ముంబైలో 144 సెక్షన్‌

ముంబై  దేశ ఆర్థిక రాజధాని ముంబై కరోనా హాట్‌స్పాట్‌గా మారడంతో నిబంధనలను కఠినతరం చేశారు. మహమ్మారి కట్టడికి ముంబై పోలీసులు బుధవారం బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడటాన్ని నిషేధిస్తూ 144 సెక్షన్‌ విధించారు. అత్యవసర పనులు మినహా ఇతర కార్యకలాపాలకు ప్రజలను అనుమతించబోమని ఈ నిషేధాజ్ఞలు జూన్‌ 15 వరకూ కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. కాగా ముంబై మహానగరంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను జులై 31వరకూ పొడిగించినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   7 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   11 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   a day ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle