newssting
Radio
BITING NEWS :
మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత. కొద్దిరోజుల క్రితమే కరోనా నుంచి కోలుకున్న నాయిని. మళ్లీ లంగ్ ఇన్ఫెక్షన్ సోకడంతో అపోలోలో చికిత్స. బుధవారం అర్థరాత్రి 12.25 గంటలకు నాయిని మరణించినట్లు తెలిపిన అపోలో ఆస్పత్రి వర్గాలు. * 6వ రోజు ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్నదసరా మహోత్సవాలు. లలితా త్రిపురసుందరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. * మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం. నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన వీడియో జర్నలిస్ట్ కుమారుడు దీక్షిత్. మహబూబాబాద్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపై బాలుడి మృతదేహం. కిడ్నాప్ చేసిన రోజే బాలుడిని హతమార్చినట్లు అనుమానిస్తున్న పోలీసులు. పోలీసుల అదుపులో బాధిత కుటుంబ బంధువు మనోజ్ రెడ్డి. * మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే రాజీనామా. నేడు లేదా రేపు కాంగ్రెస్ లో చేరే అవకాశం. * కరోనా టీకా వికటించి వాలంటీర్ మృతి. బ్రెజిల్ లో టీకాను అభివృద్ధి చేసిన ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా. వాలంటీర్ మృతికి గల కారణాలను తెలుసుకుంటున్నామన్న ఆక్స్ ఫర్డ్ వైద్యులు.

ఉల్లి ఎగుమతుల నిషేధం ప్రయోజనం ఎవరికి?

19-09-202019-09-2020 15:17:35 IST
Updated On 19-09-2020 16:08:38 ISTUpdated On 19-09-20202020-09-19T09:47:35.834Z19-09-2020 2020-09-19T09:47:33.406Z - 2020-09-19T10:38:38.798Z - 19-09-2020

ఉల్లి ఎగుమతుల నిషేధం ప్రయోజనం ఎవరికి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏటా ఉల్లి ఘాటు రైతులను, వినియోగదారులనూ ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంది. అయినా ఉల్లి నిల్వ, కొరత నివారణ, ధరల పెరుగుదలను అదుపు చేయడం వంటి విషయాల్లో కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు విఫలమౌతూనే ఉన్నాయి. విఫలమవ్వడమే కాదు... వినియోగదారులకు కష్టం కలగకుండా ఉండేదుకేనని చెబుతూ, తీసుకుంటున్న చర్యలు అంతిమంగా బడా వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. ఉదాహరణకు తాజాగా వినియోగదారులకు అందుబాటులో ఉండేందుకు ఉల్లి ఎగుమతులను నిషేధించి నట్లు కేంద్రం ఘనంగా ప్రకటించింది. ఈ నెల 14వ తేదీ నుంచి ఉల్లి ఎగుమతుల నిషేధం అమలులోనికి వచ్చింది. కానీ దాని వల్ల వినియోగదారుడికి వీసమెత్తు ప్రయోజనం కూడా కలుగలేదు. ధరలు యథావిథిగా కొండెక్కి కూర్చున్నాయి.

ఆరుగాలం శ్రమించి ఉల్లి రైతు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో కుదేలయ్యాడు. వినియోగదారుడికీ, రైతుకీ కూడా ప్రయోజనం లేని ఉల్లి ఎగుమతుల వల్ల లబ్ధి ఎవరికన్న ప్రశ్నకు కేంద్రం బదులివ్వకపోయినా... ఆ చర్య వల్ల ప్రయోజనం పొందినది, పొందేదీ బడా వ్యాపారులేనన్నది ఎంత మాత్రం రహస్యం కాదు. ఉల్లి దాదాపుగా ఒక నిత్యావసర వస్తువే. సంపన్నుల నుంచి సామాన్యుల వరకూ ఆహారంలో నిత్యం ఉల్లి ఉండాల్సిందే. అటువంటి ఉల్లి విషయంలో రైతుకూ, వినియోగదారుడికి ఏమాత్రం ఉపయోగపడని చర్యలతో  ఎందుకు ముందుకు సాగుతున్నదన్న ప్రశ్నకు బదులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ఉల్లి కష్టాలు ఏటా పునరావృతమౌతున్నా ...కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయే తప్ప ఉల్లి రైతులను ప్రోత్సహించడానికి, ఉల్లి కొరత ఏర్పడకుండా నిల్వలు పెంచడానికి ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు.

తాజా పరిస్థితినే తీసుకుంటే..అధిక ధరల పేరు చెప్పి ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం...వినియోగదారులకు అందుబాటు ధరలో ఉల్లి అందజేస్తామని మాత్రం చెప్పడం లేదు. దీని వల్ల రైతుకూ, వినియోగదారుడికీ ప్రయోజనం లేకపోగా, రైతు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉత్పన్నమైంది. ఉల్లికి మద్దతు ధర ప్రకటించి...ఆ ధరకు మార్కెట్ లో వ్యాపారులు కొనుగోలు చేయకుంటే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. కేంద్రం ఇప్పుడు అనుసరిస్తున్న విధానం వ్యాపారులు లాభాలు దండుకోవడానికీ, రైతుకు, వినియోగదారుడికి కష్టాలూ, కన్నీళ్లు మిగల్చడానికి తప్ప మరొకందుకు ఉపయోగపడదు.

జూలైలో క‌రోనా పేషెంట్ చ‌నిపోతే.. ప‌క్క‌న వారికోసం ఇప్పుడు స‌ర్చింగ్

జూలైలో క‌రోనా పేషెంట్ చ‌నిపోతే.. ప‌క్క‌న వారికోసం ఇప్పుడు స‌ర్చింగ్

   15 hours ago


బీజేపీ నయా ఎన్నికల స్టంట్.. ప్ర‌తి ఒక్క‌రికీ ఉచితంగా కోవిద్ టీకా

బీజేపీ నయా ఎన్నికల స్టంట్.. ప్ర‌తి ఒక్క‌రికీ ఉచితంగా కోవిద్ టీకా

   15 hours ago


భారత నౌకా దళంలోకి వచ్చేసిన ఐఎన్ఎస్ కవ‌ర‌త్తి.. శత్రువుల వెన్నులో వణుకే

భారత నౌకా దళంలోకి వచ్చేసిన ఐఎన్ఎస్ కవ‌ర‌త్తి.. శత్రువుల వెన్నులో వణుకే

   16 hours ago


ఏకంగా బ‌స్టాప్ నే ఎత్తుకెళ్లారు

ఏకంగా బ‌స్టాప్ నే ఎత్తుకెళ్లారు

   16 hours ago


కరోనా కేసుల సంఖ్యపై అప్డేట్స్..!

కరోనా కేసుల సంఖ్యపై అప్డేట్స్..!

   17 hours ago


టెట్‌ వ్యాలిడిటీ శాశ్వతం.. ఎన్‌సీటీఈ నిర్ణయం

టెట్‌ వ్యాలిడిటీ శాశ్వతం.. ఎన్‌సీటీఈ నిర్ణయం

   18 hours ago


భారత్ లో పరిశోధనలు ఎంతో ముఖ్యమని ప్రపంచానికి చెప్పిన బిల్ గేట్స్

భారత్ లో పరిశోధనలు ఎంతో ముఖ్యమని ప్రపంచానికి చెప్పిన బిల్ గేట్స్

   21-10-2020


సాయిబాబాకు మందులు, పుస్తకాలు కూడా ఇవ్వరా.. హరగోపాల్

సాయిబాబాకు మందులు, పుస్తకాలు కూడా ఇవ్వరా.. హరగోపాల్

   21-10-2020


ఫౌచీ ఒక ఇడియట్‌.. నోరు పారేసుకున్న ట్రంప్

ఫౌచీ ఒక ఇడియట్‌.. నోరు పారేసుకున్న ట్రంప్

   21-10-2020


చైనా సైనికుడిని అప్పగించేశారు

చైనా సైనికుడిని అప్పగించేశారు

   21-10-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle