newssting
BITING NEWS :
*కేంద్ర కేబినెట్‌ సమావేశం..లాక్‌డౌన్లతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై, చైనాతో సరిహద్దు వివాదం సహా కీలక అంశాలపై చర్చ*ఈనెల ఐదున ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం*తెలంగాణా లో ఇవాళ 199 కేసులు నమోదు.. గ్రేటర్లో పెరుగుతున్న కేసులతో ఆందోళన ..మొత్తం 2698 కేసులు నమోదు*భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 8,392కొత్త కరోనా కేసులు నమోదు, 1,90,535కిచేరిన పాజిటివ్‌ కేసులు, ఒకే రోజు 230 మంది మృతి.. ఇప్పటి వరకు మృతిచెందినవారు 5,394 మంది*అరేబియా సముద్రంలో అల్పపీడనం..అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం...తెలంగాణలో నేడు,రేపు వర్షాలు*ఏపీలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ..రాష్ట్రవ్యాప్తంగా 58.22లక్షల మందికి పెన్షన్‌..రూ.1,421.20 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్‌ *అంతరాష్ట్ర బస్సుల సర్వీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకొని తెలంగాణ సర్కార్. ఆర్టీసీ బస్సులు కేవలం సరిహద్దుల వరకే. పొరుగు రాష్ట్రాల బస్సులను కూడా అనుమతించని తెలంగాణ ప్రభుత్వం *ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 76 కరోనా కేసులు.. 3118 కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసులు, ఏపీలో ఇప్పటి వరకు 64 మంది మృతి*ఏపీ: టీడీపీని వీడే ఆలోచన లేదు, కావాలనే కొందరు నాపై తప్పుడు ప్రచారం చేశారు-పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

ఇక కరోనా నివారణ బాధ్యత ప్రజలదే: వెయ్యికేసులు దాటితే ప్రమాదమే

29-03-202029-03-2020 16:28:07 IST
2020-03-29T10:58:07.953Z29-03-2020 2020-03-29T10:56:58.462Z - - 01-06-2020

ఇక కరోనా నివారణ బాధ్యత ప్రజలదే: వెయ్యికేసులు దాటితే ప్రమాదమే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కంటికి కనిపించని ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన వైరస్ ప్రపంచాన్ని ఇంతగా దెబ్బతీస్తున్నా దేశదేశాల్లో దానిపట్ల జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రజలు ఇంకా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. పోలీసులు చితకబాదుతున్నా శనివారం నాటికి కూడా జనం రోడ్లమీదికి రావడాన్ని మానుకోలేదు. హైదరాబాద్‌లో పగటిపూట సైతం జనం రోడ్లమీదికి వస్తున్నారంటే కరోనా సెగ ఇంకా నగరాన్ని తాకనట్లే లెక్క. దేశమంతటా ఇదే పరిస్థితి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణలో విధించిన ‘లాక్‌డౌన్‌’ ఆంక్షలను ఉల్లంఘించిన వారికి లాఠీ దెబ్బలు రుచి చూపినా, మోకాళ్లపై నడిపించినా, బింగుళ్లు తీయించినా, రోడ్లపై సాష్టాంగ నమస్కారాలు చేయించినా ఆశించిన మార్పు కనిపించడం లేదు. 

మాకు రాదులే’ అనుకోవడమే ఈ నిర్లక్ష్యానికి ప్రధాన కారణం.

లాక్ డౌన్ సకాలంలో అమలు చేయకపోతే, జనం దాన్ని పాటించకపోతే ఏం జరుగుతుందో ఇటలీ, అమెరికా, బ్రిటన్ మనకు ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నా మనకు మాత్రం ఇంకా భయం కలగటంలేదు. సామాజిక దూరం పాటించాల్సిందిగా అమెరికాలోని న్యూయార్క్‌ సిటీలో ఆంక్షలు విధించిన తొలిరోజే పార్కులు, పబ్బులు జనంతో కిటకిటలాడడం, లండన్‌లో వెయ్యి పౌండ్ల జరిమానా, ఆరు నెలల కారాగార శిక్ష అని ప్రకటించినప్పటికీ సముద్రతీరాలు జనంతో కిక్కిరిసి పోవడానికి ‘మాకు రాదులే!’ అన్న ధీమానే కారణం. 

ఇటలీ మాత్రం తక్కువ తినలేదు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా సెలవులు ప్రకటిస్తే ఇళ్లలో ఉండటానికి బదులుగా ఇదే సందు అనుకుని విహారయాత్రలకు, పార్కులకు, బీచ్‌లకు వెళ్లిన వందలాది యువతీయువకులు ఆ దేశం మొత్తానికి వైరస్‌ను అంటించేశారు. దాని ఫలితం ఇప్పటికి పదివేల మంది మరణాలు. లక్షమందికి వైరస్ లక్షణాలు, దేశం దేశమే రోగగ్రస్త భూమిగా మారిపోయిన స్థితిలో ఇటలీ ఇప్పుడు వృద్ధులకు వైద్య సేవలు చేయడం అనవసరమనే అమానుష నిర్ణయానికి వచ్చిందని వార్తలు. కరోనా సోకిన వృద్దులు ఇక బతికి బయటపడటం సాధ్యం కాదనే నిర్ణయానికి ఇటలీ ప్రభుత్వం, ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ వచ్చేశాయని తెలుస్తోంది.

ప్రపంచం కుప్పకూలిపోతున్నా మా వరకు రాదులే, మాకేం కాదులే అనే ఈ మానసిక తత్వాన్ని మానసిక శాస్త్రం ప్రకారం ‘ఆశావాద దృక్పథం’గా వ్యవహరిస్తారు. బ్రిటన్‌తోపాటు ఇటలీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌ దేశాలకు చెందిన నాలుగు వేల మందిని ఓ సైకాలజీ వెబ్‌సైట్‌ కరోనా వైరస్‌ గురించి ఇంటర్వ్యూ చేయగా.. సగం మందికి పైగా తమకు వైరస్‌ వచ్చే అవకాశం లేదని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అవకాశాలు చాలా తక్కువని సగంకన్నా తక్కువ మంది చెప్పారు. వైరస్‌ సోకే అవకాశాలు ఉన్నాయని కేవలం ఐదు శాతం మంది మాత్రమే అంగీకరించారు. 

అయితే మనుషులకు ఆశావాద దక్పథం ఉంటే తప్పు కాదు. ఆశావాదం అనవసర భయాందోళనలను దూరం చేయడంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కానీ కరోనా లాంటి భయానక పరిస్థితిని అర్థం చేసుకోకపోవడం అర్థరహితమే అవుతుంది. తమకు మాత్రమే కరోనా వచ్చే అవకాశం ఉందంటే సాధారణంగా ప్రజలు భయపడతారు. తమతో పాటు ఇతరులకు కూడా వచ్చే అవకాశం ఉందన్నప్పుడు వారి మానసిక పరిస్థితి మారుతుంది. ఇతరులకు రావచ్చుగానీ తమకు రాదనే ధీమా వారిలో ఏర్పడుతుంది. 

ఇది ఒకరకంగా సామాజిక ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకోవడంలో భాగమేనని అమెరికాలోని డికిన్‌సన్‌ కాలేజీలో పనిచేస్తున్న సైకాలజీ ప్రొఫెసర్‌ మేరి హెల్‌వెగ్‌ లార్సన్‌ అభిప్రాయపడ్డారు. పొగతాగడం వల్ల ఊపిరితిత్తులు లేదా గొంతు క్యాన్సర్‌ వస్తుందని తెలిసినప్పటికీ తమకు రాదనే ధీమాతో పొగతాగడం ఎంత ప్రమాదమో ఈ కరోనా వైరస్‌ రాదనుకోవడం కూడా అంతే ప్రమాదమని లార్సన్‌ హెచ్చరిస్తున్నారు.

భారతదేశంలోనూ కరోనా కేసులు శనివారం నాటికి వెయ్యి సమీపించాయంటేనే దేశం ప్రమాద పరిస్థితుల్లోకి వచ్చేసిందని లెక్క. ఇక దేశాన్ని కాపాడుకోవడం, దేశ ఆరోగ్యానికి పూచీగా నిలబడటం ఫ్రభుత్వ బాధ్యతగా, ఆరోగ్య శాఖ బాధ్యతగా మాత్రమే ఉండదు. ఇప్పుడది మొత్తం ప్రజల బాధ్యతగా మారిపోయింది. కరోనా వైరస్ సోకిన రోగుల కేసులు వెయ్యి దాటాయంటే అవి పదివేల కేసులను చేరుకోవడానికి ఎక్కువ రోజులు పట్టదు. మూడో దశ భారత్‌లోనూ ప్రవేశిస్తోందనడానికి వెయ్యిదాటుతున్న కేసులే సాక్ష్యం.

భారత ప్రజలు ఇటలీ అనుభవాన్ని, అమెరికా, బ్రిటన్ అనుభవాన్ని ఇకనైనా గుణపాఠంగా తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు అత్యంత ప్రధాన అంశంగా మారింది.

 

 కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఆత్మనిర్భర భారత్‌కు రోడ్ మ్యాప్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఆత్మనిర్భర భారత్‌కు రోడ్ మ్యాప్

   33 minutes ago


అమెరికాలో ఆగని అల్లర్లు.. 12 నగరాల్లో కర్ఫ్యూ.. వైరస్ విజృంభణ

అమెరికాలో ఆగని అల్లర్లు.. 12 నగరాల్లో కర్ఫ్యూ.. వైరస్ విజృంభణ

   4 hours ago


చైనా ఉత్పత్తులు బహిష్కరించండి.. భారత్‌లో ఆన్‌లైన్‌ యుద్ధం ప్రారంభం

చైనా ఉత్పత్తులు బహిష్కరించండి.. భారత్‌లో ఆన్‌లైన్‌ యుద్ధం ప్రారంభం

   11 hours ago


కరోనా కేసుల్లో భారత్‌కి 7వ స్థానం.. ఒక్కరోజులో 8,380 కేసుల నమోదు

కరోనా కేసుల్లో భారత్‌కి 7వ స్థానం.. ఒక్కరోజులో 8,380 కేసుల నమోదు

   11 hours ago


లాక్ డౌన్ నియంత్రణ ఇక చాలు.. కరోనాకు భయపడం అంటున్న అమెరికన్లు

లాక్ డౌన్ నియంత్రణ ఇక చాలు.. కరోనాకు భయపడం అంటున్న అమెరికన్లు

   31-05-2020


భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగే రోజు సాకారం.. దేశ ప్రజలకు మోదీ లేఖ

భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగే రోజు సాకారం.. దేశ ప్రజలకు మోదీ లేఖ

   31-05-2020


 లాక్ డౌన్ పై రాష్ట్రాలదే నిర్ణయం ..ఆ నగరాలపైనే  ఫోకస్

లాక్ డౌన్ పై రాష్ట్రాలదే నిర్ణయం ..ఆ నగరాలపైనే ఫోకస్

   30-05-2020


ఒక్కరోజే 7,466 కరోనా కేసులు.. కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్?

ఒక్కరోజే 7,466 కరోనా కేసులు.. కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్?

   30-05-2020


ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్‌.. తిప్పికొట్టిన సంస్థ సీఈఓ

ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్‌.. తిప్పికొట్టిన సంస్థ సీఈఓ

   29-05-2020


కరోనా ఆందోళన.. ప్రపంచంలో 9వ స్థానానికి ఇండియా

కరోనా ఆందోళన.. ప్రపంచంలో 9వ స్థానానికి ఇండియా

   29-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle