newssting
BITING NEWS :
* వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని నరేంద్రమోదీ. * ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ మాదిరే‌ రష్యా‌ వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి ప్రయోగాలలో కూడా స్వల్ప దుష్పలితాలు. * అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని రోచెస్టర్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి. 14 మందికి గాయాలు. * షెడ్యూల్‌ కంటే ముందుగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే అవకాశం. కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచన చేస్తున్న ప్రభుత్వ వర్గాలు. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ భేటీలో సమావేశాల కుదింపునకే మొగ్గుచూపిన మెజారిటీ సభ్యులు * సాంప్రదాయ, శాస్త్రోక్తంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. * ఏపీలో నేటి నుండి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు. ఈ నెల 26 వరకు.. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు... మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరగనున్న పరీక్షలు. ప్రకాశం జిల్లాలో తగ్గని కరోనా ఉధృతి. తాజాగా మరో 1065 కేసులు నమోదు. ఒంగోలులో అత్యధికంగా 220 కేసులు నమోదు. జిల్లాలో ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లలో ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు * తెలంగాణలో సోమవారం నుండి ప్రారంభం కానున్న పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు. అన్ని స్కూళ్లలో విధులకు హాజరు కానున్న సగం మంది టీచర్లు. రోజు విడిచి రోజు విధులకు హాజరు కానున్న ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే పాఠశాలకు విద్యార్థులు * ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు అతిభారీ వర్షాలు. పొంగిపొర్లుతున్న నదులు, వాగులు, వంకలు. కుండపోత వర్షాలకు భారీగా నీటమునిగిన పంటలు.

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

03-08-202003-08-2020 09:49:42 IST
2020-08-03T04:19:42.724Z03-08-2020 2020-08-03T04:15:25.229Z - - 21-09-2020

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కంటికి కనిపించదు.. కానీ పేరు చెబితే అంతా భయపడాల్సిందే. సామాన్యుల నుంచి వీఐపీల దాకా కరోనా వైరస్ గుబులు రేపుతోంది. మనదేశంలోకి ఈ మహమ్మారి ప్రవేశించి ఐదునెలలవుతోంది. వరుసగా ఒక్కొక్కరికీ సోకుతోంది. దీంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అంతా కరోనా పేరు చెబితే హడలిపోతున్నారు. వీఐపీలకు కరోనా సోకితే చాలు వారితో కలిసి తిరిగినవారు వణికిపోతున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, తమిళనాడు గవర్నర్, కర్ణాటక సీఎం యెడియూరప్ప...ఇలా ఎవరూ కరోనాకు అతీతం కాదని తేలిపోయింది. వీరంతా కరోనా బారినపడి కోలుకుంటున్నారు. ఏపీలో మాజీ మంత్రి మాణిక్యాలరావు, ఉత్తరప్రదేశ్‌ లో తాజా మంత్రి కరోనా వల్ల కన్నుమూశారు. దీనిని బట్టి కరోనా వల్ల ఎంత ప్రమాదం వుందో అర్థం చేసుకోవచ్చు. కరోనా వైరస్‌ ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకున్నానని, పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు.

ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వెల్లడించారు.  అమిత్ షాకు కరోనా సోకడంతో ఆయనతో సన్నిహితంగా తిరిగినవారు కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. మేదాంత ఆసుపత్రిలోకి ఇతరులు రాకుండా నిషేధం విధించారు. అమిత్‌ షాను ఇటీవలే తాను కలిశానని కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో చెప్పారు. అతి త్వరలో కరోనా టెస్టు చేయించుకుంటానని, అప్పటిదాకా కుటుంబ సభ్యులకు దూరంగా ఐసోలేషన్‌లో ఉంటానని తెలిపారు.

అమిత్‌ షా త్వరగా కోలుకోవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌  నేత రాహుల్‌ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్,  బెంగాల్‌ సీఎం మమత, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ, హరియాణా సీఎం  ఖట్టర్‌, హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఆకాంక్షించారు.     

మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యెడియూరప్పకు కరోనా వైరస్‌ సోకింది. ఆదివారం ఆయనకు పరీక్షలు చేయగా, పాజిటివ్‌గా తేలింది. యెడియూరప్ప చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు.అలాగే ఉత్తరప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ కూడా కరోనా బారినపడ్డారు. యూపీ సాంకేతిక విద్యా శాఖ మంత్రి కమల్‌రాణిని కరోనా పొట్టన పెట్టుకుంది. ఆమె ఆదివారం లక్నో లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. రాష్ట్రంలో కరోనా వల్ల ఒక మం త్రి మరణించడం ఇదే తొలిసారి. యూపీ కేబినెట్‌లో ఆమె ఏకైక మహిళ. ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్ కరోనా సోకి కోలుకున్నారు. 

ఏపీలోనూ మాజీ దేవాదాయ శాఖమంత్రి, బీజేపీ సీనియర్ నేత మాణిక్యాలరావు కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌కు కరోనా వైరస్‌ సోకింది. ఆయనలో కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉండడంతో హోం ఐసోలేషన్‌లో ఉండాలని కావేరీ ఆసుపత్రి వైద్యులు సూచించారు. తమిళనాడు రాజ్‌భవన్‌లో ముగ్గురికి కరోనా సోకింది. దీంతో గవర్నర్‌ పురోహిత్‌ జూలై 29 నుంచి సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనాబారిన పడ్డారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి కరోనానుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కరోనా రావడంతో హోం ఐసోలేషన్లో చికిత్స అందుకుంటున్నారు. ఎవరికి వారు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనాను నియంత్రించే మందులు ఇంకా అందుబాటులోకి రాలేదు. వ్యాక్సిన్ వచ్చేవరకూ జాగరూకత అవసరం. 

 

దేశ సినీ పరిశ్రమని టెర్రరిజమ్‌ల నుంచి కాపాడాలి: కంగనా

దేశ సినీ పరిశ్రమని టెర్రరిజమ్‌ల నుంచి కాపాడాలి: కంగనా

   16 hours ago


పుస్తకాలే లేవు.. ఆన్‌లైన్ క్లాసులపై.. తల్లిదండ్రుల తీవ్ర ఆవేదన

పుస్తకాలే లేవు.. ఆన్‌లైన్ క్లాసులపై.. తల్లిదండ్రుల తీవ్ర ఆవేదన

   18 hours ago


పాకిస్తాన్, చైనా.. భారత సహనానికి పరీక్ష.. !

పాకిస్తాన్, చైనా.. భారత సహనానికి పరీక్ష.. !

   19 hours ago


చైనాతో చర్చలు సరే.. మరి పాకిస్తాన్ తో.. ఫరూక్ వ్యాఖ్యలు

చైనాతో చర్చలు సరే.. మరి పాకిస్తాన్ తో.. ఫరూక్ వ్యాఖ్యలు

   20 hours ago


ఆ కాలువ నిర్మాణం పిరమిడ్స్, తాజ్‌మహల్‌ కంటే గొప్ప కృషే... ఆనంద్ మహీంద్రా

ఆ కాలువ నిర్మాణం పిరమిడ్స్, తాజ్‌మహల్‌ కంటే గొప్ప కృషే... ఆనంద్ మహీంద్రా

   21 hours ago


పెరుగుతున్న నిరుద్యోగం.. అరకోటికి పైగా ఉద్యోగాలు హుష్!

పెరుగుతున్న నిరుద్యోగం.. అరకోటికి పైగా ఉద్యోగాలు హుష్!

   19-09-2020


ఉల్లి ఎగుమతుల నిషేధం ప్రయోజనం ఎవరికి?

ఉల్లి ఎగుమతుల నిషేధం ప్రయోజనం ఎవరికి?

   19-09-2020


అల్ ఖైదా కుట్ర భగ్నం.. అంతర్రాష్ట్ర ఉగ్రవాదులు అరెస్ట్

అల్ ఖైదా కుట్ర భగ్నం.. అంతర్రాష్ట్ర ఉగ్రవాదులు అరెస్ట్

   19-09-2020


ఆ ఏడు దేశాలకే 88 శాతం వ్యాక్సిన్ డోసులు.. గ్లోబల్ నివేదిక

ఆ ఏడు దేశాలకే 88 శాతం వ్యాక్సిన్ డోసులు.. గ్లోబల్ నివేదిక

   19-09-2020


రైతుల దశ మారుతుంది.. వ్యవసాయ బిల్లుల ఆమోదంపై ప్రధాని మోదీ

రైతుల దశ మారుతుంది.. వ్యవసాయ బిల్లుల ఆమోదంపై ప్రధాని మోదీ

   18-09-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle