newssting
Radio
BITING NEWS :
మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత. కొద్దిరోజుల క్రితమే కరోనా నుంచి కోలుకున్న నాయిని. మళ్లీ లంగ్ ఇన్ఫెక్షన్ సోకడంతో అపోలోలో చికిత్స. బుధవారం అర్థరాత్రి 12.25 గంటలకు నాయిని మరణించినట్లు తెలిపిన అపోలో ఆస్పత్రి వర్గాలు. * 6వ రోజు ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్నదసరా మహోత్సవాలు. లలితా త్రిపురసుందరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. * మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం. నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన వీడియో జర్నలిస్ట్ కుమారుడు దీక్షిత్. మహబూబాబాద్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపై బాలుడి మృతదేహం. కిడ్నాప్ చేసిన రోజే బాలుడిని హతమార్చినట్లు అనుమానిస్తున్న పోలీసులు. పోలీసుల అదుపులో బాధిత కుటుంబ బంధువు మనోజ్ రెడ్డి. * మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే రాజీనామా. నేడు లేదా రేపు కాంగ్రెస్ లో చేరే అవకాశం. * కరోనా టీకా వికటించి వాలంటీర్ మృతి. బ్రెజిల్ లో టీకాను అభివృద్ధి చేసిన ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా. వాలంటీర్ మృతికి గల కారణాలను తెలుసుకుంటున్నామన్న ఆక్స్ ఫర్డ్ వైద్యులు.

ఆ కాలువ నిర్మాణం పిరమిడ్స్, తాజ్‌మహల్‌ కంటే గొప్ప కృషే... ఆనంద్ మహీంద్రా

20-09-202020-09-2020 07:41:17 IST
2020-09-20T02:11:17.313Z20-09-2020 2020-09-20T02:11:11.338Z - - 23-10-2020

ఆ కాలువ నిర్మాణం పిరమిడ్స్, తాజ్‌మహల్‌ కంటే గొప్ప కృషే... ఆనంద్ మహీంద్రా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సొంత ఊరి బాగుకోసం 30 ఏళ్లు కష్టపడి నీటి కాలువ తవ్వి ప్రకృతినే జయించిన బిహార్‌లోని వృద్ధుడు లంగీ భుయాన్‌ సాగించిన కృషి ఈజిఫ్ట్ పిరమిడ్లు, ఆగ్రాలో తాజ్‌మహల్ నిర్మాణంతో సమానమని మహింద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహింద్రా కొనియాడారు. భుయాన్‌ తవ్విన కాలువ పిరమిడ్స్‌, తాజ్‌మహల్‌ వంటి అద్భుత కృషికి నిదర్శనం అన్నారు. ఆయన కృషికి చిరు బహుమానంగా ట్రాక్టర్‌ ఇవ్వనున్నట్టు ట్విటర్‌లో ప్రకటించారు. ఆ పెద్దాయనకు తమ మహింద్రా ట్రాక్టర్‌ను అందించడం గౌరవంగా భావిస్తామని పేర్కొన్నారు. 

ఈ ప్రపంచంలో అద్భుతమైన నిర్మాణాలెన్నింటినో మానవులు తన చెమట కష్టంతో దశాబ్దాలు శ్రమించి నిర్మించారు. తానీ అవన్నీ తమ బానిసల, పౌరుల శ్రమను ఉపయోగించి రాజులు అప్పట్లో కట్టిన నిర్మాణాలు మాత్రమే. కానీ ఈ పెద్దాయన భుయాన్ సుదీర్ఘ కాలంపాటు తవ్వుతూ వచ్చిన 3 కిలోమీటర్ల పొడవైన కాలువ ఆనాటి పిరమిడ్లు, తాజ్ మహల్ వంటి భారీ నిర్మాణాలకంటే గొప్ప నిర్మాణం అని చెప్పడానికి ఏమాత్రం సందేహించను అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్‌లో పేర్కొన్నారు.

బిహార్‌లోని గయ ప్రాంతంలోని కోటీలావ గ్రామానికి చెందిన వ్యక్తి లంగీ భుయాన్.. ఆ ఊరి కొండలపై కురిసిన వాననీరు వృథా పోకుండా 30 ఏళ్ల క్రితం ఓ బృహత్తరమైన ఆలోచన చేశాడు. కొండ దగ్గర నుంచి కాలువ తవ్వి వర్షం నీరును ఊరికి తరలిద్దామనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పనులు ప్రారంభించాడు. అప్పుడు మొదలైన కాలువ తవ్వకం తాజాగా పూర్తయింది. అయితే, భుయాన్‌ కష్టానికి గ్రామస్తులు పెద్దగా సాయం చేయలేదు. గత ముప్పైఏళ్లుగా ఒక్కడే 3 కిలోమీటర్ల పొడవునా కాలువ తవ్వి తన ఊరికి అందించాడు. దీంతో అక్కడ పంట పొలాలన్నింటికీ ఆ నీరే ఆధారమవుతోంది. 

ఇన్నేళ్ల అతని ప్రయత్నం సఫలం కావడంతో గ్రామస్తులందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ క్రమంలోనే రోహిన్‌ వర్మ అనే వ్యక్తి భుయాన్‌ను ఆదుకోవడం ఆనంద్‌ మహింద్రా అదృష్టంగా భావిస్తారనుకుంటా అని ఆయన్ని ట్యాగ్‌ చేశాడు. అప్పటికే భుయాన్‌ గొప్పతనంపై ట్విటర్‌లో స్పందించిన ఆనంద్‌ మహింద్రా.. ఆ పెద్దాయనకు ట్రాక్టర్‌ ఇస్తానని రిప్లై ఇచ్చాడు. 

గతంలో బిహార్‌కు చెందిన దశరథ్ మాంఝీ అనే వ్యక్తి  కొం‍డచర్యలు విరిగిపడి తన భార్య మరణించడంతో ఒక్కడే ఒక కొండను తొలచి గ్రామానికి రహదారి నిర్మించిన విషయం తెలిసిందే. 22 ఏళ్లు కష్టపడి ఒక్కడే ఈ పనిని చేయడంతో ఈ విషయం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత మాంఝీ కథతో సినిమా కూడా తెరకెక్కింది. 

దీని గురించి భుయాన్ మాట్లాడుతూ, ఎంతోమంది ఉపాధి కోసం పట్టణాలకు వెళుతున్నారు. నేను మాత్రం గ్రామాన్ని నమ్ముకుని జీవిస్తున్నాను.  ఈ 30 ఏళ్లలో కాలువ తవ్వుతుంటే నాకు సాయం చేసినవాళ్లే లేకుండా పోయారు. పశువులను మేత కోసం రోజు కొండ ప్రాంతానికి తోలుకొని వెళ్లేవాడిని, ఆ సమయంలో కాలువ తవ్వే పనులను చేసేవాడిని ’ అని తెలిపారు. లంగీభుయాన్‌ కాలువ తవ్వడంతో స్థానిక నేతలు, గ్రామ ప్రజలు ఆయనను ఘనంగా సత్కరించారు.  

 

జూలైలో క‌రోనా పేషెంట్ చ‌నిపోతే.. ప‌క్క‌న వారికోసం ఇప్పుడు స‌ర్చింగ్

జూలైలో క‌రోనా పేషెంట్ చ‌నిపోతే.. ప‌క్క‌న వారికోసం ఇప్పుడు స‌ర్చింగ్

   16 hours ago


బీజేపీ నయా ఎన్నికల స్టంట్.. ప్ర‌తి ఒక్క‌రికీ ఉచితంగా కోవిద్ టీకా

బీజేపీ నయా ఎన్నికల స్టంట్.. ప్ర‌తి ఒక్క‌రికీ ఉచితంగా కోవిద్ టీకా

   17 hours ago


భారత నౌకా దళంలోకి వచ్చేసిన ఐఎన్ఎస్ కవ‌ర‌త్తి.. శత్రువుల వెన్నులో వణుకే

భారత నౌకా దళంలోకి వచ్చేసిన ఐఎన్ఎస్ కవ‌ర‌త్తి.. శత్రువుల వెన్నులో వణుకే

   17 hours ago


ఏకంగా బ‌స్టాప్ నే ఎత్తుకెళ్లారు

ఏకంగా బ‌స్టాప్ నే ఎత్తుకెళ్లారు

   17 hours ago


కరోనా కేసుల సంఖ్యపై అప్డేట్స్..!

కరోనా కేసుల సంఖ్యపై అప్డేట్స్..!

   19 hours ago


టెట్‌ వ్యాలిడిటీ శాశ్వతం.. ఎన్‌సీటీఈ నిర్ణయం

టెట్‌ వ్యాలిడిటీ శాశ్వతం.. ఎన్‌సీటీఈ నిర్ణయం

   19 hours ago


భారత్ లో పరిశోధనలు ఎంతో ముఖ్యమని ప్రపంచానికి చెప్పిన బిల్ గేట్స్

భారత్ లో పరిశోధనలు ఎంతో ముఖ్యమని ప్రపంచానికి చెప్పిన బిల్ గేట్స్

   21-10-2020


సాయిబాబాకు మందులు, పుస్తకాలు కూడా ఇవ్వరా.. హరగోపాల్

సాయిబాబాకు మందులు, పుస్తకాలు కూడా ఇవ్వరా.. హరగోపాల్

   21-10-2020


ఫౌచీ ఒక ఇడియట్‌.. నోరు పారేసుకున్న ట్రంప్

ఫౌచీ ఒక ఇడియట్‌.. నోరు పారేసుకున్న ట్రంప్

   21-10-2020


చైనా సైనికుడిని అప్పగించేశారు

చైనా సైనికుడిని అప్పగించేశారు

   21-10-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle